మార్కో సినిమా డిజిటల్ హక్కులను Sony LIV సంస్థ సొంతం చేసుకుంది. ఇది మలయాళ చలన చిత్ర చరిత్రలో అత్యధిక ధరను పొందినట్లు సమాచారం.
Photo Credit: YouTube
മലയാള സിനിമ 100 കോടി കടന്നു. റെക്കോർഡുകൾ തകർത്ത് 115 കോടി
ప్రముఖ మళయాల యువ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన యాక్షన్-డ్రామా చిత్రం మార్కో. థియేటర్‌లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 115 కోట్లకుపైగా వసూలు చేసి పలు రికార్డులను బద్దలు కొట్టింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా వైలెన్స్‌తోపాటు ఉత్కంఠభరితమైన కథనంతో రూ. 100 కోట్ల మార్కును అధిగమించిన మొదటి A- రేటింగ్ పొందిన మలయాళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత, సంచలనాత్మక OTT ఒప్పందాన్ని చేసుకోవడం ద్వారా మరొక రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను Sony LIV సంస్థ సొంతం చేసుకుంది. ఇది మలయాళ చలన చిత్ర చరిత్రలో అత్యధిక ధరను పొందినట్లు సమాచారం.
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన మార్కో సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న మన ప్రేక్షకుల ముందుకొచ్చింది. వస్తూ.. వస్తూనే ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిందనే చెప్పాలి. తాజాగా, మార్కో స్ట్రీమింగ్ హక్కులు సోనీ LIV పొందినట్లు స్పష్టమైంది. అయితే, సినిమా ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించబడలేదు. ఈ చిత్రం OTT ప్రీమియర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు మరింత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఇందుకు కారణం, మార్కో సినిమా త్వరలో కన్నడ థియేటర్లలో విడుదల కానుంది. దీంతో స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలో వస్తాయని భావిస్తున్నారు.
మార్కో సినిమా ట్రైలర్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతోపాటు తీవ్రమైన వైలెన్స్‌తో నిండిన కథనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ కథ మొత్తం ఒక వ్యక్తి ప్రతీకార ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. తనను మోసం చేసిన వారిపై కథానాయకుడు ప్రతిదాడి అనుక్షణం ప్రేక్షకులను అలరిస్తుంది. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విజువల్స్, ఉత్తేజకరమైన సన్నివేశాలతో నడిచే ఈ యాక్షన్-డ్రామా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
హనీఫ్ అదేని దర్శకత్వంలో షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ మార్కో మూవీలో అద్భుతమైన తారాగణం ఉంది. ఉన్ని ముకుందన్‌తో పాటు ఈ చిత్రంలో సిద్ధిఖ్, జగదీష్, అభిమన్యు ఎస్. తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలెట్‌గా నిలుస్తుంది. ఈ మ్యూజిక్ థియేటర్‌లలో వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది.
మొత్తంగా, గత సంవత్సరం భారీ నష్టాలను చవిచూసి, విమర్శలను ఎదుర్కొన్న మలయాళ చిత్ర పరిశ్రమకు మార్కో మూవీ మళ్లీ ఊపిరిపోసిందనే చెప్పాలి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద రూ. 115 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. దీనికి IMDb రేటింగ్ 7.5 / 10గా ఉంది. OTT ప్రీమియర్‌లో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Grand Theft Auto 6 Delayed Again, Rockstar Games Sets New November 2026 Launch Date