Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ భారతదేశంలోని ప్రైమ్ వినియోగదారుల కోసం సెప్టెంబర్ 26న ప్రారంభమైందనేది మనకు తెలిసిన విషయమే. ఇది దేశంలోని వినియోగదారులందరికీ సెప్టెంబర్ 27 అర్ధరాత్రి మొదలై ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ సేల్‌లో వ్యక్తిగత గాడ్జెట్‌లు మొదలుకుని పెద్ద ఉపకరణాలు వరకూ అన్ని రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్‌లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ మీకోసం.. Amazon సేల్‌లో బెస్ట్ డీల్స్‌కు లభిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీల జాబితాను రూపొందించాం.
అదనపు ప్రయోజనాలు..
ఈ సేల్‌లో అర్హతగల వినియోగదారులు తాము కొనుగోలు చేయదలచే ఉత్పత్తుల ధరను తగ్గించుకోవడానికి బ్యాంక్, ఎక్స్‌ఛెంజ్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ డీల్‌లు, కూపన్ డిస్కౌంట్‌లు వంటి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. Amazon సేల్‌లో వస్తువును కొనుగోలు చేయడానికి SBI డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తక్షణ 10 శాతం తగ్గింపును పొందవచ్చనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. కొన్ని ఉత్పత్తుల కొనుగోలుపై నో-కాస్ట్ EMI ఎంపికలను పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో బెస్ట్ డీల్స్..
- OnePlus Nord CE 4 Lite 5G ధర రూ. 23,999 ఉండగా.. రూ. 19,999కు కొనుగోలు చేయవచ్చు
- Samsung Galaxy M35 5G రూ. 24,499 ధర కాగా, దీనిని రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు
- రూ. 83,990 అసలు ధర ఉన్న Asus TUF గేమింగ్ A15 సేల్‌లో రూ. 60,990గా ధర ఉంది
- Honor Magic ఎక్స్16 ప్రో ధర రూ. 84,999 ఉండగా.. రూ. 50,999లకే లభిస్తుంది
- Xiaomi ప్యాడ్ 6 ధర రూ. 41,999 కాగా, ఈ సేల్‌లో రూ. 22,999లకే కొనుగోలు చేయవచ్చు
- OnePlus Pad గో రూ. 19,999 అసలు ధర, సేల్‌లో రూ. 17,999గా ఉంది
- రూ. 6,999 మార్కెట్ ధర ఉన్న Redmi Watch 5 లైట్ ఇప్పుడు రూ. 3,299కే సొంతం చేసుకోవచ్చు
- Noise Pulse 2 ధర గరిష్టంగా రూ. 5,999 ఉండగా.. సేల్‌లో రూ. 1,099కు కొనుగోలు చేయవచ్చు
- Sony Bravia 55-అంగుళాల టీవీ రూ. 1,29,900 నుంచి రూ. 65,989కు లభిస్తుంది
- Samsung 43-అంగుళాల టీవీ రూ. 49,900 నుంచి రూ. 29,490కు సొంతం చేసుకోవచ్చు
- Boat Nirvana Space రూ. 7,990 నుంచి కేవలం రూ. 1,898కు తగ్గించబడింది
- JBL ఫ్లిప్ 5 స్పీకర్ రూ. 10,999 నుంచి రూ. 5,499కు లభిస్తున్నాయి
- Godrej 1 Ton AC రూ. 42,900 నుంచి రూ. 27,990కు కొనొచ్చు
- Haier Double Door రిఫ్రిజిరేటర్ రూ. 36,990 నుంచి రూ. 23,990కు దొరుకుతుంది
- IFB Fully Automatic వాషింగ్ మెషిన్ రూ. 29,990 నుంచి రూ. 21,490కు లభిస్తుంది