సంక్రాంతికి వస్తున్నాం OTT రిలీజ్‌ తేదీ వ‌చ్చేసింది.. మార్చి 1, 2025న Zee5లో ప్ర‌సారం కానుంది

జనవరి 14, 2025న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలో విడుదలై మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం OTT రిలీజ్‌ తేదీ వ‌చ్చేసింది.. మార్చి 1, 2025న Zee5లో ప్ర‌సారం కానుంది

Photo Credit: Zee5

సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1, 2025 నుండి Zee5లో ప్రసారమవుతుంది

ముఖ్యాంశాలు
  • వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించారు
  • ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 184 కోట్లు వసూలు చేసింది
  • డిజిట‌ల్ రిలీజ్‌ సంద‌ర్భంగా ప‌లు స‌న్నివేశాలు యాడ్ చేసే అవ‌కాశం
ప్రకటన

థియేట‌ర్‌ల‌లో విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకున్న‌ సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద కానుల వ‌ర్షం కురిపించిన‌ ఈ సినిమా మార్చి 1, 2025న Zee5లో ప్ర‌చారం కానుంది. జనవరి 14, 2025న సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలో విడుదలై మంచి ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నారు.

ఖ‌రీదైన‌ స్ట్రీమింగ్ డీల్స్‌లో

సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ మార్చి 1, 2025 నుండి Zee5 లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండ‌నుంది. అలాగే, OTT విడుదలతో పాటు, ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కూడా అదే రోజున ఉంటుంది. Zee5 డిజిటల్ హక్కులను రూ. 30 కోట్లకు దక్కించుకుంది. ఇది ఇటీవలి కాలంలో అత్యంత ఖ‌రీదైన‌ స్ట్రీమింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచిందనే చెప్పాలి. థియేట్రికల్ ప్రీమియర్‌కు ముందు విడుదలైన సంక్రాంతికి వస్తున్నం ట్రైలర్, కామెడీ, డ్రామా, వినోద‌భ‌రిమైన, కుటుంబస‌మేతంగా చూడ‌ద‌గ్గ‌ చిత్రంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా, ఈ సినిమా సంతోష‌క‌ర‌మైన‌ కుటుంబం, ఆ కుటుంబంలో తలెత్తే హాస్యంతో కూడిన సంబ‌ర్భాల చుట్టూ తిరుగుతుంది.

సంగీతంపై ప్ర‌శంస‌లు

ఈ సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీలో తెలుగు సీనియ‌ర్ న‌టుడు వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లతో కలిసి న‌టించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు సహాయక తారాగణంలో ఉన్నారు. అలాగే, ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన భీమ్స్ సిసిరోలియో ప్రేక్షకులను సినిమా వైపు తిప్పుకోవ‌డంలో కీలక పాత్ర పోషించార‌నే చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో దిల్ రాజు నిర్మించారు.

మ‌రికొన్ని కామెడీ సీన్స్‌

తాజాగా, సంక్రాంతికి వ‌స్తున్నాం డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌ల సంద‌ర్భంగా సినిమాలో ప‌లు స‌న్నివేశాలను జోడించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా, ఫ్లాష్‌బ్యాక్‌లో వెంక‌టేష్‌, మీనాక్షి చౌదరి మధ్య మ‌రికొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్ చేసే అవ‌కాశం ఉంది. ఈ సీన్స్ యాడ్ చేయ‌డం వ‌ల్ల‌ సినిమాకు మరింత బలం చేకూరుతుంద‌ని టీమ్ అభిప్రాయ‌ప‌డుతోంది. అలాగే, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలను జోడించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అయితే, ఈ విషయంపై సినిమా టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు.

తెలుగు మార్కెట్‌లో రూ. 300 కోట్లు

సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రూ. 184 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. అలాగే, తెలుగు మార్కెట్‌లోనే రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను సాధించింది. అంతే కాదు, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ వంటి సంక్రాంతికి విడుదలైన సినిమాల‌ నుండి పోటీ ఉన్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ, ఆకర్షణీయమైన స్క్రీన్‌ప్లే దీనికి ఆ స్థానాన్ని అందించాయ‌ని పరిశ్రమ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »