ఫిబ్రవరి 11న ప్రేక్ష‌కుల ముందుకు.. తమిళ రొమాంటిక్ డ్రామా కాదలిక్కా నేరమిళ్లై OTT రిలీజ్‌

చిత్రనిర్మాత కృతిక‌ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమ, ఆధునిక సంబంధాలు, వివాహం, విచిత్రమైన సంబంధాల ఇతివృత్తాల‌తో రూపొందించ‌బడింది.

ఫిబ్రవరి 11న ప్రేక్ష‌కుల ముందుకు.. తమిళ రొమాంటిక్ డ్రామా కాదలిక్కా నేరమిళ్లై OTT రిలీజ్‌

Photo Credit: Netflix

థియేటర్లలో నెల రోజుల పాటు నడిచిన తర్వాత, ఇది ఇప్పుడు స్ట్రీమింగ్ ద్వారా విస్తృత ప్రేక్షకులను చేరుకుంటుంది

ముఖ్యాంశాలు
  • ఈ రొమాంటిక్ తమిళ డ్రామాలో నిత్యా మీనన్, రవి మోహన్ నటించారు
  • ద‌ర్శ‌కురాలిగా కృతిక‌ ఉదయనిధికు ఇది మూడ‌వ సినిమా
  • విడుద‌ల త‌ర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రంపై మిశ్రమ స్పందనలు
ప్రకటన

త్యా మీనన్, రవి మోహన్ నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా కాదలిక్కా నేరమిళ్లై థియేటర్లలో విడుదలైన తర్వాత OTT రిలీజ్‌కు సిద్ధ‌మైంది. చిత్రనిర్మాత కృతిక‌ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమ, ఆధునిక సంబంధాలు, వివాహం, విచిత్రమైన సంబంధాల ఇతివృత్తాల‌తో రూపొందించ‌బడింది. సంక్రాంతి సందర్భంగా సినిమా థియేట‌ర్‌ల‌లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానుంది. డిజిటల్ హక్కులను ఒక ప్రధాన OTT సర్వీస్ కొనుగోలు చేసింది. వీక్షకులు త్వరలో ఈ సినిమాని ఆన్‌లైన్‌లో చూడొచ్చు.

ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌

ప్ర‌ముఖ‌ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కాదలిక్కా నేరమిళ్లై సినిమా పోస్ట్-థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. జనవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. నెల రోజుల పాటు థియేటర్‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌ తర్వాత, ప్రేక్షకులు ఇప్పుడు ఈ రొమాంటిక్ డ్రామాను తమ ఇళ్ల నుండే వీక్షించ‌వ‌చ్చు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌లు సంస్థ వెల్ల‌డించిన‌ తేదీ నుండి సినిమాను యాక్సెస్ చేయొచ్చు. ఈ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతోపాటు హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ స్ప‌ష్టం చేసింది.

ఇద్దరు ఆర్కిటెక్ట్‌ల చుట్టూ

కాదలిక నేరమిల్లై సినిమా ట్రైలర్‌లోనే దీని ప్ర‌థాన‌ ఇతివృత్తాన్ని స్ప‌ష్టంగా చూపించింది. జీవితం, మానవ‌ సంబంధాలపై విభిన్న దృక్పథాలను కలిగి ఉన్న ఇద్దరు ఆర్కిటెక్ట్‌ల చుట్టూ క‌థ కొన‌సాగుతుంది. వారి మార్గాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండ‌డంతో, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ చిత్రం సమకాలీన సమాజంలో ప్రేమ, రిలేష‌న్‌షిప్‌, తల్లిదండ్రులు కావడం, ఎద‌ర‌య్యే ఒడిదుడుకులను వెండి తెర‌పై చూపిస్తుంది.

ద‌ర్శ‌కురాలిగా మూడో సినిమా

ఈ సినియాలో నిత్యా మీనన్, రవి మోహన్ (జ‌య్ రవి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది వారి మొదటి ఆన్-స్క్రీన్ షేరింగ్‌. వారి వారి పాత్ర‌ల‌లో స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో మంచి మార్కులు కొట్టేశార‌నే చెప్పాలి. అలాగే, సహాయక పాత్ర‌ల్లో వినయ్ రాయ్, యోగి బాబు, లాల్, జాన్ కొక్కెన్, టిజె భాను, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని న‌టించారు. సినిమాటోగ్ర‌ఫీని గవేమిక్ ఆరి నిర్వహిస్తున్నారు. అలాగే, ఎడిటింగ్‌ను లారెన్స్ కిషోర్ పర్యవేక్షించారు. ఈ మూవీకి రెడ్ జెయింట్ మూవీస్ బ్యాకెండ్‌గా ఉండ‌గా, AR రెహమాన్ సంగీతం సమకూర్చారు. అంతేకాదు, ద‌ర్శ‌కురాలిగా కృతిక‌ ఉదయనిధికు ఇది మూడ‌వ సినిమా.

చిత్రంపై మిశ్రమ స్పందనలు

విడుద‌ల త‌ర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రంపై మిశ్రమ స్పందనలు వ‌చ్చాయి. AR రెహమాన్ అందించిన సౌండ్‌ట్రాక్ ప్రశంసలు అందుకోగా, స్టోరీ టెల్లింగ్‌, స్క్రీన్‌ప్లే అంచనాలను అందుకోలేకపోయాయని అభిప్రాయాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సినిమా నేటి ఆధునిక ప్రేమ, సంబంధాలను తెలిపేందుకు ప్రయత్నించినప్ప‌టికీ, వాటిని స్ర్కీన్‌పై చూపించ‌డంలో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయార‌ని ప‌లు సమీక్షలు సూచించాయి. కాదలిక నేరమిల్లై సినిమాకు IMDb 6.8 / 10 రేటింగ్‌ను అందించింది. మొత్తంగా, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే, IP69 రేటింగ్ ఉన్న ఈ
  2. Samsung కస్టమర్లకు అలర్ట్, One UI 8 ఫీచర్లలో మార్పు
  3. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, FM రేడియో, OTG, 3.5mm ఆడియో జాక్ వంటి అన్ని
  4. డియాలో రియల్ మీ 15 ప్రో 5జీ లాంచ్.. కొత్త మోడల్‌లోని ఫీచర్స్ ఇవే
  5. ఇది హిందీ, ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, బెం
  6. మోటో G86 పవర్‌లో 6,720mAh బ్యాటరీ, 33W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుం
  7. ఇండియాలో Redmi బ్రాండ్ 11 సంవ‌త్స‌రాల సెల‌బ్రేష‌న్స్‌.. కొత్త‌గా మ‌రో రెండు స్మార్ట్ ఫోన్‌లు
  8. జూలై 25న ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌లోకి Lava Blaze Dragon 5G స్మార్ట్ ఫోన్
  9. వీ ఐ మైసూరులో 5G ప్రారంభించింది. 5G ఫోన్ ఉన్నవారు అపరిమిత డేటా ఉపయోగించవచ్చు
  10. ఇక వివో బుక్14 1.49kg బరువు, 17.9mm మందంతో వస్తుంది. లైట్ డిజైన్‌తో స్టూడెంట్స్‌కు బెస్ట్
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »