Photo Credit: Apple
గత 12 నెలల వ్యవధిలో తయారు చేయబడిన కొన్ని iPhone 14 ప్లస్ యూనిట్‌లలోని వెనుక కెమెరా ప్రివ్యూ సమస్య పరిష్కారం కోసం Apple ఒక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ మొబైల్స్‌కు ఎలాంటి అదనపు ఛార్జ్ లేకుండా అధీకృత Apple సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. కస్టమర్‌లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా వారి హ్యాండ్‌సెట్‌పై ఈ సమస్య ప్రభావం ఉందో లేదో ధృవీకరించుకోవచ్చు. అలాగే, iPhone 14 Plusలో వెనుక కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే చెల్లింపులు చేసిన వినియోగదారులు వాపసు కోసం Appleని సంప్రదించవచ్చు. ఈ సర్వీసులో మరే ఐఫోన్ మోడల్‌లూ కవర్ చేయబడవు.
కంపెనీ అధికారిక సపోర్ట్ పేజీలో వెల్లడించిన వివరాల ప్రకారం.. iPhone 14 ప్లస్ యూనిట్‌లలో చాలా తక్కువ శాతం ఈ కెమెరా ప్రివ్యూ సమస్య ప్రభావితమవుతుందని పేర్కొంది. ఏప్రిల్ 10, 2023 నుంచి ఏప్రిల్ 28, 2024 మధ్య ఉత్పత్తి చేయబడిన iPhone 14 Plus యూనిట్లు ప్రభావితం కావచ్చని అంచనా వేస్తోంది.
iPhone 14 Plus వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ ఈ సమస్య వల్ల ప్రభావితం చెందుతుందో లేదో తెలుసుకునేందుకు ఎటువంటి ఛార్జీ లేకుండా ఉచిత సర్వీసింగ్‌కు తనిఖీ కోసం కంపెనీ సపోర్ట్ పేజీలో వారి క్రమ సంఖ్యను నమోదు చేస్తే సరిపోతుంది. అంతేకాదు, యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ప్రభావిత యూనిట్‌ను మొదటిసారి కొనుగోలు చేసిన తర్వాత మూడేళ్లపాటు కవర్ చేస్తుంది.
తాజా iPhone 14 Plusలో సీరియల్ నంబర్‌ను కనుగొనడానికి వినియోగదారులు సెట్టింగ్స్ యాప్‌ను తెరిచి, General > Aboutను టచ్ చేయాలి. అలా ఈ స్క్రీన్‌పై సీరియల్ నంబర్‌పై ఎక్కువసేపు టచ్ చేయడం ద్వారా కాపీ షార్ట్‌కట్ కనిపిస్తుంది. ఐఫోన్ 14 ప్లస్ సర్వీస్ ప్రోగ్రామ్ కోసం Apple సపోర్ట్ పేజీలోని ఫీల్డ్‌లో టెక్ట్స్‌ను పేస్ట్ చేసేందుకు వినియోగదారులను యాక్సెస్ ఇస్తుంది.
Apple సపోర్ట్ పేజీలో పేర్కొన్నదానిని బట్టీ.. డ్యామేజ్ సమస్య అంటే, విరిగిన వెనుక గ్లాస్ ప్యానెల్ వంటి డ్యామేజీ ఉన్న వినియోగదారులు వెనుక కెమెరా సర్వీసును సమస్యలను ముందుగా పరిష్కరించాల్సి ఉంటుంది. అలాంటివారు ఉచిత సర్వీస్ ప్రోగ్రామ్‌లా కాకుండా, అదనపు మరమ్మతుల కోసం ఛార్జీ విధించనున్నట్లు Apple తెలిపింది. iPhone 14 ప్లస్ వెనుక కెమెరా సర్వీస్ కోసం ఇప్పటికే డబ్బులు చెల్లించిన కస్టమర్‌లు వాపసు కోసం Appleని సంప్రదించవచ్చు. ఈ సమస్యతో ప్రభావితమైన వినియోగదారులు ఆపిల్ రిటైల్ స్టోర్, అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు లేదా మెయిల్-ఇన్ సర్వీస్ ఆప్షన్ ద్వారా కూడా ఉచిత రిపేర్‌ను పొందే అవకాశం ఉంది. డిసెంబర్ 2023లో కొనుగోలు చేసిన iPhone 14 Plus ప్రభావిత క్రమ సంఖ్య పరిధిలో లేదని స్పష్టమైంది.
ప్రకటన
ప్రకటన