Asus ROG Zephyrus G16 (left) and Asus ProArt PX13
మనదేశంలో Asus AMD నుండి జెన్ 5 'స్ట్రిక్స్ పాయింట్' రైజెన్ APU, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో కూడిన కొత్త ల్యాప్‌టాప్ మోడల్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లలో ROG Zephyrus, TUF గేమింగ్, ProArt, Zenbook, మోడల్‌లు ఉన్నాయి. సాధారణ వినియోగదారులు, క్రియేటర్స్, గేమర్‌లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. ఈ అన్ని కొత్త ల్యాప్‌టాప్‌లు Windows 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్, స్పోర్ట్ OLED స్క్రీన్‌లతో వస్తున్నాయి. భారతదేశంలో ప్రారంభించిన ఈ మూడు కొత్త ల్యాప్‌టాప్‌లు MIL-STD 810H డ్యూరబిలిటీ రేటింగ్‌ను కలిగి ఉంటాయి.
Asus ProArt PX13 మోడల్ ధర రూ. 1,79,990 ఉండగా ఇవి Asus ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉంటుంది. Asus Zephyrus G16 (32GB+2TB) ధర 2,49,990 ఉండగా.. ఇవి Asus stores, Asus e-shop, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తుంది. Asus Zephyrus G16 (16GB+1TB) ధర రూ. 1,94,990గా Asus stores, Asus ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్టోర్‌లలో Asus TUF Gaming A14 మోడల్ ధర రూ. 1,69,990 ఉండగా ఈ మోడల్ Asus stores, Asus ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, లార్జ్ ఫార్మాట్ రిటైల్ స్టోర్‌లలో లబిస్తుంది. Asus Zenbook S 16 OLED ధర రూ. 1,49,990.. ఇవి Asus ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో అలాగే, Asus Vivobook S 14 OLED ధర రూ. 1,24,990 ఇవి Asus stores, లార్జ్ ఫార్మాట్ రిటైల్ (LFR) స్టోర్‌లు, Asus ఈ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్నాయి.
కొత్తగా విడుదల చేసిన Asus ProArt PX13 ల్యాప్‌టాప్‌లో Ryzen AI 9 HX 370 ప్రాసెసర్ అమర్చబడింది. అలాగే, Nvidia GeForce RTX 4050 GPU, AMD Radeon 890M గ్రాఫిక్‌లతో వస్తుంది. ఇది 24GB LPDDR5X RAM, 1TB NVMe SSD స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే, 13.3-అంగుళాల 3K డిస్‌ప్లేను అందించారు. ProArt PX13 ఫీచర్స్‌ను చూస్తే.. Wi-Fi 7, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. ఇది USB 3.2 Gen 2 Type A పోర్ట్, రెండు USB 4 Type-C పోర్ట్‌లు, HDMI 2.1 పోర్ట్ అమర్చబడి ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ ఫుల్-HD ఇన్‌ఫ్రారెడ్ (IR) కెమెరాను కూడా కలిగి ఉంది.
Asus ROG Zephyrus G16, TUF గేమింగ్ A14 ల్యాప్‌టాప్‌లు చూస్తే.. Ryzen AI 9 HX 370 ప్రాసెసర్‌తో పాటు 32GB వరకు LPDDR5X మెమరీని కలిగి ఉంటుంది. ROG Zephyrus G16 మోడల్ 240Hz రిఫ్రెష్ రేట్, 500nits గరిష్ట ప్రకాశంతో 16-అంగుళాల 2.5K OLED స్క్రీన్‌ను అందించారు. అయితే Asus TUF గేమింగ్ A14 మోడల్ 14-అంగుళాల IPS డిస్‌ప్లేను 165Hz రిఫ్రెష్ రేట్, 400నిట్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.
Asus జెన్‌బుక్ S 16, జెన్‌బుక్ S 14 రెండూ గరిష్టంగా 32GB వరకు LPDDR5X RAM, 1TB వరకు NVMe SSD స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లార్జ్ Zenbook S 16 మోడల్ 78Wh బ్యాటరీతో వస్తుంది. USB 3.2 Gen 2 Type-A పోర్ట్, రెండు USB 4 Type-C పోర్ట్‌లు, HDMI 2.1 పోర్ట్, ఒక MicroSD కార్డ్ స్లాట్, 3.5mm ఆడియో జాక్‌ని కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన