Photo Credit: Qualcomm
స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్‌లు సరసమైన PCల కోసం రూపొందించబడ్డాయి
భారతదేశంలో న్యూ స్నాప్‌డ్రాగన్ X CPUలను త్వరలో విడుదల చేయనున్నట్లు స్నాప్‌డ్రాగన్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. గత నెలలో జరిగిన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ షో (CES) 2025లో తొలిసారిగా ఆవిష్కరించబడిన ఈ ప్రాసెసర్‌లు Intel, AMD వంటి ఇతర కంపెనీల నుండి సరసమైన ఆఫర్‌లతో వస్తోన్న వాటితో పోటీ పడాలనే లక్ష్యంగా రాబోతున్నాయి. వాటి గ్లోబల్ counterparts మాదిరిగానే, ఈ స్నాప్‌డ్రాగన్ X CPUలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్స్‌కు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ను ఉపయోగించుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా $600 (దాదాపు రూ. 51,400) కంటే తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లను అందించేలా ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ రూపొందిస్తోంది. భారతీయ మార్కెట్‌లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా, X (గతంలో ట్విట్టర్)లో చేసిన ఓ పోస్ట్‌లో.. స్నాప్‌డ్రాగన్ ఇండియా ఫిబ్రవరి 24న దేశంలో స్నాప్‌డ్రాగన్ X ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు, ఈ చిప్‌మేకర్ ఇంకా ఎలాంటి స్పెసిఫికేషన్స్ వెల్లడించనప్పటికీ, ఈ ఈవెంట్‌కు AI PCలు అందరికీ అనే లేబుల్‌తో ప్రత్యక్షమైంది. దీంతో, కొత్త ప్రాసెసర్‌లను సరసమైన ధరకు AI పనితీరుతో అందించాలనేదే ప్రధాన లక్ష్యంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గ్లోబల్ కౌంటర్‌పార్ట్‌ల మాదిరిగానే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ X CPUలు కూడా 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌తో రూపొందించబడతాయని అంచనా. అలాగే, ఇందులోని ఎనిమిది ఓరియన్ CPU కోర్లు 3GHz వరకు గరిష్ట క్లాక్ స్పీడ్‌తో ఉంటాయి. ఇది వరుసగా 3.4GHz, 3.8GHz వరకు క్లాక్ స్పీడ్‌లను కలిగి ఉన్న స్నాప్‌డ్రాగన్ X ప్లస్, ఎలైట్ వేరియంట్‌ల కంటే తక్కువ. అయితే, క్వాల్కమ్ అడ్రినో GPU 4K/ 60Hz వద్ద మూడు ఎక్స్‌ట్రనల్ డిస్‌ప్లేలకు సపోర్ట్ చేస్తుంది.
ఈ చిప్ 30MB మొత్తం cache, 135GB/s మెమరీ బ్యాండ్‌విడ్త్‌తో 64GB వరకు LPDDR5x RAMకి సపోర్ట్ ఇస్తుంది. అంతే కాదు, కంపెనీ దీనిని హెక్సాగాన్ NPUతో అమర్చింది. ఇది సెకనుకు 45 ట్రిలియన్ ఆపరేషన్‌లను (TOPS) AI పనితీరును అందించగలదు. అలాగే, స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్‌తో నడిచే పరికరాలు అధికారికంగా Microsoft Copilot+ PCలుగా గుర్తించబడతాయి. ఇప్పటికే ఉన్న కంపెనీల ప్రాసెసర్‌లతో పోలిస్తే, రాబోయే కొత్త ప్రాసెసర్‌లు పూర్తి అప్‌గ్రేడ్‌గా కనిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా, పోటీగా ఉన్న ఇతర ప్రాసెసర్‌ల కంటే ఇవి రెండు రెట్లు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తోపాటు 163 శాతం వరకు వేగవంతమైన పనితీరును అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాదు, అదనంగా ఈ ప్లాట్‌ఫామ్ 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, USB 4 టైప్-C లాంటి కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్స్ ప్రకటించిన తర్వాత రాబోయే ప్రాసెసర్‌పై మార్కెట్ అంచనాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రకటన
ప్రకటన