స్నాప్‌డ్రాగన్ X ప్లస్ 8-కోర్ ప్రాసెస‌ర్‌తో Lenovo నుంచి మూడు మోడ‌ల్స్‌లో ల్యాప్‌టాప్‌లు

స్నాప్‌డ్రాగన్ X ప్లస్ 8-కోర్ ప్రాసెస‌ర్‌తో Lenovo నుంచి మూడు మోడ‌ల్స్‌లో ల్యాప్‌టాప్‌లు

Photo Credit: Lenovo

Lenovo IdeaPad 5x 2-in-1 comes with 14-inch WUXGA multi touch display

ముఖ్యాంశాలు
  • ఐడియాప్యాడ్ 5X 2-in-1, ఐడియాప్యాడ్ Slim 5Xల‌లో 57Wh బ్యాటరీ సామ‌ర్థ్యం
  • Lenovo థింక్‌బుక్‌ 16 Gen 7లో రెండు డాల్బీ అట్మాస్ స్పీకర్లు ఉన్నాయి
  • AI ఫీచర్‌లకు యాక్సెస్‌ను అందించే Copilot+ డిజిగ్నేష‌న్‌ను కలిగి ఉన్నాయి
ప్రకటన

జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన IFA 2024లో Lenovo Windows ల్యాప్‌టాప్‌ల‌ను ప‌రిచ‌యం చేసింది. ఇందులో థింక్‌బుక్ 16 Gen 7, ఐడియాప్యాడ్ 5X 2-in-1, ఐడియాప్యాడ్ Slim 5Xలు ఉన్నాయి. ఈ తాజా ల్యాప్‌టాప్‌లు స్నాప్‌డ్రాగన్ X ప్లస్ 8-కోర్ ప్రాసెస‌ర్‌తో రన్ అవుతాయి. అంతేకాదు, అనేక AI ఫీచర్‌లకు యాక్సెస్‌ను అందించే Copilot+ డిజిగ్నేష‌న్‌ను కలిగి ఉంటాయి. థింక్‌బుక్ 16 Gen 7 84Wh బ్యాటరీ సామ‌ర్థ్యంతో వ‌స్తుండ‌గా.. ఐడియాప్యాడ్ 5X 2-in-1, ఐడియాప్యాడ్ Slim 5Xలు మాత్రం 57Wh బ్యాటరీతో రూపొందించ‌బ‌డ్డాయి.

Lenovo థింక్‌బుక్‌ 16 Gen 7 ధర EUR 819 (దాదాపు రూ. 76,400) నుండి ప్రారంభమవుతుంది. ఇది సింగల్‌ లూనా గ్రే క‌ల‌ర్‌తో వ‌చ్చే నెల‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అలాగే, Lenovo ఐడియాపాడ్‌ 5x 2-in-1, Lenovo ఐడియాపాడ్‌ Slim 5x ఈ నెలాఖరులో అధికారికంగా లాంచ్ కానుండ‌గా వీటి ప్రారంభ ధర వ‌రుస‌గా EUR 999 (దాదాపు రూ. 93,200), EUR 899 (దాదాపు రూ. 83,800)గా ఉంటుంది.

Lenovo థింక్‌బుక్ 16 Gen 7 స్పెసిఫికేష‌న్స్‌

Lenovo థింక్‌బుక్ 16 Gen 7 32GB వరకు స్టోరేజ్‌తో 1TB వ‌ర‌కూ SSD స్టోరేజీ సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. వెబ్‌క్యామ్ ఫుల్‌-HD RGB కెమెరాను కలిగి ఉంది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 84Wh బ్యాటరీతో వ‌స్తుంది. రెండు డాల్బీ అట్మోస్ స్పీకర్లు, పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్, కెన్సింగ్టన్ లాక్, Wi-Fi 7 కనెక్టివిటీ ఉన్నాయి. రెండు 10Gbps USB టైప్-సి పోర్ట్‌లు, రెండు USB టైప్-A పోర్ట్‌లు (5Gbps), ఒక HDMI 2.1 పోర్ట్, హెడ్‌ఫోన్, మైక్రోఫోన్ కాంబో పోర్ట్, ఫోర్-ఇన్-వన్ SD కార్డ్ రీడర్ కూడా ఉన్నాయి.

Lenovo ఐడియాప్యాడ్ Slim 5X స్పెసిఫికేష‌న్స్‌

Lenovo ఐడియాప్యాడ్ 5x 2-in-1 14-అంగుళాల WUXGA (1,200x1,920 పిక్సెల్‌లు) మల్టీ-టచ్ డిస్‌ప్లేతో 16:10 యాస్పెక్ట్ రేషియో, 400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ కన్వర్టిబుల్ Copilot+ PC 16GB RAMతో 1TB వరకు SSD స్టోరేజీను అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లో రెండు USB టైప్-సి పోర్ట్‌లు, రెండు USB టైప్-A పోర్ట్‌లు, ఒక HDMI 2.1 పోర్ట్, ఆడియో జాక్, మైక్రో SD కార్డ్ రీడర్ ఉన్నాయి. ల్యాప్‌టాప్ MIL-STD-810H రేటెడ్ మన్నికను కలిగి ఉంది.

Lenovo ఐడియాప్యాడ్ Slim 5x స్పెసిఫికేష‌న్స్‌

Lenovo ఐడియాప్యాడ్ Slim 5x 400nits గరిష్ట బ్ర‌యిట్‌నెస్‌, 60Hz రిఫ్రెష్ రేట్, TÜV తక్కువ బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో 14-అంగుళాల WUXGA OLED డిస్‌ప్లేను అందించారు. Copilot PC+PC USB టైప్-C పోర్ట్, రెండు USB టైప్-A పోర్ట్‌లు, ఒక HDMI 2.1 పోర్ట్, ఒక ఆడియో జాక్, మైక్రో SD కార్డ్ రీడర్‌తో MIL-STD-810H మన్నిక రేటింగ్‌ను కలిగి ఉంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి
 
 

ప్రకటన

ప్రకటన

© Copyright Red Pixels Ventures Limited 2024. All rights reserved.
Trending Products »
Latest Tech News »