Photo Credit: PhonePe
PhonePe, NPCI యొక్క సొంత BHIM యాప్‌లో చేరింది, ఇది UPI సర్కిల్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది
మన దేశంలో PhonePe UPI సర్కిల్ ప్రారంభించబడింది. ఈ UPI సర్కిల్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ UPI ఖాతాను ఫ్యామిలీ మెంబర్స్ లేదా స్నేహితులకు షేర్ చేయవచ్చు. తద్వారా వారు ఆ UPI ఖాతాను ఉపయోగించి లావాదేవీలు జరపొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డెవలప్ చేసిన ఈ ఫీచర్ ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికలు వేస్తోంది. నిజానికి, PhonePe ప్రధాన పోటీదారుగా ఉన్న Google Pay గత ఏడాది ఆగస్టులో UPI సర్కిల్‌కు సపోర్ట్ చేసింది. అయితే, ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు.సొంతంగా UPI ID లు,వాల్‌మార్ట్-ఓన్డ్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం చెబుతున్నదాని ప్రకారం.. ఈ కొత్త UPI సర్కిల్ ఫీచర్ అనేది ఇప్పుడు మన దేశంలోని PhonePe వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీంతో PhonePe వినియోగదారులు తమ కాంటాక్ట్స్‌లోని కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఓ సర్కిల్‌ను క్రియేట్ చేసి, బ్యాంక్ అకౌంట్ లేనప్పటికీ వారికి UPI ID లను రూపొందించవచ్చు. ప్రైమరీ PhonePe వినియోగదారు సెకండరీ వినియోగదారులను ఆ సర్కిల్‌లోకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో సెకండరీ వినియోగదారులకు UPI ID లు సొంతంగా క్రియేట్ అవుతాయి. వాటిని ఉపయోగించి వారు ఆన్‌లైన్ కొనుగోళ్లు, బిల్లులు చెల్లింపులు వంటివి చేసుకోవచ్చు. అయితే, ఆ మొత్తం ప్రైమరీ వినియోగదారుని ఖాతాను డెబిట్ అవుతుంది.
అలాగే, ఈ PhonePe లో UPI సర్కిల్ ఫీచర్‌ను ప్రైమరీ వినియోగదారు నియంత్రించవచ్చు. Partial Delegation mode ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే ప్రైమరీ వినియోగదారునికి సెకండరీ వినియోగదారుడు UPI ID ఉపయోగించినప్పుడల్లా అలర్ట్ వెళ్లిపోతుంది. దానిని అంగీకరిస్తేనే ఆ లావాదేవీ పూర్తవుతుంది. అలాగే, రెండో నియంత్రణ Full Delegation. ఇది ప్రైమరీ వినియోగదారుడు సెకండరీ వినియోగదారుని కోసం గరిష్ట నెలవారీ ఖర్చు పరిమితిని సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే, మాన్యువల్‌గా ఈ లావాదేవీలను ఆమోదించాల్సిన అవసరం ఉండదు.
ఈ Full Delegation ఆప్షన్‌లో ప్రైమరీ వినియోగదారుడు రూ. 15,000 వరకు లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. అలాగే, UPI సర్కిస్‌లో ప్రతి లావాదేవీకి రూ. 5,000 పరిమితి ఉంటుంది. అంతేకాదు, ప్రైమరీ వినియోగదారులు యాక్సెస్‌ను ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. అలాగే, సెకండరీ వినియోగదారులు చేసే అన్ని లావాదేవీలను కూడా పరిశీలించవచ్చు. ప్రతి సెకండరీ వినియోగదారుడు వేరే నెలవారీ ఖర్చు లిమిట్‌ను కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది.
PhonePe లో UPI సర్కిల్‌లో ప్రైమరీ వినియోగదారులు ఐదుగురు వరకూ సెకండరీ వినియోగదారులను అటాచ్ చేసుకోవచ్చు. అయితే, సెకండరీ వినియోదారు ఒక ప్రైమరీ వినియోదారుకు మాత్రమే లింక్ చేయబడతారు. అంతే కాదు, భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ ద్వారా కూడా వినియోగదారులు ఈ UPI సర్కిల్ ఫీచర్‌ను ట్రై చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన