శాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్‌లో గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G స్మార్ట్ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసి టెక్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Photo Credit: Samsung
A సిరీస్‌లో భాగంగా లేటెస్ట్ గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G
శాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్‌లో భాగంగా లేటెస్ట్ గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G స్మార్ట్ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసి టెక్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కొత్త ఫోన్లు కేవలం డిజైన్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా నెక్స్ట్ లెవల్ ఫీచర్లతో వస్తున్నాయి. ట్రెండీ లుక్, పవర్ఫుల్ స్పెక్స్‌తో ఉన్న ఈ ఫోన్లు ముఖ్యంగా యూత్, టెక్ లవర్స్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మార్కెట్లోకి వచ్చాయి. శాంసంగ్ తన సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగిస్తూనే ఈసారి AI టూల్స్‌ను కూడా జోడించి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత స్మార్ట్‌గా మార్చింది. ఈ ఫోన్లు బుధవారం అధికారికంగా పరిచయమయ్యాయి. వీటి ధరలు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి.
భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ A57 5G, A37 5G ధరలు వేర్వేరు మెమరీ ఆప్షన్లను బట్టి నిర్ణయించారు. గెలాక్సీ A57 5G బేస్ వేరియంట్ 8GB+256GB ధర రూ. 56,999 కాగా 12GB వేరియంట్ ధర రూ. 62,499 గా ఉంది. ఇక గెలాక్సీ A37 5G విషయానికి వస్తే దీని స్టార్టింగ్ ప్రైస్ రూ. 41,999 గా నిర్ణయించారు. ఇందులో 8GB+256GB వేరియంట్ రూ. 47,499, టాప్ ఎండ్ 12GB+256GB వేరియంట్ రూ. 52,499 ధరతో లభిస్తున్నాయి. ప్రీమియం రేంజ్లో ఉన్న ఈ ఫోన్లు వాటికి తగ్గట్టుగానే అదిరిపోయే ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. బడ్జెట్, అవసరాలను బట్టి యూజర్లు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది.
కొత్త ఫోన్లను కొనుగోలు చేసే వారి కోసం శాంసంగ్ అదిరిపోయే లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు బ్యాంక్ కార్డ్స్ లేదా UPI ద్వారా పేమెంట్ చేస్తే రూ. 3,000 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా 24 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే వారికి రూ. 3,000 అప్‌గ్రేడ్ బోనస్ లభిస్తుంది. ఈ ఫోన్లు అమెజాన్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ప్రస్తుతం ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 2 నుండి వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయి కాబట్టి ఇప్పుడే ఆర్డర్ చేసి ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.
డిస్ప్లే విషయంలో శాంసంగ్ ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు అని మరోసారి నిరూపించింది. ఈ రెండు ఫోన్లలోనూ 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. గెలాక్సీ A57 5G మోడల్ ఆసమ్ నేవీ, ఆసమ్ ఐసీబ్లూ, ఆసమ్ లైలాక్ వంటి కలర్లలో మెరిసిపోతుంటే గెలాక్సీ A37 5G మోడల్ ఆసమ్ లావెండర్, ఆసమ్ చార్కోల్ , గ్రేగ్రీన్ వంటి స్టైలిష్ కలర్లలో లభిస్తోంది. చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ కలర్ ఫినిషింగ్స్ యువతను కచ్చితంగా ఆకర్షిస్తాయి.
ఈ స్మార్ట్ఫోన్లు శాంసంగ్ సొంత ఎగ్జినోస్ చిప్సెట్లతో పనిచేస్తాయి. గెలాక్సీ A57లో ఎగ్జినోస్ 1680 ప్రాసెసర్ ఉండగా A37లో ఎగ్జినోస్ 1480 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 8.5 వెర్షన్‌తో ఈ ఫోన్లు రన్ అవుతాయి. వీటికి ఆరు తరాల పాటు OS అప్డేట్లు, సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది. అంటే ఈ ఫోన్ తీసుకుంటే రాబోయే చాలా ఏళ్ల వరకు సాఫ్ట్వేర్ టెన్షన్ ఉండదు. అంతేకాకుండా ఇందులో బిక్స్బీతో పాటు జెమిని, పెర్ప్లెక్సిటీ వంటి AI టూల్స్ ఉండటం వల్ల రోజువారీ పనులు మరింత సులభతరం అవుతాయి.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్లలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందించారు. గెలాక్సీ A57లో 12MP అల్ట్రావైడ్, 5MP మాక్రో లెన్స్ ఉండగా A37లో 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం రెండు ఫోన్లలోనూ 12MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 5,000mAh భారీ బ్యాటరీతో పాటు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీని జత చేశారు. ఇది కేవలం 30 నిమిషాల్లోనే 60 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP68 రేటింగ్, డేటా సెక్యూరిటీ కోసం నాక్స్ వాల్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లను మరింత పటిష్టంగా మార్చాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Cyberpunk 2077 Gets New Quests, Gameplay Features and Mod Support With Edgerunners 2 Update