ఇండియాలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది డాల్బీ సినిమాను లాంఛ్ చేయ‌నున్న‌ డాల్బీ లాబొరేటరీస్

డాల్బీ సినిమాతో ప్రేక్ష‌కులు మ‌రింత‌ మెరుగైన పిక్చ‌ర్‌, సౌండ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ హైదరాబాద్‌లోని సినిమా కోసం మొదటి డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాన్ని అందించింది

ఇండియాలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది డాల్బీ సినిమాను లాంఛ్ చేయ‌నున్న‌ డాల్బీ లాబొరేటరీస్

Photo Credit: Pexels/ Bence Szemerey

ఈ సంవత్సరం భారతదేశంలో డాల్బీ సినిమా ప్రారంభంలో ఆరు థియేటర్లలోకి వస్తుంది.

ముఖ్యాంశాలు
  • డాల్బీ లాబొరేటరీస్ ఇప్పటివరకు దేశంలోని ఆరు exhibitorsతో ఒప్పందం
  • డాల్బీ సినిమా మ‌రింత‌ నాణ్య‌మైన‌ ఆడియో, విజువ‌ల్ అనుభవాలను అందించ‌నుంది
  • మొదటి డాల్బీ సినిమా థియేటర్ 2014లో ప్రారంభించబడింది
ప్రకటన

డాల్బీ లాబొరేటరీస్ మ‌న దేశంలో డాల్బీ సినిమాను ప్రారంభించ‌నున్నట్లు అధికారికంగా వెల్ల‌డించింది. ఇది మ‌రికొన్ని నెల‌ల్లో భార‌త్‌లోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో అందుబాటులోకి రానుంది. ప్ర‌ముఖ‌ టెక్నాలజీ సంస్థ డాల్బీ విజన్ ద్వారా సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ సినిమా ఉపయోగపడుతుందని సినిమా వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ సాంకేతికత కారణంగా థియేటర్‌ అనుభవాన్ని మ‌రింత‌ అప్‌గ్రేడ్ చేయొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే, ప్రేక్ష‌కులు మ‌రింత‌ మెరుగైన పిక్చ‌ర్‌, సౌండ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ హైదరాబాద్‌లోని సినిమా కోసం మొదటి డాల్బీ-సర్టిఫైడ్ పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాన్ని అందించింది.ఎంపిక చేసిన సిటీలు,రాబోయే మ‌రికొన్ని నెలల్లో భార‌త్‌లో డాల్బీ సినిమాను ప్రారంభించేందుకు ఆరు exhibitorsతో ఒప్ప‌ద్దం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో వెల్ల‌డించింది. ఆ జాబితాలో సిటీ ప్రైడ్ (పూణే), అల్లు సినీప్లెక్స్ (హైదరాబాద్), LA సినిమా (తిరుచ్చి), AMB సినిమాస్ (బెంగళూరు), EVM సినిమాస్ (కొచ్చి), G సినీప్లెక్స్ (ఉలిక్కల్) ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య‌ను మ‌రింత పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెండు కీల‌క టెక్నాల‌జీల‌ను

ఇలా అప్‌గ్రేడ్ చేసిన థియేటర్లలో డాల్బీ లాబొరేటరీస్ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ అనే రెండు కీల‌క టెక్నాల‌జీల‌ను అటాచ్ చేయ‌డం ద్వారా సినిమా వీక్షించే ప్రేక్షకులు మ‌రింత‌ ప్రయోజనం పొందుతారు. డాల్బీ విజన్ హై బ్రైట్‌నెస్‌తోపాటు పెరిగిన కాంట్రాస్ట్‌ను, wider colourను అందిస్తోంది. అలాగే, డాల్బీ అట్మోస్ డైనమిక్ ఆడియోను అటాచ్ చేయ‌డం ద్వారా థియేట‌ర్ లోప‌ల సౌండ్ క్వాల‌టీ మ‌రింత మెరుగుప‌డుతుంది. ఈ కార‌ణంగా ప్రేక్ష‌కులు స‌రికొత్త అనుభూతిని పొందుతారు.

వినోద రంగానికి కీలకమైన క్షణం

సినిమా నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చుకు అనుగుణంగా, అదే రీతిలో ప్రేక్ష‌కుల‌కు వీక్ష‌ణ అనుభ‌వాన్ని చేరువ‌చేసేందుకు డాల్బీ సినిమా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. అలాగే, డాల్బీ సినిమా డిజైన్‌తో కలిపి ప్రతి సీటు ఇంట్లో కూర్చొని వీక్షించే ఫీలింగ్‌ను క‌లిగిస్తుంద‌ని గ‌ట్టిగా చెబుతోంది. ఇండియాలో డాల్బీ సినిమా ప్రారంభం దేశ వినోద రంగానికి కీలకమైన క్షణమ‌ని డాల్బీ లాబొరేటరీస్ వరల్డ్‌వైడ్ సినిమా సేల్స్ అండ్ పార్టనర్ మేనేజ్‌మెంట్ VP మైఖేల్ ఆర్చర్ స్ప‌ష్టం చేశారు. ఈ ప్రవేశం ప్రేక్ష‌కుల‌కు మ‌రింత మెరుగైన అనుభ‌వాన్ని అందిస్తుంద‌ని సినిమా వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో

మొదటి డాల్బీ సినిమా థియేటర్ 2014లో ప్రారంభించబడింది. అప్పటి నుండి కంపెనీ భార‌త్‌తో సహా 14 దేశాలలో 35 ఎగ్జిబిటర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఏడాది జనవరిలో హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంతో మ‌న దేశంలో మొట్టమొదటి డాల్బీ-సర్టిఫైడ్ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ ఫెసిలిటీ ప్రారంభించబడింది. అలాగే, దేశవ్యాప్తంగా 24 డాల్బీ అట్మోస్ థియేట్రికల్ మిక్సింగ్ ఫెసిలిటీస్‌ ఉన్నాయని, ఇవి డాల్బీ సినిమా ఫార్మాట్‌లో కంటెంట్‌ను రూపొందించడానికి స‌పోర్ట్ చేస్తాయ‌ని డాల్బీ లాబొరేటరీస్ స్ప‌ష్టం చేసింది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. వాట్సప్‌లో కొత్త అప్డేట్.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
  2. జియో సావన్‌లో యాడ్ ఫ్రీ మ్యూజిక్.. ఈ వివరాలు తెలుసుకోండి
  3. స్క్రీన్-టు-బాడీ రేషియో 94.37%గా ఉంది, అంటే బెజెల్‌లు చాలా సన్నగా ఉంటాయి.
  4. అయితే, వైర్‌లెస్ చార్జింగ్ పై వివరాలు ఇంకా వెల్లడించలేదు.
  5. అదనంగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నారు.
  6. రియల్ మీ నుంచి కొత్త మోడల్.. అదిరే ఫీచర్స్, కళ్లు చెదిరే ధర
  7. ఆ యాక్సెస్‌లను నిలిపివేసిన వాట్సప్.. కారణం ఏంటంటే?
  8. రెడ్ మీ K90లో “సూపర్ పిక్సెల్” డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించారు
  9. ఇందులో వినియోగదారులు 2.5% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందుతారు
  10. కనెక్టివిటీ కోసం ఇది Wi-Fi 7 మరియు Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »