బోట్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ఇప్పుడు దేశంలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గతేడాది ఆగస్టులో మన దేశంలో ఆవిష్కరించబడిన బోట్ స్మార్ట్ రింగ్ కంటే ఇది చాలా తక్కువ ధరకు లభించనున్నట్లు వెల్లడించింది. ఈ మోడల్ బోట్ స్మార్ట్ రింగ్ ధర రూ. 8,999గా ఉండగా తాజా మోడల్ ధర కేవలం రూ.2,999గా నిర్ణయించారు. ఇది భారతదేశంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ రింగ్‌గా నిలుస్తోంది. గతేడాది ప్రారంభించిన బోట్ స్మార్ట్ రింగ్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్‌గా చెప్పొచ్చు. ఇవి 17.40mm, 19.15mm మరియు 20.85mm మూడు పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి.
సంవత్సరం పాటు వారంటీ..
బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ అమ్మకాలు ఈ ఏడాది జూలై 20న మన దేశంలో ప్రారంభమై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు బోట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 18 నుండి ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. దీనిని ధరను అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ. 2,999గా బోట్ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్‌లో అనేక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు అందించడినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. రోజువారీ వినియోగంలో భాగంగా తయారు చేయబడిన ఈ రింగ్ బరువు కేవలం 4.7 గ్రాములు మాత్రమే ఉంటోంది. అంతేకాదు, స్మార్ట్ రింగ్ యాక్టివ్ పై ఒక సంవత్సరం పాటు వారంటీని కూడా బోట్ కంపెనీ అందిస్తోంది.ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు..
బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ మూడు రంగులతో ఐదు పరిమాణాలలో వస్తుందని ఇప్పటికే కంపెనీ ధృవీకరించింది. నలుపు, గోల్డ్, సిల్వర్ రంగులలో ఈ రింగ్ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ రింగ్ తయారీలో స్టెయిన్లెస్ స్టీల్‌ను వినిగించడం వల్ల ఇది చాలా దృఢంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ గత మోడల్ మాదిరిగానే అనేక సెన్సార్‌ల ద్వారా హార్ట్ బీట్ రేటు, రక్తంలో ఆక్సిజన్ (SpO2) స్థాయి, నిద్ర మరియు ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేయడం వంటి ఆటో హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఉండడం దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రింగ్‌తో మన రోజువారీ వ్యాయామంతోపాటు ఇతర కార్యకలాపాలను కూడా సులభంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రింగ్ 20 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు మన రోజువారీగా వేసే అడుగులను సైతం ఈ రింగ్ ద్వారా లెక్కించుకోవచ్చు. వినియోగదారులు బోట్ రింగ్ యాప్ ద్వారా డేటాను యాక్సెస్ చేసే వెసులుబాటు ఉంటుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ..
వాటర్ రెసిస్టన్స్ రేటింగ్‌ను ఇందులో కల్పించారు. ఈ కారణంగా సుమారు 50 మీటర్ల లోతులో కూడా ఒత్తిడిని తట్టుకుని పని చేయగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఇందులో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని కూడా అందించారు. అంతేకాదు, షేక్ జెశ్చర్స్ ద్వారా వినియోగదారులు ఫోటోలు తీసుకునే వెసులుబాటు ఉంది. మరోవైపు, ప్రస్తుతం ఉన్న బోట్ స్మార్ట్ రింగ్ మోడల్‌లో షార్ట్-ఫారమ్ వీడియో యాప్ నావిగేషన్‌తో పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా నియంత్రణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుత స్మార్ట్ రింగ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాబోయే స్మార్ట్ వేరబుల్‌లోనూ ఇలాంటి సరికొత్త ఫీచర్లను పొందుపరిచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరెందుకు ఆలస్యం.. మన దేశంలో తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ రింగ్ యాక్టివ్‌ను సొంతం చేసుకునేందుకు సిద్ధమవ్వండి.
మరింత చదవడం: