Photo Credit: YouTube
అనేక వాయిదాల తర్వాత ఎట్టకేటలకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తెలుగు థ్రిల్లర్ చిత్రం పోతుగడ్డ విడుదలకు సిద్ధమైంది. రక్ష వీరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 30, 2025న OTTలోకి రానుంది. నిజానికి, నవంబర్ 2024లో మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, ఈ సినిమా ప్రీమియర్‌ను సంక్రాంతి పండుగ తర్వాతకు వాయిదా వేసి, డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్‌పై విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమా ఓ ప్రేమకథకు రాజకీయంగా ప్రభావితమైన కథాంశాన్ని జోడించి, ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఆ ప్రేమ జంట ప్రయాణిస్తోన్న బస్సులో ఏం జరిగింది? రాజకీయ చదరంగంలో వారి ప్రేమ ప్రయాణం, మనుగడ కోసం సాగే పోరాటంగా ఎలా మారుతుంది? ఇలాంటి ఆసక్తికర కథాంశంతో దర్శకుడు మూవీపై మరింత ఆసక్తిని రేకెత్తించారనే చెప్పాలి.
ఈ సినిమా ప్రత్యేకంగా OTT ప్లాట్‌ఫారమ్ ETV Winలో స్ట్రీమింగ్ అవుతుంది. అనేక వాయిదాల తర్వాత, ఈ థ్రిల్లర్ జనవరి 30, 2025న స్ట్రీమింగ్‌కు సిద్ధమైందనే చెప్పాలి. కారణాలు ఏవైనా, ఈ ఆలస్యమే మూవీపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పోతుగడ్డ సినిమా ట్రైలర్‌ను చూస్తేనే ఇది ఫ్యాక్షన్, ప్రేమ కథా చిత్రంగా కనిపిస్తోంది. తీవ్ర భావోద్వేగాలతో కూడిన కథాంశాన్ని ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించినట్లు ట్రైలర్‌తో గ్రహించవచ్చు. ఫ్యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టునేలా కనిపిస్తున్నాయి.
ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట ప్రేమ ప్రయాణాన్ని రాజకీయ కుట్రతో ముడిపెట్టి, ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక యువ జంట తమ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు, వారి బస్సును కొందరు వ్యక్తులు హైజాక్ చేయడంతో వారి ప్రయాణం భయానక మలుపు తీసుకుంటుంది. ప్రేమకథగా ప్రారంభమై, రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో చివరకు మనుగడ కోసం చేసే పోరాటంగా పరిణామం చెందుతుంది.
ప్రత్యేకించి.. ఎ టేల్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న పోతుగడ్డ మూవీ భావోద్వేగ లోతులను తాకుతూ, యాక్షన్-ప్యాక్డ్ సన్నివేశాలకు అద్దంపట్టేలా ఉంది. ఇటీవల విడుదలపైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నట్లు సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చిత్రం ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని ఇటీవల జరిగన ఓ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సైతం గట్టి విశ్వాసంతో ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఈ చిత్రంలో శత్రు, ప్రశాంత్ కార్తీ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరికి కొత్త నటులు విస్మయ శ్రీ, వెంకీ, పృథ్వీ దండముడి, అద్విక్ బండారు తదితరులు సహ నటులుగా ఉన్నారు. దర్శకుడు రక్ష వీరన్ స్క్రీన్‌ప్లే అందించగా, అనుపమ చంద్ర, శరత్ చంద్ర రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్మించారు. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫీ కాగా, శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. మార్కస్ ఎం నేపథ్య సంగీతాన్ని అందించారు.
ప్రకటన
ప్రకటన