వివో V50 (చిత్రపటం) పిల్ ఆకారపు వెనుక కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది
చైనాకి చెందిన మొబైల్ బ్రాండ్ కంపెనీ VIVO సరికొత్త ఫోన్ మోడల్ మార్కెట్లోకి లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా, VIVO మోడల్ కి చెందిన VIVO V50 ఎలైట్ ఇండియాలో లాంచింగ్ కి రెడీ అయింది. ఈ సందర్భంగా VIVO కంపెనీ లాంచింగ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఒక టీజర్ లాగా ఫోన్ స్పెసిఫికేషన్స్ విడుదల చేసింది. అయితే, ఇప్పటికే VIVO నుండి ఫిబ్రవరిలో లాంచ్ అయిన VIVO V50కి పిల్ షేప్డ్ రేర్ కెమెరా ఐలాండ్ ఉంది. త్వరలో లాంచ్ అవునున్న VIVO V50 ఎలైట్ మోడల్ సర్కులర్ రేర్ కెమెరా మాడ్యూల్ తో వస్తుంది. VIVO నుండి వస్తున స్టాండర్డ్ మోడల్స్ ఉన్న ఫీచర్స్ ఈ ఎలైట్ మోడల్ లో కూడా ఉండనున్నాయి. ఇండియాలో VIVO V50e మోడల్ తాజాగా ఏప్రిల్లో విడుదలైన సంగతి తెలిసిందే.
VIVO V50 ఎలైట్ ఎడిషన్ ఇండియాలో మే 15న, మధ్యాహ్నం12 గంటలకి లాంచ్ చేస్తున్నట్లు VIVO తన ' X' ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మోడల్ ని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలో మొబైల్ ఫోన్ వెనకాల భాగంలో కెమెరా మాడ్యూల్ కింద ఎలైట్ ఎడిషన్ అని ముద్రించి ఉంది. VIVO V50 బేస్ మోడల్ లో ఉన్నట్టు కాకుండా ఈ ఎలైట్ మోడల్ కి కెమెరా మాడ్యూల్ రౌండ్ షేప్ లో ఉండనుంది. అయితే ఈ మోడల్ కి సంబంధించి ఏ ఇతర డీటెయిల్స్ కంపెనీ రివిల్ చేయలేదు. అయితే టీజర్ లో మాత్రం 'ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు... అంతకన్నా ఎక్కువ' అనే క్యాప్షన్ని మెన్షన్ చేసింది.
VIVO V50 ఎలైట్ ఎడిషన్ సేమ్ వెనీల్లా VIVO V50 వేరియంట్ లో ఉన్న ఫీచర్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ SoC ప్రాసెసర్ తో రావచ్చు. 6000mAH బ్యాటరీకి 90W వైర్డ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంతోపాటు 50 మెగాపిక్సల్ డ్యూయల్ రేర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఈ ఫోన్లో అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి.
అలాగే IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్స్, 120HZ రిఫ్రిస్ట్ రేటుతో 6.77 ఇంచెస్ ఫుల్ HD క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 15 బేస్డ్ FuntouchOS 15, 12GB LPDDR4X ర్యామ్, UFS 2.2 తో 512GB ఆన్ బోర్డ్ స్టోరేజ్తో ఈ మోడల్ లాంచ్ అవ్వనుంది.
ఈ ఫోన్ ధరలు వచ్చేసి 8GB + 128GB వేరియంట్ ధర రూ. 34,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 36,999, 12GB + 512GB వేరియంట్ ధర రూ. 40,999 గా ఉన్నాయి. ఇక ఈ VIVO V50 ఎలైట్ ఎడిషన్ రోజ్ రెడ్, స్టార్రీ బ్లూ, టైటానియం గ్రే కలర్స్ లో కస్టమర్స్ కి అందుబాటులో ఉండనుంది.
ఈ ఫోన్ టీజర్ చూసిన మొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. VIVO కూడా ఈ ఫోన్ సేల్స్ ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన