Photo Credit: Xiaomi
రెడ్‌మి వాచ్ మూవ్ బ్లూ బ్లేజ్, బ్లాక్ డ్రిఫ్ట్, గోల్డ్ రష్ మరియు సిల్వర్ స్ప్రింట్ షేడ్స్‌లో వస్తుంది
మన దేశంలో Redmi Watch మూవ్ లాంఛ్ అయ్యింది. ఇది చాలా రకాల హెల్త్, వెల్నెస్ మానిటరింగ్ మెట్రిక్‌లను అందిస్తోంది. అలాగే, 98.5 శాతం ట్రాకింగ్ accuracyని ఈ వాచ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. రెక్టాంగ్లర్ AMOLED డిస్‌ప్లే, ఫంక్షనల్ రొటేటింగ్ క్రౌన్‌తో ఈ స్మార్ట్ వాచ్ వస్తోంది. ఇది Xiaomi HyperOS యూజర్ ఇంటర్‌ఫేస్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అవుతూ.. హిందీ లాగ్వేజ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ 14 రోజుల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. మే నెల నుంచి మన దేశంలో కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది.మే నెల 1వ తేదీ నుంచి,భారత్‌లో Redmi Watch మూవ్ ధరను భారత్‌లో రూ. 1999గా నిర్ణయించారు. ఈ వాచ్ మే నెల 1వ తేదీ నుంచి Xiaomi ఇండియా వెబ్ సైట్, Xiaomi రిటైల్ స్టోలతోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మాకాలు మొదలవుతాయి. వాచ్ కోసం ప్రీ- బుకింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. Redmi Watch మూవ్ బ్లూ బ్లేజ్, బ్లాక్ డ్రిఫ్ట్, గోల్డ్ రష్, సిల్వర్ స్ప్రింట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
ఈ కొత్త వాచ్ 1.85-అంగుళాల రెక్టాంగ్లర్, 390 x 450 పిక్సెల్ రిజల్యూషన్‌తో 2.5 కర్వ్డ్ AMOLED స్క్రీన్, 60Hz వరకూ రిఫ్రెష్‌రేట్, 600 నిట్స్ బ్రైట్‌నెస్, 74 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తోంది. ఇది 140 కంటే ఎక్కువ ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. హార్ట్ బీట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయి(SPO₂), ఒత్తిడి స్థాయి, స్లీప్ సైకిల్‌తోపాటు menstrual ట్రాకర్‌లను కలిగి ఉంది.
ఇది నోట్స్, ఈవెంట్ క్యాలెండర్, రియల్ టైం వెదర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌తోపాటు హిందీ లాగ్వేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. Mi ఫిట్‌నెస్ యాప్‌కు అనుకూలంగా ఉండడంతోపాటు ఆండ్రాయిడ్, iOS డివైజ్‌లతో వస్తోంది. యాప్ ద్వారా వాచ్‌లో పది వరకూ కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. స్పిన్నింగ్ క్రౌన్ యూజర్‌లను ఒక వేలితో యాప్‌లు, అలర్ట్‌లను స్క్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ వాచ్ యాంటీ అలెర్జీ TPU స్ట్రాప్‌తో దుమ్ము, నీటి నియంత్రణకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
ఈ Redmi Watch మూవ్ 300 mAh బ్యాటరీతో వస్తుంది. సాధారణ వినియోగంతో 14 రోజుల వరకూ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఎక్కువ వినియోగంతో బ్యాటరీ పది రోజుల వరకూ ఉంటుంది. ఆల్వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ఆన్‌లో ఉంచడం ద్వారా ఐదు రోజుల వరకూ బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంది. దీనికి అల్ట్రా బ్యాటరీ సేవర్ మోడ్ కూడా ఉంది. వాచ్ బాడీ 45.5 x 38.9 x 10.8mm పరిమాణంతో 25 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన