ప్రస్తుత డిజిటల్ యుగంలో డాక్యుమెంట్లను వేగంగా, తక్కువ ఖర్చుతో ప్రింట్ తీసుకోవడం అనేది అందరికీ అవసరమైన పని.
Photo Credit: Amazon
HP Laserjet Pro Mfp M329Dw offers a print speed of up to 35 pages per minute
ప్రస్తుత డిజిటల్ యుగంలో డాక్యుమెంట్లను వేగంగా, తక్కువ ఖర్చుతో ప్రింట్ తీసుకోవడం అనేది అందరికీ అవసరమైన పని. ముఖ్యంగా ఇండియాలో హై-వాల్యూమ్ ప్రింటింగ్ కోసం లేజర్ ప్రింటర్లకే క్రేజ్ ఎక్కువ. హెచ్‌పీ, కెనాన్, బ్రదర్ వంటి టాప్ బ్రాండ్‌లు ఇప్పుడు మార్కెట్‌లో అదరగొడుతున్నాయి. మీరు ఒక మంచి లేజర్ ప్రింటర్ కొనాలనుకుంటే కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా, దాని ప్రింటింగ్ స్పీడ్, వైఫై కనెక్టివిటీ, టోనర్ లైఫ్ వంటి ఫీచర్లను కూడా గమనించాలి. అందుకే 35 వేల రూపాయల బడ్జెట్‌లో ప్రస్తుతం ఇండియాలో దొరుకుతున్న ది బెస్ట్ ఆప్షన్ల గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.
మొదటగా హెచ్‌పీ నుంచి వస్తున్న 'లేజర్‌జెట్ ప్రో ఎంఎఫ్‌పి ఎం329డీడబ్ల్యూ' గురించి మాట్లాడుకోవాలి. ఈ వైర్‌లెస్ మోనోక్రోమ్ ప్రింటర్ నిమిషానికి 35 పేజీల స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇది ఒక ఆల్-ఇన్-వన్ మోడల్ కాబట్టి ప్రింటింగ్, స్కానింగ్, కాపీయింగ్‌తో పాటు ఫ్యాక్స్ మరియు ఈమెయిల్ ప్రింటింగ్ కూడా చేసేయవచ్చు. దీని బరువు దాదాపు 17.1 కిలోలు ఉంటుంది. ఆటోమేటిక్ డ్యూప్లెక్స్ ప్రింటింగ్ ఫీచర్ ఉండటం వల్ల పేపర్ వినియోగం సగానికి తగ్గుతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మోడల్ ధర 28,899 రూపాయలుగా ఉంది, ఇది ఆఫీస్ అవసరాలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
అదే హెచ్‌పీ బ్రాండ్ నుంచి మరో ఆప్షన్ 'లేజర్ ఎంఎఫ్‌పి 355ఎస్‌డీఎన్‌డబ్ల్యూ'. ఇది నిమిషానికి 33 పేజీలను ప్రింట్ చేయగలదు. ఇందులో 600 డీపీఐ రిజల్యూషన్‌తో క్వాలిటీ ప్రింట్స్ వస్తాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే నెలకి 30,000 పేజీల వరకు డ్యూటీ సైకిల్‌ను తట్టుకోగలదు. దీనిలో 40 షీట్ల ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్ కూడా ఉంది. విండోస్, మ్యాక్ మరియు లినక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో ఇది ఈజీగా సింక్ అవుతుంది. వైఫై డైరెక్ట్ మరియు ఆపిల్ ఎయిర్ ప్రింట్ సపోర్ట్ చేసే ఈ ప్రింటర్ ధర ఇండియాలో 30,400 రూపాయలుగా నిర్ణయించారు.
కెనాన్ ప్రేమికుల కోసం 'ఇమేజ్ క్లాస్ ఎంఎఫ్264డీడబ్ల్యూ' ఒక స్మార్ట్ ఎంపిక. హోమ్ మరియు ఆఫీస్ యూజ్ కోసం డిజైన్ చేసిన ఈ ప్రింటర్ నిమిషానికి 30 పేజీల స్పీడ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది కూడా మల్టీఫంక్షన్ ప్రింటర్ కాబట్టి స్కాన్ మరియు కాపీ పనులు చిటికెలో అయిపోతాయి. దీని డ్యూటీ సైకిల్ కూడా నెలకు 30,000 పేజీల వరకు ఉంటుంది. బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో స్టైలిష్‌గా కనిపించే ఈ కెనాన్ మోడల్ ధర 34,490 రూపాయలు. క్వాలిటీ మరియు డ్యూరబిలిటీ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పడంలో సందేహం లేదు.
మీకు కలర్ ప్రింటింగ్ కావాలనుకుంటే 'హెచ్‌పీ కలర్ లేజర్ 150ఎన్‌డబ్ల్యూ' వైపు చూడొచ్చు. ఇది చిన్న ఆఫీసులకు లేదా ఇంటి అవసరాలకు చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ అండ్ వైట్ అయితే నిమిషానికి 18 పేజీలు, కలర్ అయితే 4 పేజీలను ప్రింట్ చేస్తుంది. హెచ్‌పీ స్మార్ట్ యాప్ ద్వారా మొబైల్ నుంచే ప్రింట్లు ఇచ్చుకోవచ్చు. వైఫై మరియు ఈథర్నెట్ కనెక్టివిటీతో వచ్చే ఈ మోడల్ ధర కేవలం 29,999 రూపాయలు మాత్రమే. తక్కువ బడ్జెట్‌లో కలర్ లేజర్ ప్రింటర్ కావాలనుకునే వారికి ఇది ఒక ట్రెండీ ఆప్షన్.
చివరిగా 'బ్రదర్ హెచ్ఎల్-ఎల్3220సీడీడబ్ల్యూ' మోడల్ గురించి చెప్పుకోవాలి. ఇది లేజర్ ఎల్‌ఈడీ టెక్నాలజీతో పనిచేస్తుంది. కలర్, మోనోక్రోమ్ రెండింటినీ నిమిషానికి 18 పేజీల స్పీడ్‌తో ప్రింట్ చేస్తుంది. ఇందులో 2400 డీపీఐ అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ చాలా క్లారిటీగా ఉంటాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ దీని స్పెషాలిటీ. మొబైల్ యాప్స్ ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. దీని ధర 33,709 రూపాయలు. ఇలా మీ అవసరాలను బట్టి ఈ ఐదు ప్రింటర్లలో మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Sony Raises PlayStation 5, PlayStation 5 Pro and PlayStation Portal Prices Globally
Oppo Find X9 Ultra Teased to Feature 10x Telephoto Camera With Advanced Stabilisation