హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడతో సహా బహుళ భాషలలో అందుబాటులోకి రానుంది.
Photo Credit: Sony LIV
మార్కో సోనీ LIVలో బహుళ భాషల్లో ప్రీమియర్‌లను ప్రదర్శిస్తుంది
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న మలయాళ యాక్షన్-థ్రిల్లర్ మూవీ మార్కో OTT విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. Sony LIVలో ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రసారం కానున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. విజయవంతమైన థియేటర్ రన్ తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడంతో మరింత ప్రేక్షకాధారణ పొందుతుందని భావిస్తున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడతో సహా బహుళ భాషలలో అందుబాటులోకి రానుంది.
Sony LIVలో ఈ నెల 14 నుండి మార్కో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. దీంతో అనేక ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులు దీని ఉత్కంఠభరితమైన కథనాన్ని వీక్షించేందుకు వీలు కలిగినట్లు అవుతోంది. అయితే, మార్కో హిందీ వెర్షన్ డిజిటల్ రిలీజ్ తేదీ ఇంకా ప్రకటించకపోవడంతో అభిమానులు ఒకింత సినిమా విడుదల అప్‌డేట్ కోసం వేచి చూస్తున్నారు.
మార్కో ట్రైలర్ చూసినప్పుడే ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఉన్న కథాంశంపై ఆసక్తి నెలకొంటుంది. సినిమాలో తన సోదరుడు విక్టర్ మరణానికి ప్రతీకారం తీర్చుకునే మార్కో ప్రాత్రలో ఉన్ని ముకుందన్ నటన సినీ విమర్శకులను సైతం ఆకట్టుకునేలా ఉంది. టోనీ ఇసాక్ నేతృత్వంలోని క్రూరమై సిండికేట్‌ల చేతిలో విక్టర్ కిరాతంగా చంపబడిన తర్వాత, మార్కో న్యాయం కోసం రంగంలోకి దిగుతాడు. టోనీ క్రూరుడైన కొడుకుతో సహా అందరి ప్రత్యర్థులనూ ఎదుర్కొంటాడు. ద్రోహం, హత్య, ప్రతీకారం వంటి అంశాలతో కూడిన క్రూరమైన ప్రపంచాన్ని శాసించే పాత్రలో మార్కో ఒంటరిగా పోరాడుతాడు.
మార్కో మూవీకి హనీఫ్ అదేని దర్శకత్వం వహించగా, మార్కో ది'పీటర్ ప్రధాన పాత్రలో ఉన్ని ముకుందన్ నటించారు. ఈ చిత్రంలో జార్జ్ ది'పీటర్‌గా సిద్ధిక్, మార్కో పెంపుడు సోదరుడు టోనీ ఐజాక్‌గా జగదీష్, రస్సెల్ ఐజాక్‌గా అభిమన్యు తిలకన్ వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. అలాగే, కీలక పాత్రలలో సైరస్ ఐజాక్‌గా కబీర్ దుహన్ సింగ్, దేవ్‌గా అన్సన్ పాల్, మార్కో కాబోయే భార్యగా యుక్తి తరేజా నటించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించగా, దీని సినిమాటోగ్రఫీ చంద్రు సెల్వరాజ్.
థియేటర్లలో విడుదలైన తర్వాత మార్కో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. రూ. 100 కోట్ల మార్కును దాటి, రూ. 115 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి A- రేటింగ్ పొందిన మలయాళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా మొదట డిసెంబర్ 20న మలయాళం, హిందీలో విడుదలైంది. ఆ తర్వాత జనవరి 1న తెలుగులో, జనవరి 31న కన్నడలో రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ ముందు దీని యాక్షన్-ప్యాక్డ్ కథనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకుందనే చెప్పాలి. తాజాగా, దీని OTT అరంగేట్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Could Reportedly Use BOE Displays for Its Galaxy Smartphones, Smart TVs
OpenAI, Anthropic Offer Double the Usage Limit to Select Users Till the New Year