ఎలక్ట్రానిక్ వస్తువులు, అమెజాన్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, కిచెన్‌వేర్‌తోపాటు పలు ప్రొడక్ట్స్‌పై గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 సమయంలో తగ్గింపు ధరలను పొందవచ్చు
Photo Credit: Amazon
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 స్మార్ట్ టీవీలు మరియు గృహోపకరణాలపై 65 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది
వినియోగదారులకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 తేదీలను ప్రకటించింది. ఈ ఆన్‌లైన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ వచ్చే వారం ప్రత్యేక డిస్కౌంట్ సేల్‌ను నిర్వహించనుంది. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ను కూడా ఇస్తోంది. ఈ వార్షిక సేల్ సమయంలో అమెజాన్ స్మార్ట్ ఫోన్‌లపై 40 శాతం వరకూ, స్మార్ట్ టీవీలతోపాటు ప్రొజెక్టర్‌లపై 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, అమెజాన్ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, కిచెన్‌వేర్‌తోపాటు పలు ప్రొడక్ట్స్‌పై సేల్ సమయంలో తగ్గింపు ధరలను పొందవచ్చు.
జనవరి 13న మధ్యాహ్నం అందరికీ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025ను అందిస్తోంది. అలాగే, ప్రైమ్ వినియోగదారులకు 12 గంటల ముందు సేల్ ప్రారంభం కానుంది. అయితే, సేల్ ముగింపు తేదీని అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. క్రెడిట్ కార్డ్‌లు, EMI ట్రాన్సిషన్‌లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందించేందుకు అమెజాన్ SBIతో భాగస్వామ్యమయ్యింది. ఈ సేల్ సమయంలో కొనుకోలుదారులు ICICI అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ ఆధారిత ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, అలాగే కూపన్ డిస్కౌంట్‌లను కూడా సొంతం చేసుకోవచ్చు.
ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో Apple, OnePlus, Samsung, iQoo, Realme, Xiaomi లాంటి బ్రాండ్‌ల ఫోన్‌లు, ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపు లభించనుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా కొన్ని ముఖ్యమైన ఆఫర్‌లను ప్రకటిస్తోంది. అలాగే, కొత్తగా లాంచ్ అయిన OnePlus 13, OnePlus 13R, iQOO 13 5G, iPhone 15, Samsung Galaxy M35 5G మోడల్స్ తగ్గింపు ధరలలో లభించనున్నట్లు స్పష్టమైంది. వీటితోపాటు Honor 200 5G, Galaxy S23 Ultra, Realme Narzo N61, Redmi Note 14 5G డిస్కౌంట్ ధరలకు పొందవచ్చు. అయితే, డీల్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు.
రాబోతున్న ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు తగ్గింపు ఉంటుందని స్పష్టమైంది. ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మౌస్ లాంటి ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు రూ. 199 నుండి ప్రారంభమవుతాయి. అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ ఉత్పత్తులు రాబోయే ఈ సేల్‌లో రూ. 2,599 నుండి ప్రారంభమవుతాయి. వీటితోపాటు పలు కంపెనీల ప్రొడక్స్ కూడా సెల్‌లో అందుబాటులోకి రానున్నాయి.
అమెజాన్ రూ. 199 నుండి ప్రారంభమయ్యే ఫ్యాషన్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులు ప్రారంభ ధర రూ. 149గా ఉంది. అమెజాన్ పే ద్వారా చేసే ట్రావెల్ బుకింగ్‌లపై 50 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. రాబోయే రోజుల్లో అమెజాన్ కొత్త బిగ్ సేల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుంది
ప్రకటన
ప్రకటన
Clair Obscur: Expedition 33 Wins Game of the Year, Sweeps The Game Awards 2025 With 9 Wins: Full Winners' List
Huawei Mate X7 With Kirin 9030 Pro Chip, 8-Inch OLED Inner Display Launched Globally: Price, Specifications