Photo Credit: Haier
హైయర్ C95 మరియు C90 OLED టీవీలు బెజెల్-లెస్ డిజైన్ కలిగి ఉన్నాయని చెబుతారు
ప్రముఖ స్మార్ట్ టీవీల కంపెనీ Haier గుడ్ న్యూస్ చెప్పింది. Haier C90, C95 OLED పేరుతో రెండు టీవీలను మన దేశంలో లాంఛ్ చేసింది. 4K రిజల్యూషన్‌తో వస్తోన్న ఈ సరికొత్త మోడల్స్ గూగుల్ టీవీ ఆధారితంగా ఉన్నాయి. ఇవి పలు డిస్‌ప్లే సైజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే, బెజెల్ లెస్ బీల్డ్‌లను కలిగి ఉంటుంది. ఇమేజ్ క్వాలిటీని మరింత మెరుగుపరిచేందుకు Haier C90, C95 టీవీలు హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్ ఐక్యూకి సపోర్ట్ చేసేలా రూపొందించారు. అంతే కాదు, విజువల్ టెక్నాలజీ హర్మాన్ కార్డాన్ ఆధారిత ఆడియోతో అటాచ్ చేయబడ్డాయి.ఇండియాలో ధరలు,మన దేశంలో 55- అంగుళాల స్క్రీన్ Haier C90 OLED టీవీ వేరియంట్ ధరను రూ. 1,29,990 గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, ఇందులో 65- అంగుళాలు, 77- అంగుళాల వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక Haier C95 OLED 55- అంగుళాల స్క్రీన్ టీవీ ధర 1,56,990గా ఉంది. ఇది 65- అంగుళాల స్క్రీన్ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. ఈ రెండు మోడల్స్ కూడా Haier ఇండియా వెబ్‌సైట్, ఈ- కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతోపాటు దేశ వ్యాప్తంగా రిటైల్ షాపుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Haier C95 OLED టీవీ 4K రిజల్యూషన్‌తో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, గేమ్‌లను సరికొత్తగా ఆస్వాదించేందుకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లాటెన్సీ మోడ్‌లతో రూపొందించబడింది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో హర్మాన్ కార్డాన్ 2.1 ఛానెల్ సిస్టమ్ కూడా ఉంది .ఇది 3డీ సౌండ్‌స్కేప్‌ను క్రియేట్ చేస్తుంది. ఇక Haier C90 OLED టీవీ 4K రిజల్యూషన్‌తో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ లైనప్‌లోని చాలా మోడల్స్ 50W సౌండ్ సిస్టమ్‌తో వస్తుండగా, C90 65W అప్‌గ్రేడ్ సెటప్‌తో రూపొందించబడింది.
ఈ కొత్త మోడల్ టీవీలు 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అలాగే, ఆప్టిమైజ్ చేసిన బ్రైట్ నెస్, కాంట్రాస్ట్‌ను అందించేందుకు డాల్బీ విజన్ ఐక్యూ, హెచ్‌డీఆర్ 10+లతో ఉన్నాయి. ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం, మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్‌తో కలిపి గేమింగ్ సమయంలో స్క్రీన్, సౌండింగ్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలను అధిగమిస్తుంది.
ఈ రెండింటిలో Wi-Fi 6, బ్లూటూత్ 5.2 లు ఉన్నాయి. నెట్ కనెక్షన్ లేకపోయినా ఫోన్ నుంచి టీవీకి కంటెంట్‌ను టెలికాస్ట్ చేసేందుకు Chromecast, HAICAST ఫీచర్స్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. అలాగే, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ సోలార్‌తో రన్ అయ్యే రిమోట్‌తో బండిల్ చేయబడి, కొనుగోలుదారులను మరింత ఆకర్షించేలా కంపెనీ ప్రణాళికలు వేసింది. ఈ ఫీచర్స్ ద్వారా ఇతర కంపెనీల ఉత్పత్తులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన