యాపిల్ సోమవారం తన ఐఫోన్ యూజర్ల కోసం iOS 26.1 బీటా 2 అప్‌డేట్‌ను డెవలపర్లు మరియు బీటా టెస్టర్లకు విడుదల చేసింది.
Photo Credit: Apple
iOS 26 ఆపిల్ లిక్విడ్ గ్లాస్ అని పిలిచే కొత్త డిజైన్ భాషను పరిచయం చేసింది
యాపిల్ సోమవారం తన ఐఫోన్ యూజర్ల కోసం iOS 26.1 బీటా 2 అప్‌డేట్‌ను డెవలపర్లు మరియు బీటా టెస్టర్లకు విడుదల చేసింది. ఈ కొత్త ఫర్మ్‌వేర్, iOS 26.1 సిరీస్‌లోని మొదటి బీటా విడుదలైన దాదాపు రెండు వారాల తరువాత వచ్చింది. ఈ అప్‌డేట్‌లో పెద్ద మార్పులు కాకపోయినా, కొన్ని చిన్న కానీ ఉపయోగకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అదనంగా, సెట్టింగ్స్ యాప్‌లో టెక్స్ట్ మరియు ఐకాన్ అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు కూడా చోటుచేసుకున్నాయి.యాపిల్ ఎప్పటిలాగే ఈ అప్‌డేట్‌లో ఉన్న మార్పులను అధికారికంగా వివరించలేదు. విడుదల నోట్స్‌లో “iOS 26 బీటా మీకు రాబోయే యాప్స్, ఫీచర్లు మరియు టెక్నాలజీలపై ముందస్తు చూపు ఇస్తుంది” అని మాత్రమే పేర్కొంది. దీని బిల్డ్ నంబర్ 23B5059e.
అయితే, MacRumors వెబ్‌సైట్ చేసిన విశ్లేషణ ప్రకారం ఈ బీటా వర్షన్‌లో ఉన్న కొత్త ఫీచర్లపై కొంత స్పష్టత లభించింది. యాపిల్ అలారంలను సెట్ చేసే విధానంలో చిన్న మార్పు చేసింది. ఇప్పటి వరకు అలారం ఆపడానికి “ట్యాప్” చేయాల్సి వచ్చేది. ఇకపై, యూజర్లు స్క్రీన్‌పై వేళ్లను స్లైడ్ చేయడం ద్వారా అలారం ఆపవచ్చు. ట్యాప్ చేస్తే అలారం స్నూజ్ అవుతుంది, కానీ ఆపాలంటే స్లైడ్ చేయాల్సిందే.
అలాగే, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెక్షన్‌లో కొత్తగా బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ అనే ఆప్షన్‌ను జోడించారు. ఇది ఆటోమేటిక్‌గా సెక్యూరిటీ అప్‌డేట్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసే టాగుల్‌ను అందిస్తుంది. ఈ కొత్త ఆప్షన్, గతంలో ఉన్న రాపిడ్ సెక్యూరిటీ రెస్పాన్స్ ఫీచర్‌ను భర్తీ చేస్తోంది.
ఇక ఫిట్నెస్ యాప్‌లో యూజర్లు తమ స్వంత కస్టమ్ వర్కౌట్లు సృష్టించుకోగలరు. ఇందులో వర్కౌట్ టైప్, యాక్టివ్ కేలరీస్ ఎఫర్ట్ లెవల్, డ్యురేషన్, స్టార్ట్ టైమ్ వంటి వివరాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. సెట్టింగ్స్ యాప్‌లో టెక్స్ట్ మరియు ఐకాన్‌లు ఇప్పుడు ఎడమ వైపుకు అలైన్ అయ్యేలా మార్చబడ్డాయి. ఇదే విధంగా హోమ్ స్క్రీన్‌లోని ఫోల్డర్ పేర్లు కూడా ఇప్పుడు ఎడమవైపుకే సెట్ అవుతున్నాయి.
ఫొటోస్ యాప్‌లో కూడా కొంత మార్పు జరిగింది. “Favourite”, “Play as Slideshow”, “Hide” వంటి ఆప్షన్‌లు ఇప్పుడు మెనూ టాప్ భాగంలో కనిపిస్తున్నాయి. గతంలో ఇవి డ్రాప్‌డౌన్ మెనూలో మాత్రమే కనిపించేవి.
ఇతర చిన్న మార్పుల్లో, ఐకాన్ మరియు బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌లో మరింత నేచురల్ లైట్ ఎఫెక్ట్, వాల్ పేపర్ సెట్ చేసే సమయంలో కాసేపు “Pinch to Crop” ఆప్షన్ కనపడటం, అలాగే యాక్సిస్బిలిటీ సెట్టింగ్స్ లో కొత్తగా డిస్ప్లే బోర్డర్ టాగుల్ జోడించబడడం ఉన్నాయి.
ఈ iOS 26.1 బీటా 2 అప్‌డేట్ ప్రస్తుతం iPhone 11 మరియు అంతకుమించి ఉన్న మోడల్స్‌కి డెవలపర్లు మరియు బీటా టెస్టర్లకు ఉచితంగా అందుబాటులో ఉంది. సాధారణ వినియోగదారులు కూడా యాపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకొని పబ్లిక్ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
అప్‌డేట్ చేయాలనుకునేవారు తమ ఐఫోన్‌లో Settings > General > Software Update > Install Now లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన