రాబిన్‌హుడ్ OTT విడుదల తేదీ కూడా సిద్ధ‌మైందా.. చిత్ర యూనిట్ ఏం చెబుతోందంటే..

రాబిన్‌హుడ్ OTT విడుదల తేదీ కూడా సిద్ధ‌మైందా.. చిత్ర యూనిట్ ఏం చెబుతోందంటే..

Photo Credit: BookMy Show

రాబిన్‌హుడ్, రాబోయే తెలుగు హీస్ట్ కామెడీ, మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.

ముఖ్యాంశాలు
  • ఈ సినిమాలో నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించారు
  • నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు
  • OTT విడుదలకు సంబంధించిన వివరాలు రాబోయే వారాల్లో వెలువడే అవకాశం
ప్రకటన

మార్చి 28న రాబిన్‌హుడ్ అనే కామెడీ పిక్చ‌ర్‌ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌డంతో సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను పెరిగాయి. ఈ మూవీ క‌థ‌ రామ్ ఓ ప్రొఫిషిన‌ల్ దొంగ తిరుగుతుంది. అతను ఒక బిలియనీర్ కుమార్తెను రక్షించే పనిలో ఉన్నప్పుడు ఊహించని పరిస్థితులు ఎదుర‌వుతాయి. యాక్షన్, కామెడీతో నిండిన ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే కథాంశంతో తెర‌కెక్కించారు. అలాగే, డిజిటల్ రిలీజ్ కూడా మేకర్స్ ఖరారు చేశారు. ప్రేక్షకులు సినిమాను థియాట‌ర్ రిలీజ్ తర్వాత త్వ‌ర‌లోనే ఆన్‌లైన్‌లో చూడటానికి వీలు కల్పిస్తున్నారు.

Zee తెలుగు శాటిలైట్ హక్కులను

రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ Zee5లో అందుబాటులోకి రానుంది. అయితే, స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ తేదీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వచ్చిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతే కాదు, సినిమా టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించేందుకు Zee తెలుగు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. OTT విడుదలకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే వారాల్లో వెలువడే అవకాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

నితిన్ ఖాతాలో హిట్‌

ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తున్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో OTT విడుదలకు ఇదే త‌రహా టాక్ వ‌స్తుంద‌ని సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు, చాలా రోజుల త‌ర్వాత హీరో నితిన్‌కు రాబిన్‌హుడ్ హిట్‌ను అందించింద‌ని కూడా చెబుతున్నారు. దీంతో ఆన్‌లైన్ వేదిక‌గా ఈ సినిమా మంచి క్రేజ్ ఉండ‌బోతోంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే, ఓ చిన్న పాయింట్‌తో ద‌ర్శ‌కుడు క‌థాంశాన్ని ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా మ‌ల‌చాడంటూ ప్ర‌సంశ‌లు వినిపిస్తున్నాయి.

కామెడీ, యాక్షన్, డ్రామా

ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. కామెడీ, యాక్షన్, డ్రామా క‌ల‌గ‌లిపి ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. నితిన్ ధనవంతులను దొచుకునే ఓ దొంగ రామ్ పాత్రను పోషిస్తున్నాడు. నీరా పాత్ర‌లో న‌టించిన శ్రీలీల‌ను రక్షించే బాధ్యత అతనికి అప్పగించ‌డంతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమె ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి వచ్చే ఒక బిలియనీర్ కుమార్తె. రామ్ తన నేర జీవితాన్ని కొనసాగించే బదులు, ఆమెకు రక్షకుడిగా మారడంతో కథ సాగుతుంది. హీరోగా నితిన్‌కు మంచి మార్కులు వ‌చ్చాయ‌ని టాక్‌. అలాగే, శ్రీలీల సైతం త‌న‌దైన న‌ట‌న‌తోపాటు అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంద‌ని రివ్యూలు చెబుతున్నాయి.

ఎవ‌రెవ‌రి పాత్ర‌

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన రాబిన్‌హుడ్ చిత్రంలో నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, దేవదత్తా నాగే, షైన్ టామ్ చాకో, ఆడుకలం నరేన్, మైమ్ గోపి, షిజు సహాయక పాత్రలు పోషించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందించారు. కోటి ఎడిటర్‌గా పనిచేశారు. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 6620mAh భారీ బ్యాట‌రీతో Huawei Enjoy 80.. చైనాలో ధ‌ర ఎంతంటే
  2. రీప్లేస‌బుల్‌ లెన్స్ సిస్టమ్‌తో Insta360 X5.. ఇండియాలో అమ్మకానికి సిద్ధం
  3. ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్‌తో Asus నుంచి Chromebook CX14, CX15 సిరీస్ ల్యాప్‌ట్యాప్‌లు
  4. 14 రోజుల బ్యాట‌రీ లైఫ్‌తో Redmi Watch మూవ్‌.. ధ‌ర‌తోపాటు ఫీచ‌ర్స్ ఇవే
  5. ఎసెన్షియల్ కీ, AI- పవర్డ్ ఎసెన్షియల్ స్పేస్ ఫీచర్‌తో CMF ఫోన్ 2 ప్రో వ‌చ్చేస్తోంది
  6. ఇండియాలో మొద‌టిసారి సేల్‌కు వ‌చ్చిన HMD బార్బీ ఫోన్.. ధ‌ర రూ. 7999 మాత్ర‌మే
  7. ఏప్రిల్ 22న Oppo K12s 5G లాంఛ్‌.. డిజైన్, కలర్ ఆప్షన్‌ల‌ను వెల్ల‌డించిన కంపెనీ
  8. ఇండియాలో Oppo A5 Pro 5G ఏప్రిల్ 24న విడుద‌ల‌.. లాంఛ్‌కు ముందే లీక్ అయిన‌ ధ‌ర
  9. 50-మెగాపిక్సెల్ రియ‌ల్ కెమెరాతో Itel A95 5G.. ధ‌ర కేవ‌లం రూ. 9599 మాత్ర‌మే
  10. మార్కెట్‌లోకి Moto Book 60.. రూ.69,999 ల్యాప్‌టాప్, స్పెషల్ లాంఛ్ ధ‌ర రూ.61,999 మాత్ర‌మే
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »