త‌క్కువ ధ‌ర‌కే Redmi Smart Fire TV 2024 సిరీస్ వ‌చ్చేసింది

Redmi Smart Fire TV 4K సిరీస్‌లోని 55 అంగుళాల ఫైర్ టీవీని మార్కెట్లోకి ఈ కంపెనీ తీసుకురావడం ఇదే తొలిసారి. ఈ రెండు వేరియంట్‌లు డిజైన్, డిస్‌ప్లే నాణ్యత, స్టోరేజ్, ఫీచర్స్ ఒకే విధంగా ఉంటాయి

త‌క్కువ ధ‌ర‌కే Redmi Smart Fire TV 2024 సిరీస్ వ‌చ్చేసింది

Photo Credit: Redmi

The Redmi Smart Fire TV 4K 2024 series is available on Xiaomi’s website and Flipkart

ముఖ్యాంశాలు
  • Redmi Smart Fire TV 4K సిరీస్ 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుం
  • ఇది 2GB RAM, 8GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో జత చేయబడింది
  • ఈ స్మార్ట్ టీవీలు బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి
ప్రకటన

దేశీయ మార్కెట్‌లోకి Redmi Smart Fire TV 4K 2024 సిరీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ సిరీస్‌నుంచి 43-అంగుళాలు, 55-అంగుళాల వేరియంట్‌లలో రెండు మోడ‌ల్స్ లాంచ్ అయ్యాయి. Redmi కంపెనీ 55 అంగుళాల ఫైర్ టీవీని మార్కెట్లోకి తీసుకురావడం ఇదే తొలిసారి. ఈ రెండు వేరియంట్‌లు డిజైన్, డిస్‌ప్లే నాణ్యత, స్టోరేజ్, ఫీచర్‌లలో ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను క‌లిగి ఉంటాయి. అయితే, 43-అంగుళాల మోడల్ 24W స్పీకర్లను పొందే ఆడియో సిస్టమ్ వ‌స్తుండ‌గా, కంపెనీ మొద‌టిసారి లాంచ్ చేసిన‌ 55-అంగుళాల Fire TV మోడల్‌లో 30W స్పీకర్ సిస్టమ్‌తో వ‌స్తోంది. ముఖ్యంగా, Redmi Smart Fire TV 4K సిరీస్‌లో ఇన్‌బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వస్తుంది.

పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను..

ఇండియాలో Redmi Smart Fire TV 4K 2024 సిరీస్ ప్రారంభ ధర 43-అంగుళాల మోడల్ రూ. 23,499, 55 అంగుళాల మోడల్ ధర రూ. 34,499గా నిర్ణ‌యించారు. అయితే లాంచింగ్ ఆఫ‌ర్‌ల‌లో ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసినప్పుడు రూ. 1,500 డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీల విక్రయం సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమవుతుంది. Redmi Smart Fire TV 4K 2024 ఎడిషన్ బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తుంది. అలాగే, 4K HDR డిస్‌ప్లేను కలిగి ఉందని కంపెనీ ఓ పత్రికా ప్రకటనలో వెల్ల‌డించింది. ఈ స్మార్ట్ టీవీ వీడియో ప్రాసెసింగ్ కోసం మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ (MEMC) టెక్నాలజీని అందించిన‌ట్లు తెలిపింది. ఇది పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను కూడా అందిస్తుంది.

12,000 కంటే ఎక్కువ యాప్‌లను

ఈ స్మార్ట్ టీవీలు 2GB RAM అలాగే, 8GB ఇన్‌బిల్ట్ స్టోరేజీతో జత చేయబడిన 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ అమర్చబడి ఉంటుంది. Fire TV ఇంటిగ్రేషన్‌తో వినియోగదారులు ఇన్‌బిల్ట్ యాప్ స్టోర్ ద్వారా 12,000 కంటే ఎక్కువ యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. అలాగే, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమా వంటి మరిన్ని ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను బ్రౌజ్ చేయడంతోపాటు వీక్షించ‌వ‌చ్చు. ఇది ముమ్మాటికీ Fire TV సిరీస్ కొనుగోలుదారుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి.

అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో..

కనెక్టివిటీ విష‌యానికి వ‌స్తే.. Redmi Smart Fire TV 4K బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ WiFi, AirPlay 2, Miracastలను అందిస్తుంది. వీడియోలను ప్రసారం చేయడానికి, ఫోటోలను షేర్‌ చేయడానికి, స్పీకర్లు లేదా హెడ్‌ఫోన్‌లకు కనెక్ట్ చేయడానికి డ్రైవ్‌ను సెటప్ చేయవచ్చు. అంతేకాదు, ఇంటిగ్రేటెడ్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో వినియోగదారులు టీవీని నియంత్రించవచ్చు. అలాగే, కంటెంట్‌ను స‌ర్స్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. Alexa వీడియో సిఫార్సులకు కూడా సహాయపడుతుంది. ఇంకా, ఈ స్మార్ట్ టీవీ ఇతర అలెక్సా-అనుకూల స్మార్ట్ ఉపకరణాలకు కేంద్ర కేంద్రంగా పనిచేస్తుంది. అంచేత వాటన్నింటినీ వాయిస్ ద్వారా నియంత్రించవచ్చని కంపెనీ స్ప‌ష్టం చేసింది.

ces_story_below_text

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దీంతో ఫోటోగ్రఫీ మరియు జూమ్ క్వాలిటీలో కొత్త స్థాయిని అందించే అవకాశముంది
  2. అందువల్లే ఇది అమెజాన్‌లో వేగంగా పెరుగుతున్న విభాగాల్లో ఒకటిగా మారిందని తెలిపారు.
  3. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ ఉండగా, దానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
  4. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో వివో ఎక్స్300 అల్ట్రా.. దీని ప్రత్యేకతలివే
  5. గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో శాటిలైట్ వాయిస్ కాల్స్?.. ఈ విషయాల గురించి తెలుసా?
  6. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ RMX5107 మోడల్ Realme UI 7.0పై రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
  7. ఈ రెండు Music Studio స్పీకర్లలో బ్లూటూత్, వై-ఫై సపోర్ట్ ఉంది.
  8. ఈ డివైసుల కోసం అంతర్గతంగా టెస్ట్ బిల్డ్స్ కనిపించడం అనేది నిజంగా మంచి సంకేతమే.
  9. అతి తక్కువ ధరకే Tecno Spark Go 3 / Pop 20 4G.. ఫీచర్స్ ఇవే
  10. గెలాక్సీ ఎ26 సిరీస్ ధరను ప్రకటించడంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న సామ్ సంగ్?
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »