నోయిడా స్టోర్ కూడా అదే థీమ్‌ను కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలి రెక్కల నుండి ప్రేరణ పొందిన రంగుల డిజైన్ ఆ ప్రాంతంలో సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే శైలిలో రూపొందించిన ప్రచారాన్ని ఆపిల్ ఈ సంవత్సరంలో బెంగుళూరులోని Apple Hebbal మరియు పుణెలోని Apple Koregaon Park స్టోర్ల ప్రారంభోత్సవాల్లో కూడా ఉపయోగించింది.

నోయిడా స్టోర్ కూడా అదే థీమ్‌ను కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఆపిల్ కోరెగావ్ పార్క్ (చిత్రంలో) భారతదేశంలో కంపెనీ యొక్క తాజా రిటైల్ స్టోర్, ఇది ఆగస్టులో ప్రారంభించబడింది.

ముఖ్యాంశాలు
  • నోయిడా సెక్టర్ 18లోని DLF Mall of Indiaలో ఆపిల్ స్టోర్ ప్రారంభం.
  • నెమలి రెక్కల థీమ్‌తో రూపొందించిన ప్రత్యేక బ్యారికేడ్ ఆకర్షణగా.
  • తాజా iPhone 17 సిరీస్ నుంచి MacBooks వరకు అన్ని ఆపిల్ ఉత్పత్తులు అందుబాటు
ప్రకటన

ఆపిల్ భారత మార్కెట్లో తన రిటైల్ విస్తరణను వేగవంతం చేస్తోంది. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం, నోయిడాలో కొత్త ఆపిల్ స్టోర్ వచ్చే నెల ప్రారంభంలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. డిసెంబరు 11న తన తలుపులు తెరవనున్న ఈ స్టోర్, Delhi-NCR ప్రాంతంలో ఆపిల్ స్థాపిస్తున్న రెండో రిటైల్ సౌకర్యంగా నిలుస్తోంది. 2023లో ప్రారంభమైన Apple Saket తరువాత ఇది ఆ ప్రాంతానికి మరో ముఖ్య కేంద్రం అవుతుంది. ఇదే సమయంలో, ముంబైలో కూడా కొత్త స్టోర్ ఏర్పాటుకు ఆపిల్ సిద్ధమవుతోందని, వచ్చే సంవత్సరం అక్కడ రెండో స్టోర్‌ను ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు సూచిస్తున్నాయి.

నోయిడాలోని ఈ కొత్త స్టోర్ DLF Mall of India, సెక్టర్ 18లో ఏర్పాటు చేయబడుతోంది. స్టోర్ కోసం రూపొందించిన ప్రత్యేక బ్యారికేడ్ డిజైన్‌ను కంపెనీ ఇప్పటికే ఆవిష్కరించింది. భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలి రెక్కల నుండి ప్రేరణ పొందిన రంగుల డిజైన్ ఆ ప్రాంతంలో సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే శైలిలో రూపొందించిన ప్రచారాన్ని ఆపిల్ ఈ సంవత్సరంలో బెంగుళూరులోని Apple Hebbal మరియు పుణెలోని Apple Koregaon Park స్టోర్ల ప్రారంభోత్సవాల్లో కూడా ఉపయోగించింది. నోయిడా స్టోర్ కూడా అదే థీమ్‌ను కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ స్టోర్‌లో ఆపిల్ తన పూర్తి ఉత్పత్తుల శ్రేణిని అందుబాటులో ఉంచనుంది. తాజా iPhone 17 సిరీస్, Apple Watch Series 11, AirPods Pro, కొత్త iPad మోడల్స్, iMacలు, MacBookలు తదితర పరికరాలను వినియోగదారులు ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. ఈతో పాటు, “Today at Apple” పేరుతో ఆపిల్ క్రియేటివ్ టీమ్ నిర్వహించే ఉచిత సెషన్లు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. కళ, కోడింగ్, సంగీతం, ఫోటోగ్రఫీ వంటి అంశాల్లో వినియోగదారులకు ప్రత్యక్షంగా విద్య అందించడం ఆ సెషన్‌ల ప్రధాన లక్ష్యం.

స్టోర్‌లో Genius Bar కూడా ఉండనుంది. ఇక్కడ కస్టమర్లు తమ పరికరాల మరమ్మతులు, అప్‌డేట్లు, డయగ్నస్టిక్ సేవలు వంటి వాటిని ఆపిల్ సర్టిఫైడ్ టెక్నీషియన్ల ద్వారా పొందవచ్చు. అనుభవజ్ఞులైన నిపుణులు అసలైన ఆపిల్ భాగాలతోనే సేవలు అందించనున్నారు. అదనంగా, ‘Shop with a Specialist over Video' సేవ కూడా అందుబాటులో ఉంటుంది. దీనివల్ల వినియోగదారులు వీడియో కాల్ ద్వారా ఆపిల్ నిపుణులతో మాట్లాడి తమకు సరిపోయే ఉత్పత్తులపై సూచనలు పొందడం, మోడళ్లను పోల్చడం, కొనుగోలు అవకాశాలను తెలుసుకోవడం వంటి సేవలను పొందవచ్చు.

నోయిడా స్టోర్‌తో పాటు, భారతదేశంలో రిటైల్ విస్తరణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముంబైలో మరో స్టోర్ ప్రారంభించేందుకు ఆపిల్ దృష్టి సారించింది. ఈ వివరాలను ఆపిల్ రిటైల్ మరియు పీపుల్ విభాగానికి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీడ్రే ఓ బ్రైయన్ వెల్లడించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. కొత్త స్టోర్ ప్రారంభం తర్వాత, అది ఇప్పటికే ఉన్న Apple BKCకి తోడుగా రాష్ట్రంలో రెండో ఆపిల్ స్టోర్‌గా నిలవనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఐఫోన్ ఎయిర్‌పై అదిరే ఆఫర్.. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో కొనేవారికి సదావకాశం
  2. ఈ రెండు ఆఫర్లను కలిపి తీసుకుంటే iPhone 16 ధర రూ. 62,900 వరకు దిగుతుంది.
  3. ఎక్స్‌లో ఫీడ్‌ విషయంలో మరింత సాయపడనున్న గ్రోక్
  4. కెమెరా విభాగంలో ఈసారి నథింగ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందించింది.
  5. నోయిడా స్టోర్ కూడా అదే థీమ్‌ను కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
  6. వాట్సప్‌లో కొత్త అప్డేట్.. ఇకపై అవన్నీ బ్యాన్
  7. ఇంతకుముందు వచ్చిన మరో రిపోర్ట్ ఈ ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉండొచ్చని పేర్కొంది.
  8. దీంతో Samsung 200MP సెన్సార్‌లకు నేరుగా పోటీ ఇవ్వడానికి సోనీ సిద్ధమవుతున్నట్లు స్పష్టమ‌వుతోంది.
  9. ఈ ఫోన్ డిసెంబర్ 17న భారత మార్కెట్లో OnePlus 15R పేరుతో విడుదల కాబోతోంది.
  10. రియల్ మీ P4x మోడల్ ఫీచర్స్ తెలుసుకున్నారా?.. లాంఛ్ డేట్ ఇదే
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »