Moto G36 త్వరలోనే మార్కెట్లోకి రానుందని సమాచారం. 6,790mAh బ్యాటరీ కెపాసిటీతో, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ న్యూ మోడల్ రానుందట. ఈ కొత్త ఫోన్ కొలతలు 166.3×76.5×8.7mm అని తెలుస్తోంది. ఇక ఈ మోడల్ ఫోన్ బరువు 210 గ్రాములు ఉంటుందని సమాచారం.
Photo Credit: Motorola
Moto G36 లాంచ్ త్వరలో జరగవచ్చు
మోటో నుంచి సరికొత్త మోడల్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. మోటో జీ సిరీస్ నుంచి Moto G36 లాంచ్ త్వరలోనే జరగబోతోంది. ఎందుకంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరో రెగ్యులేటర్ వెబ్‌సైట్‌లో గుర్తించారు. కంపెనీ నుండి ఉద్దేశించిన Moto G36 విడుదల తేదీ గురించి మాత్రం ఇంకా అప్డేట్ రాలేదు. కానీ చైనీస్ రెగ్యులేటరీ అథారిటీ TENAA కొన్ని ఫోటోలు, స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. Moto G36 6.72-అంగుళాల డిస్‌ప్లే, 6,790mAh బ్యాటరీని కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ మోడల్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రానుందట. గత సంవత్సరం Moto G35కి కొనసాగింపుగా Moto G36 రానుంది.
XT2533-4 మోడల్ నంబర్‌తో కొత్త Motorola ఫోన్ చైనాలో TENAA ద్వారా ధృవీకరించబడింది. ఈ హ్యాండ్‌సెట్ Moto G36గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లిస్టింగ్ ప్రకారం ఉద్దేశించిన Moto G36 1,080×2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుందట. ఈ హ్యాండ్‌సెట్ 2.4GHz బేస్ కోర్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో వస్తుందట. లిస్టింగ్ ఫోన్ కోసం 4GB, 8GB, 12GB, 16GB RAMలతో 64GB, 128GB, 256GB, 512GB స్టోరేజీతో వస్తున్నాయట.
Moto G36 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందట. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ షూటర్ ఉంటాయని తెలుస్తోంది. దీనికి 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండవచ్చని సమాచారం. ఇది 6,790mAh బ్యాటరీ కెపాసిటీ వస్తుందట. అయితే Motorola దీనిని 7,000mAh సెల్‌గా మార్కెట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సర్టిఫికేషన్ Moto G36ను ఊదా రంగులో వెల్లడిస్తుంది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను అందించే అవకాశం ఉంది. దీని కొలతలు 166.3×76.5×8.7mm, బరువు 210 గ్రాములు ఉంటుందని సమాచారం.
Moto G36 లాంచ్ తేదీని Motorola ఇంకా నిర్ధారించలేదు. ఇది బడ్జెట్- ఫ్రెండ్లీగా ఉంటుందని సమాచారం. Moto G35 5G కంటే అప్‌గ్రేడ్‌లతో రావచ్చని టాక్. గత సంవత్సరం డిసెంబర్‌లో భారతదేశంలో రూ. 9,999 ధరతో విడుదలైన మోడల్ 4GB + 128GB స్టోరేజీ వచ్చిందన్న సంగతి తెలిసిందే.
Moto G35 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 6.72-అంగుళాల పూర్తి-HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. Unisoc T760 SoCతో ఈ హ్యాండ్‌సెట్ పని చేస్తుంది. 50-మెగాపిక్సెల్ క్వాడ్-పిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 20W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ కెపాసిటీతో రానుంది.
ప్రకటన
ప్రకటన