Photo Credit: Qualcomm
హవాయిలో జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను Qualcomm ఆవిష్కరించింది. Qualcomm సరికొత్త మొబైల్ ప్రాసెసర్ ఆన్-డివైస్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మల్టీ-మోడల్ AI సామర్థ్యాలు, డెడికేటెడ్ హెక్జ్సన్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU), సెకెండ్ జనరేషన్ కస్టమ్ వంటి అప్‌గ్రేడ్‌లతో టాప్-ఆఫ్-ది-లైన్ పనితీరును అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలగే, Qualcomm Oryon CPU, AI ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (ISP)లు కూడా ఉన్నాయి. ఈ లక్ష్యాలతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ దాని ముందున్న Snapdragon 8 Gen 3 కంటే మెరుగైన పనితీరుతో రానుంది.
Qualcomm నుంచి వస్తోన్న ఈ తాజా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఆధారిత ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ పరికరాలు మరికొన్ని వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. Asus, Honor, iQOO, OnePlus, Oppo, Realme, Samsung, Vivo, Xiaomiతో సహా గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) ఫ్లాగ్‌షిప్ పరికరాల కోసం ఈ చిప్‌ని వినియోగించనున్నారు. SM8750-AB మోడల్ నంబర్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 పైన ఫ్లాగ్‌షిప్ పరికరాల కోసం అమర్చబడి ఉంది. ఈ చిప్ 3-నానోమీటర్ ఫాబ్రికేషన్ ప్రాసెస్ ఆధారంగా 64-బిట్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించారు.
ఇది సింగిల్, మల్టీ-కోర్ రెండింటిలోనూ 45 శాతం పనితీరు మెరుగుదలని అందజేస్తుందని స్పష్టమైంది. వెబ్ బ్రౌజింగ్‌లోనూ 62 శాతం మెరుగుపడింది. ఈ ప్రాసెసర్‌ను వినియోగించే పరికరాలు LPDDR5x RAM, UFS 4.0 స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తాయని Qualcomm తెలిపింది. ఇది స్మార్ట్‌ఫోన్ గేమింగ్‌లో ఫిల్మ్-క్వాలిటీ 3D ఎన్విరాన్‌మెంట్‌లను ఎనేబుల్ చేయడం కోసం అన్‌రియల్ ఇంజిన్ 5 నానైట్ సొల్యూషన్‌ను అందిస్తుంది.
ఈ చిప్‌సెట్ ఆన్-డివైస్ జనరేటివ్ AI, మల్టీ-మోడల్ సామర్థ్యాలు, లాంగ్ టోకెన్ ఇన్‌పుట్‌లకు సపోర్ట్ చేస్తుంది. వాయిస్, టెక్స్ట్, ఇమేజ్, లైవ్-వ్యూ ప్రాంప్ట్‌లను అనుమతిస్తుంది. Qualcomm AI పనితీరులో 45 శాతం పెరుగుదలను చూపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ముందున్న దానితో పోల్చితే 27 శాతం ఎక్కువ శక్తిని కలిగుంటుందని చిప్‌మేకర్ వెల్లడించారు. Qualcomm 3D Sonic Sensor Max సపోర్ట్ ప్రత్యేక సెన్సార్ సపోర్ట్‌తో ఈ ప్రాసెసర్ ఫింగర్‌ప్రింట్ గుర్తింపును సపోర్ట్ చేస్తుంది. ప్రత్యామ్నాయంగా వాయిస్, ఫేషియల్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్‌కు అనుమతిస్తుంది.
కనెక్టివిటీ చూస్తే.. Qualcomm FastConnect 7900 సిస్టమ్‌ని Wi-Fi 7కి 6GHz, 5GHz, 2.4GHz స్పెక్ట్రల్ బ్యాండ్‌లు, బ్లూటూత్ 5.4తో సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు 320-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌లకు సపోర్ట్ ఇవ్వగలవు. చిప్‌సెట్ ట్రిపుల్ 18-బిట్ స్పెక్ట్రా AI ISP సెటప్‌ను కలిగి ఉంటుంది. AI ఆధారిత ఆటో-ఎక్స్‌పోజర్, ఆటో-ఫోకస్, ఫేస్ డిటెక్షన్ వంటి ఇతర లక్షణాలన్నాయి. ఇది సెకనుకు 60 ఫ్రేమ్‌ల (fps) వద్ద 8K రిజల్యూషన్‌లో వీడియో క్యాప్చర్, ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన