దీంతో Samsung 200MP సెన్సార్‌లకు నేరుగా పోటీ ఇవ్వడానికి సోనీ సిద్ధమవుతున్నట్లు స్పష్టమ‌వుతోంది.

సెన్సార్‌లోని రీ-బేయర్ సర్క్యూట్‌లో AI లాజిక్‌ను ఉపయోగించడం వల్ల భారీ పిక్సెల్ డేటాను ఫోన్ ప్రాసెసర్లు సులభంగా నిర్వహించగలుగుతున్నాయి. 12-బిట్ అనలాగ్-టు-డిజిటల్ పైప్‌లైన్, ఫైన్ 12-బిట్ ADC తో కలిసి పనిచేయడం వల్ల షాట్స్‌లో గ్రేడేషన్ మరింత సహజంగా, నాయిస్ తక్కువగా నిలుస్తుంది.

దీంతో Samsung 200MP సెన్సార్‌లకు నేరుగా పోటీ ఇవ్వడానికి సోనీ సిద్ధమవుతున్నట్లు స్పష్టమ‌వుతోంది.

సోనీ తన మొదటి 200MP ఫోన్ ఇమేజింగ్ సెన్సార్ LYT-901 ను విడుదల చేసింది

ముఖ్యాంశాలు
  • సోనీ తొలి 200MP కెమెరా సెన్సార్ LYT-901
  • కొత్త Quad-Quad Bayer టెక్నాలజీతో మెరుగైన ఫీచర్లు
  • 4K 120fps వరకు శక్తివంతమైన వీడియో సపోర్ట్ లాంచ్
ప్రకటన

భవిష్యత్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించిన కొత్త Sony LYT-901 మొబైల్ కెమెరా సెన్సార్‌ను సోనీ అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని వారాలుగా IMX09E అనే కోడ్‌తో లీక్ అవుతూ వచ్చిన ఈ సెన్సార్ గురించి సైజ్, HDR టెక్నిక్, జూమ్ సామర్థ్యాలు వంటి వివరాలు బయటకు వచ్చాయి. ఇది సోనీ నుండి ఫోన్ల కోసం విడుదలైన తొలి 200MP కెమెరా సెన్సార్ కావడం విశేషం. దీంతో Samsung 200MP సెన్సార్‌లకు నేరుగా పోటీ ఇవ్వడానికి సోనీ సిద్ధమవుతున్నట్లు స్పష్టమ‌వుతోంది.Sony LYT-901 ముఖ్య లక్షణాలు,LYT-901 సెన్సార్‌లో 1/1.12″ పెద్ద ఇమేజింగ్ సర్ఫేస్, 0.7μm పిక్సెల్స్, 200 మెగాపిక్సెల్ అవుట్‌పుట్‌ను అందించే సామర్థ్యం ఉంది. ముందుగా IMX09E అని పిలిచిన ఈ హార్డ్‌వేర్‌ను ఇప్పుడు LYTIA సిరీస్‌లో భాగంగా సోనీ రీబ్రాండింగ్ చేసింది. సంప్రదాయ Bayer నిర్మాణం బదులు, సోనీ Quad-Quad Bayer మోసైక్‌ను ఉపయోగించి, ప్రత్యేక Remosaic హార్డ్‌వేర్ ద్వారా 2×2 Bayer రూపానికి మార్చుతుంది. దీని ద్వారా చిత్ర వివరాలు మరింత సహజంగా, స్పష్టంగా లభిస్తాయి.

సెన్సార్‌లోని రీ-బేయర్ సర్క్యూట్‌లో AI లాజిక్‌ను ఉపయోగించడం వల్ల భారీ పిక్సెల్ డేటాను ఫోన్ ప్రాసెసర్లు సులభంగా నిర్వహించగలుగుతున్నాయి. 12-బిట్ అనలాగ్-టు-డిజిటల్ పైప్‌లైన్, ఫైన్ 12-బిట్ ADC తో కలిసి పనిచేయడం వల్ల షాట్స్‌లో గ్రేడేషన్ మరింత సహజంగా, నాయిస్ తక్కువగా నిలుస్తుంది.

HDR కోసం, సోనీ రెండు పద్ధతులను కలిపిన హైబ్రిడ్ విధానాన్ని అమలు చేసింది. Dual Conversion Gain HDR ఆధారంగా పని చేస్తూ, ఒక మైక్రోసెకండ్‌ లో తీసే అదనపు ఫ్రేమ్‌ను కూడా జోడిస్తుంది. ఇది హైలైట్ క్లిప్పింగ్‌ను తగ్గించి, వేగంగా కదిలే సన్నివేశాల్లో గోస్టింగ్‌ సమస్యను దూరం చేస్తుంది. మొత్తం డైనమిక్ రేంజ్ 100dB కంటే ఎక్కువగా ఉండి, సుమారు 17 ఫోటోగ్రాఫిక్ స్టాప్‌ల సమానంగా ఉంటుంది.

జూమ్ విభాగంలో ఈ సెన్సార్ నిజమైన హైలైట్. 2x ఫోటో హార్డ్‌వేర్ జూమ్, 4x సెన్సర్-ఇన్ జూమ్‌ను ఫోటో, వీడియో రెండింటికీ అందిస్తుంది. 4x వద్ద ఫోన్‌లు వర్చువల్ టెలిఫోటో లెన్స్‌ను ఉపయోగించినట్టుగా క్లియర్ అవుట్‌పుట్ పొందగలవు. 4K 30fps వీడియోను 4x జూమ్ వద్ద రికార్డ్ చేయగలిగే ఒకే సెన్సార్ కూడా ప్రస్తుతం ఇదే. అదనంగా, 4x బిన్నింగ్‌తో 4K 120fps రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.

పిక్సెల్ బిన్నింగ్ మోడ్‌లలో 50MP (2×2) మరియు 12.5MP (4×4) ఉన్నాయి. ఇవి తక్కువ వెలుతురు పరిస్థితుల్లోనూ, ఎక్కువ జూమ్ అవసరమైన సందర్భాల్లోనూ మంచి క్వాలిటీ ఇస్తాయి. కచేరీలు, స్టేజీ పనులు, అరేనా ఈవెంట్స్ వంటి దూరం నుండి షూట్ చేసే సందర్భాల్లో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడేలా ట్యూన్ చేయబడింది.

ఈ సెన్సార్‌ను మొదట ఉపయోగించే ఫ్లాగ్‌షిప్‌లు Ultra కేటగిరీలో ఉండే అవకాశం ఉంది. రూమర్స్ ప్రకారం Oppo Find X9 Ultra లో 2026 మార్చిలో ఈ సెన్సార్‌తో రావచ్చని అనుకుంటున్నారు. Vivo X300 Ultra లో 2026 రెండో త్రైమాసికంలో ఈ మోడల్ కూడా ఇదే సెన్సార్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. సోనీ LYT-901 రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మొబైల్ ఫోటోగ్రఫీ ప్రమాణాలను మరో మెట్టుపైకి తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దీంతో Samsung 200MP సెన్సార్‌లకు నేరుగా పోటీ ఇవ్వడానికి సోనీ సిద్ధమవుతున్నట్లు స్పష్టమ‌వుతోంది.
  2. ఈ ఫోన్ డిసెంబర్ 17న భారత మార్కెట్లో OnePlus 15R పేరుతో విడుదల కాబోతోంది.
  3. రియల్ మీ P4x మోడల్ ఫీచర్స్ తెలుసుకున్నారా?.. లాంఛ్ డేట్ ఇదే
  4. OxygenOS 16తో రానున్న వన్ ప్లస్ Nord 4.. ఎన్నెన్నో మార్పులతో న్యూ ఫోన్
  5. తొలి వివరాల ప్రకారం, ఈ మార్పు ఫాలోఅప్ ప్రశ్నలను నిర్వహించే విధానాన్ని గణనీయంగా మెరుగుపరచనుంది.
  6. ముఖ్య సేవగా AI ఫీచర్లను అందించే ఏ ప్లాట్‌ఫారమ్ అయినా ఈ నిబంధనల పాటింపు తప్పనిసరి.
  7. ఈ స్థాయి బ్యాటరీ OnePlus లైన్‌అప్‌లో ఇప్పటివరకు చూడని అంశం కావడంతో కొత్త మోడల్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది..
  8. త్వరలోనే రానున్న పోకో C85 5G ఫోన్.. ఫీచర్స్, డిజైన్ గురించి ఈ విషయాలు తెలుసుకున్నారా?
  9. ఈ ఫోన్ భారత్లో విడుదలైన Oppo A5x కు కంటిన్యూషన్ గా రాబోతుందని అంచనా
  10. హువాయి నుంచి రానున్న జీటీ 6 ప్రో, జీటీ 6 స్మార్ట్ వాచెస్.. వీటి గురించి తెలుసుకున్నారా?
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »