కొత్త ఐఫోన్ సిరీస్‌ను భారతదేశంలో తయారు చేయడం మొదట బేస్ మోడల్స్‌పైనే దృష్టి పెడుతుంది. Pro మరియు Pro Max మోడల్స్ ఉత్పత్తి సామర్థ్యం ప్రారంభం అయిన కొన్ని వారాల తర్వాత మాత్రమే పెరుగుతుంది.
Photo Credit: Apple
భారతదేశంలో ఐఫోన్ 17 (చిత్రంలో) ధర బేస్ 256GB కాన్ఫిగరేషన్‌కు రూ. 82,900గా నిర్ణయించబడింది
యాపిల్ గత వారం నిర్వహించిన ‘అవే డ్రాపింగ్' ఈవెంట్‌లో తన తాజా iPhone 17 సిరీస్ మరియు iPhone Air మోడల్స్‌ను ఆవిష్కరించింది. సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి, సెప్టెంబర్ 19 నుంచి షిప్పింగ్ మొదలైంది. అయితే అందరికీ ఒకే సమయంలో ఫోన్లు డెలివరీ అవ్వడం లేదు. యాపిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం డెలివరీ టైమ్‌లైన్ ఆలస్యమవుతోంది. అదే సమయంలో భారతీయ రిటైలర్ల వద్ద కూడా స్టాక్ కొరత ఉన్నట్లు సమాచారం.iPhone 17 సిరీస్, iPhone Air స్టాక్ కొరత,మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం, iPhone 17 సిరీస్ మరియు iPhone Air మోడల్స్‌కు సరిపడా స్టాక్ రిటైలర్ల వద్ద లేదని హెచ్చరించారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, భారతదేశంలో యాపిల్ తన రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తుండటం వల్ల ఒక్కో స్టోర్‌కు వచ్చే iPhone 17 Pro మరియు iPhone 17 Pro Max యూనిట్ల సంఖ్య తగ్గిపోతోందని చెబుతున్నారు.
కొత్త ఐఫోన్ సిరీస్‌ను భారతదేశంలో తయారు చేయడం మొదట బేస్ మోడల్స్‌పైనే దృష్టి పెడుతుంది. Pro మరియు Pro Max మోడల్స్ ఉత్పత్తి సామర్థ్యం ప్రారంభం అయిన కొన్ని వారాల తర్వాత మాత్రమే పెరుగుతుంది.
సుమారు 500 యూనిట్ల షిప్మెంట్‌లో, Pro మోడల్స్ కేవలం 50 యూనిట్లు మాత్రమే ఉంటాయి. Pro Max కోసం ఈ సంఖ్య దాదాపు 10 యూనిట్లు మాత్రమే ఉంటాయి. 512GB మరియు 1TB వంటి అధిక స్టోరేజ్ వేరియంట్లు చాలా అరుదుగా లభిస్తున్నాయి. కాబట్టి వినియోగదారులు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్ లేదా అధికారిక రిటైల్ చానెల్‌ల ద్వారా కొనుగోలు చేయాల్సి రావచ్చు. అయినప్పటికీ, డెలివరీలో మరింత ఆలస్యం జరగే అవకాశం ఉంది.
యాపిల్ వెబ్‌సైట్‌లో కనిపిస్తున్న సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి. ఉదాహరణకు, iPhone 17 వైట్ కలర్ వేరియంట్ (256GB) ఢిల్లీలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 మధ్యలో షిప్ అవుతుంది. ఇదే పరిస్థితి ఇతర కలర్ ఆప్షన్లు మరియు స్టోరేజ్ వేరియంట్లకూ వర్తిస్తుంది.
iPhone Air షిప్పింగ్ కూడా ఇలాగే ఆలస్యమవుతోంది. బేస్ వేరియంట్ (లైట్ గోల్డ్ కలర్ సహా ఇతర కలర్స్) కూడా సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6 మధ్యలో షిప్ అవుతుందని అంచనా.
అత్యధిక డిమాండ్‌లో ఉన్న iPhone 17 Pro Max కోసం వేచి చూడాల్సిన సమయం ఇంకా ఎక్కువ. 256GB వేరియంట్ అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 మధ్యలో మాత్రమే డెలివరీ అవుతుందని వెబ్‌సైట్‌లో చూపిస్తున్నారు.
ఆశ్చర్యకరంగా, దేశంలో యాపిల్ యొక్క తొలి అధికారిక స్టోర్ అయిన సాకేత్ స్టోర్ లో ఈ మోడల్స్ బేస్ కాన్ఫిగరేషన్లు పూర్తిగా సేల్ అవుట్ అయ్యాయి.
ఈ లెక్కన చూస్తుంటే ఐఫోన్ అభిమానులు ఆన్లైన్ డెలివరీ కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సి వచ్చేలా ఉంది.
ప్రకటన
ప్రకటన