Photo Credit: JioHotstar
ఇప్పటికే ఉన్న JioCinema మరియు Disney+ Hotstar సబ్‌స్క్రైబర్‌లు తమ సబ్‌స్క్రిప్షన్‌లను మార్చుకోగలరు
రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి రూపొందించిన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌ను జియోస్టార్ లాంఛ్ చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ ప్లాట్‌ఫామ్ రెండు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌ల మొత్తం కంటెంట్ లైబ్రరీని హోస్ట్ చేస్తుంది. తాజాగా, ఈ రెండు విలీన సంస్థల నుండి షోలు, సినిమాలతో పాటు, వివిధ అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నుండి కంటెంట్‌ను కూడా హోస్ట్ చేస్తుంది. జాయింట్ వెంచర్ స్ట్రీమింగ్ సర్వీస్ కోసం ఫ్రీ టైర్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా, వయాకామ్ 18, స్టార్ ఇండియా విజయవంతమైన విలీనం తర్వాత నవంబర్ 2024లో జియోస్టార్ జాయింట్ వెంచర్ ఏర్పడింది.
జియోస్టార్ తమ జియోహాట్‌స్టార్ లాంఛ్‌ను పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించింది. కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గురించి వివరాలను వెల్లడించింది. కొత్త ప్లాట్‌ఫామ్ దాదాపు 3లక్షల గంటల కంటెంట్‌తో పాటు లైవ్ స్పోర్ట్స్ కవరేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. రెండు ప్లాట్‌ఫామ్‌లలోని వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్లాట్‌ఫామ్ మొత్తం 50 కోట్లకు పైగా వినియోగదారుల బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ సంఖ్య జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ ఖాతాలు రెండూ ఉన్నవారిని మినహాయించిందా? లేదా? అనేదానిపై స్పష్టంగా లేదు. కొత్త ప్లాట్‌ఫామ్ కొత్త లోగోను జియో హాట్‌స్టార్ అనే పదంతో ఏడు కోణాల నక్షత్రం వచ్చేలా రూపొందించింది.
ప్రస్తుతానికి జియో హాట్‌స్టార్ కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు, చూడవచ్చు. వినియోగదారులు షోలు, సినిమాలు లేదా లైవ్ స్పోర్ట్స్ చూసేందుకు సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. అయితే, నిర్దిష్ట కంటెంట్ పేవాల్ వెనుక ఉంటుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది. నిరంతరాయమైన, మెరుగైన అనుభవం కోసం చూస్తున్న వారికి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉన్నాయని జేవీ ప్రకటించింది. చెల్లింపు సబ్‌స్క్రైబర్‌లకు ప్రకటనలు లేకుండా, అధిక రిజల్యూషన్‌లో షోలను వీక్షించవచ్చు.
ఇక సబ్‌స్క్రిప్షన్‌ల విషయానికి వస్తే, జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రస్తుత సబ్‌స్క్రైబర్‌లు ఆటోమెటిక్‌గా కొత్త ప్లాట్‌ఫామ్‌కు మారుతారు. ఈ వినియోగదారులు మొదటిసారి లాగిన్ అయినప్పుడు వారి జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను సెటప్ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. కొత్త సబ్‌స్క్రైబర్‌లు రూ. 149 నుండి ప్రారంభమయ్యే కొత్త ప్లాన్‌ల ద్వారా బ్రౌజ్ చేయొచ్చు. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాల ప్రీమియం ప్లాన్ నెలకు రూ.299, మూడు నెలల ప్రీమియం ప్లాన్ రూ.499, ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499గా నిర్ణయించింది.
జియో హాట్‌స్టార్ వివిధ రకాల కంటెంట్ ఫార్మాట్‌లలో 10 భారతీయ భాషలలో కంటెంట్‌ను అందిస్తుంది. అలాగే, వీక్షకులు సినిమాలు, షోలు, డాక్యుమెంటరీలు, లైవ్ స్పోర్టింగ్ ఈవెంట్‌లను చూడగలరు. ఈ ప్లాట్‌ఫారమ్ అంతర్జాతీయ ప్రీమియర్‌లను కూడా ప్రదర్శిస్తుందని కంపెనీ తెలిపింది. అదనంగా, జియో హాట్‌స్టార్ డిస్నీ, NBCUniversal Peacock, Warner Bros., Discovery HBO, Paramount నుండి కంటెంట్‌ను టెలికాస్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన