Pixel Watch 3, Google Pixel Buds Pro 2 ఫీచ‌ర్స్‌తోపాటు ధ‌ర మీకోసం!

Pixel Watch 3 దేశీయ మార్కెట్‌లో Wi-Fi కనెక్టివిటీతో 41mm డిస్‌ప్లే మోడ‌ల్‌ ప్రారంభ ధర రూ. 39,900గానూ, 45mm డిస్‌ప్లే Wi-Fi కనెక్టివిటీతో వ‌చ్చే మోడల్ ధర రూ. 43,900గానూ కంపెనీ నిర్ణ‌యించింది.

Pixel Watch 3, Google Pixel Buds Pro 2 ఫీచ‌ర్స్‌తోపాటు ధ‌ర మీకోసం!
ముఖ్యాంశాలు
  • Pixel Watch 3 41mm, 45mm డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులోకి
  • ఆగస్టు 22న ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా రిటైల్ అవుట్‌లెట్‌ల ద్
  • Pixel Buds Pro 2 మోడ‌ల్‌ 11mm డైనమిక్ డ్రైవర్‌లతో అమర్చబడి ఉంటుంది
ప్రకటన
మేడ్ బై గూగుల్ హార్డ్‌వేర్ ఈవెంట్ సందర్భంగా దేశీయ మార్కెట్‌లోకి Pixel Watch 3 third- జన‌రేష‌న్‌ స్మార్ట్‌వాచ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇది ఒక్క ఛార్జ్‌తో 36 గంటల బ్యాటరీ సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. రెండు డిస్‌ప్లేల‌ పరిమాణాలలో అందుబాటులో ఉండ‌నుంది. అలాగే, ఇదే సంద‌ర్భంలో Google Pixel Buds Pro 2ని కూడా ప్రారంభించింది. విడుద‌ల సంద‌ర్భంగా ఈ ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్‌ల సెట్‌ను కంపెనీ రూపొందించిన టెన్సర్ చిప్‌తో అమర్చారు.
Pixel Watch 3 దేశీయ మార్కెట్‌లో Wi-Fi కనెక్టివిటీతో 41mm డిస్‌ప్లే మోడ‌ల్‌ ప్రారంభ ధర రూ. 39,900గానూ, 45mm డిస్‌ప్లే  Wi-Fi కనెక్టివిటీతో వ‌చ్చే మోడల్ ధర రూ. 43,900గానూ కంపెనీ నిర్ణ‌యించింది. 41mm, 45mm వేరియంట్‌లు పాలిష్డ్ సిల్వర్ అల్యూమినియం కేస్, షాంపైన్ గోల్డ్ అల్యూమినియం కేస్, మ్యాట్ బ్లాక్ అల్యూమినియం కేస్ రంగులలో అందుబాటులో ఉన్నాయి. చిన్న మోడల్ కూడా సిల్వర్ అల్యూమినియం కేస్ రంగులో నాల్గవ స్థానంలో అమ్మ‌కానికి అందుబాటులో ఉంది. దీంతోపాటు విడుద‌లైన Pixel Buds Pro 2 ధర రూ. 22,900గా ఉంది. ఈ TWS హెడ్‌సెట్ హాజెల్, పియోనీ, పింగాణీ, వింటర్‌గ్రీన్ రంగులలో అందుబాటులో ఉండ‌నుంది. Pixel Watch 3,  Pixel Buds Pro 2లు మ‌న దేశంలో ఆగస్టు 22న ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించనున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది.

Pixel Watch 3 స్పెసిఫికేషన్స్‌

Pixel Watch 3 మొత్తంగా 41mm, 45mm రెండు డిస్‌ప్లే పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లకు కంపెనీ యొక్క Actua డిస్‌ప్లేను అమర్చారు. గ‌తంలో వ‌చ్చిన‌ స్మార్ట్‌వాచ్ మోడల్‌లా కాకుండా, AMOLED స్క్రీన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 2,000నిట్‌ల బ్రైట్‌నెస్ స్థాయికి స‌పోర్ట్ చేస్తుంద‌ని, గత ఏడాది వ‌చ్చిన‌ మోడల్‌తో పోలిస్తే ఇది రెట్టింపు ఉంటుంద‌ని, చీకటి వాతావరణంలో 1 నిట్‌కి త‌గ్గిపోవ‌చ్చ‌ని Google తెలిపింది. బెజెల్స్ కూడా  మునుపటి దాని కంటే 16 శాతం సన్నగా ఉన్నాయి. క్యాడెన్స్, స్ట్రైడ్ లెంగ్త్, వర్టికల్ ఆసిలేషన్ వంటి వివరాలను చూసుకోవ‌చ్చ‌ని కంపెనీ వెల్ల‌డించింది. అలాగే, క‌స్ట‌మైజ్‌డ్‌ రన్నింగ్ రొటీన్స్, Google ఏఐ ఇన్ సైట్స్, కార్డియో లోడ్ ట్రాకింగ్ వంటి స‌రికొత్త ఫీచర్లతో అధునాతన ఫిట్నెస్ ట్రాకింగ్‌ను ఇది ఇంటిగ్రేట్ చేస్తోంది. 

Pixel Buds Pro 2  స్పెసిఫికేషన్స్‌

Google Pixel Buds Pro 2 టెన్సర్ A1 చిప్‌తో కూడిన కంపెనీ మొదటి TWS హెడ్‌సెట్‌గా వ‌స్తోంది. ఇది ఆడియోను ప్రాసెస్ చేస్తున్నప్పుడు శ‌బ్ధ‌ వేగం కంటే ప్రాసెసర్ 90 రెట్లు ఎక్కువ వేగ‌వంత‌గా ప‌నిచేస్తుంది. Google సైలెంట్ సీల్ 2.0 అలాగే, మొదటి తరం పిక్సెల్ Buds Pro మోడల్‌తో పోలిస్తే Pixel Buds Pro 2 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వద్ద రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటోంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. అలాగే, Pixel Buds Pro 2 మోడ‌ల్‌ 11mm డైనమిక్ డ్రైవర్‌లతో అమర్చబడి ఉంటుంది. ఇది ఫోన్ కాల్‌లు చేస్తున్నప్పుడు చుట్టుప‌క్క‌ల‌ శబ్దాలను తగ్గించే క్లియర్ కాలింగ్ ఫీచర్‌తో రూపొందించబడి, అప్‌డేట్ చేయబడిన అల్గారిథమ్‌లను కూడా కలిగి ఉంది. అదే సమయంలో, ఫోన్ కాల్ వ‌చ్చిన‌ప్పుడు మీడియా ప్లేబ్యాక్‌ను పాజ్ చేస్తుంది. బ‌డ్స్ ధరించిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కాల్‌ మోడ్‌ను ప్రారంభిస్తుంది. అలాగే, ANCని మళ్లీ ప్రారంభించి సంభాషణ పూర్తయిన తర్వాత ప్లేబ్యాక్‌ను పునఃప్రారంభిస్తుంది. TWS హెడ్‌సెట్ Google యొక్క Find My Device నెట్‌వర్క్‌కు మద్దతిస్తూ.. వాటిని మ్యాప్‌లో చూపిస్తుంది.
 
Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. మార్కెట్లోకి అతి తక్కువ ధరకే లావా ప్రోబడ్స్ ఎన్ 33.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
  2. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్ ఫీచర్స్ లీక్.. కెమెరానే హైలెట్ కానుందా?
  3. ఇదికి తోడుగా OnePlus ప్రకటించిన మరో సొల్యూషన్ OP FPS Max.
  4. ఇందులో రెండు 50 మెగాపిక్సల్ సెన్సర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
  5. మార్కెట్లోకి రానున్న Realme GT 8 Pro.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే
  6. రియల్‌మీ ఈ సిరీస్‌ను తొలిసారిగా అక్టోబర్ 21న చైనాలో ఆవిష్కరించింది
  7. ఐకూ 15 మోడల్ వివరాలు లీక్.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  8. ఈ రెండు ఫోన్లు నవంబర్ 3 నుంచి యూరప్‌లో విక్రయానికి వస్తాయి. Vivo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు
  9. iQOO Neo 11 ధర చైనాలో CNY 2,599 (దాదాపు రూ. 32,500) నుంచి ప్రారంభమవుతోంది
  10. భారత వినియోగదారులు OnePlus 15 లాంచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »