Photo Credit: Asus
Asus ZenBook A14 Windows 11 హోమ్ తో వస్తుంది
ఇండియాలో ఆసుస్ న్యూ స్నాప్‌డ్రాగన్ X సిరీస్ ప్రాసెసర్‌లతో ఆసుస్ జెన్‌బుక్ A14, వివోబుక్ 16లను లాంఛ్ చేసింది. ఆసుస్ జెన్‌బుక్ A14 స్నాప్‌డ్రాగన్ X ఎలైట్, స్నాప్‌డ్రాగన్ X రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో వస్తుంది. అలాగే, ఆసుస్ వివోబుక్ 16 స్నాప్‌డ్రాగన్ X X1-26-100 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ కోపైలట్+ PCలు క్వాల్కమ్ హెక్సాగాన్ NPUని కలిగి ఉంటాయి. multiple AI-ఫోకస్ట్ టూల్స్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు 45 TOPS (సెకనుకు ట్రిలియన్ ఆపరేషన్‌ల) వరకు అందిస్తాయి. జెన్‌బుక్ A14 90W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 70Wh బ్యాటరీని కలిగి ఉండగా, వివోబుక్ 16 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 50Wh బ్యాటరీతో వస్తుంది.
కొత్త ఆసుస్ జెన్‌బుక్ A14 (UX3407QA) స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్‌తో ఉన్న వేరియంట్ ధర రూ. 99,990కాగా, స్నాప్‌డ్రాగన్ X ఎలైట్ ప్రాసెసర్ (UX3407RA)తో వచ్చే మోడల్ ధర రూ. 1,29,990గా ఉంది. వివోబుక్ 16 (X1607QA) ధర రూ. 65,990గా నిర్ణయించారు. అన్ని మోడల్స్ ఆసుస్ ఈషాప్, అమెజాన్‌తోపాటు ఇతర రిటైల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.
ఇది Windows 11 Homeతో 14-అంగుళాల ఫుల్-HD (1,200x1,920 పిక్సెల్స్) Lumina NanoEdge OLED డిస్‌ప్లేను 90 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో, 600nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీని రెండు వేరియంట్‌లలో Qualcomm Adreno iGPU, 45 TOPS వరకు అందించే Hexagon NPU, 16GB LPDDR5X ఆన్‌బోర్డ్ RAM, 512GB PCIe NVMe M.2 SSD స్టోరేజ్ ఉన్నాయి.
ఈ ఆసుస్ జెన్‌బుక్ A14 యాంబియంట్ లైట్, కలర్ సెన్సార్‌తో ఫుల్-HD Asus AI IR కెమెరాతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు USB 4 టైప్-C పోర్ట్‌లు, ఒక USB 3.2 Gen 2 టైప్-A పోర్ట్, ఒక స్టాండర్డ్ HDMI 2.1 పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌ను అందించారు. స్మార్ట్ గెస్చర్ సపోర్ట్‌తో ErgoSense టచ్‌ప్యాడ్‌ను, Dolby Atmos టెక్నాలజీతో స్పీకర్‌లను, ఇన్‌బిల్ట్ అర్రే మైక్రోఫోన్‌ను అందించారు. దీని రెండు వేరియంట్‌లలో ఉన్న 70Wh బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 32 గంటల లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇవి దాదాపు 980 గ్రాముల బరువు ఉంటుంది.
Windows 11 Homeపై Copilot సపోర్ట్‌తో రన్ అవుతుంది. 16:10 యాస్పెక్ట్ రేషియో, 60Hz రిఫ్రెష్ రేట్, 300nit బ్రైట్‌నెస్‌తో 16-అంగుళాల ఫుల్-HD+ (1,200x1,920) IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది Qualcomm స్నాప్ డ్రాగన్ X X1-26-100 ప్రాసెసర్‌తో పాటు Qualcomm Adreno iGPU, 45 TOPS Hexagon NPU ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలాగే, 16GB LPDDR5X RAM, 512GB PCIe 4.0 SSD స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన