'రియల్మీ 16 5G' అతి త్వరలో మన ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
Photo Credit: Realme
రియల్మీ 16 5G ఇండియా ప్రైస్ లీక్స్
రియల్మీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది బాస్! ఇప్పటికే మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 16 సిరీస్‌లో భాగంగా 'రియల్మీ 16 5G' అతి త్వరలో మన ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. రీసెంట్‌గా గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ఈ స్మార్ట్‌ఫోన్, ఇప్పుడు ఇండియన్ యూజర్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా కొన్ని క్రేజీ ఫీచర్లతో వస్తోంది. రియల్మీ తన నంబర్డ్ సిరీస్‌లో ఇప్పటికే ప్రో, ప్రో ప్లస్ మోడల్స్‌ని రిలీజ్ చేయగా, ఇప్పుడు బేస్ వేరియంట్‌గా వస్తున్న ఈ ఫోన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన లీక్స్ చూస్తుంటే ఈసారి రియల్మీ పక్కా ప్లాన్‌తో యూత్‌ను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ ఫోన్ హైలైట్స్ విషయానికి వస్తే అందరి కళ్లు దీని బ్యాటరీ పైనే ఉన్నాయి. ఏకంగా 7,000mAh బ్యాటరీతో ఈ మొబైల్ ఒక రేంజ్ పవర్‌హౌస్‌లా ఉండబోతోంది. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా ఉంటుందని అనుకుంటాం కానీ రియల్మీ ఇక్కడే మ్యాజిక్ చేసింది. కేవలం 8.1mm మందం, 183 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా ఉండటమే కాకుండా స్టైలిష్ లుక్ ఇస్తోంది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఏఐ స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ కూడా ఉండటంతో బ్యాటరీ లైఫ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కంపెనీ గట్టిగా చెస్తోంది. గంటల తరబడి ఇన్‌స్టా రీల్స్ చూసినా లేదా వాట్సాప్‌లో చాట్ చేసినా చార్జింగ్ అయిపోతుందన్న భయం ఉండదు.
డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో కూడా రియల్మీ అస్సలు తగ్గలేదు. 6.57 ఇంచుల స్క్రీన్‌తో పాటు ఏకంగా 4,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తోంది అంటే ఎండలో కూడా ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే గేమర్స్ కోసం 3,000Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఇవ్వడం విశేషం దీనివల్ల టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోన్ హీట్ అవ్వకుండా ఉండటానికి గాలిని ప్రసరించే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో వాడారు. ఇది గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా చూసుకుంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి IP69 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు గట్టి రక్షణ లభిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండబోతోంది. దీంతో పాటు ఒక 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్‌ను జత చేశారు. ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. పర్ఫార్మెన్స్ కోసం గ్లోబల్ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్‌ను వాడారు కాబట్టి ఇండియాలో కూడా ఇదే ప్రొసెసర్ వచ్చే ఛాన్స్ ఉంది. మల్టీటాస్కింగ్ కోసం 8GB, 12GB ర్యామ్ వేరియంట్లు ఉండటంతో యాప్స్ స్విచ్చింగ్ చాలా వేగంగా ఉంటుంది. ఇక స్టోరేజ్ పరంగా 256GB వరకు ఆప్షన్స్ ఉండటంతో ఫోటోలు, వీడియోలకు లోటు ఉండదు.
ధర గురించి మాట్లాడుకుంటే వియత్నాం మార్కెట్లో ఇది సుమారు 40 వేల రూపాయల రేంజ్‌లో లాంచ్ అయింది. కానీ ఇండియాలో రియల్మీ 16 ప్రో ప్లస్ ధర 39,999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నందున, ఈ బేస్ 16 5G మోడల్ అంతకంటే తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉంది. బహుశా 25 వేల నుండి 30 వేల రూపాయల మధ్యలో దీని ప్రైస్ ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎయిర్ బ్లాక్, ఎయిర్ వైట్ అనే రెండు ట్రెండీ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది కాబట్టి యూజర్స్ ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి రియల్మీ 16 5G ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. భారీ బ్యాటరీ కావాలి అనుకునే వారితో పాటు స్లిమ్ ఫోన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అవుతుంది. లాంచ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా వెబ్ సైట్లలో మైక్రోసైట్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి వచ్చే కొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఈ మొబైల్ రిలీజ్ అయితే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ మరింత పెరగడం ఖాయం. మీరు గనక ఒక మంచి బ్యాటరీ బ్యాకప్, లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే రియల్మీ 16 5G వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిది.
ప్రకటన
ప్రకటన
Sony Raises PlayStation 5, PlayStation 5 Pro and PlayStation Portal Prices Globally
Oppo Find X9 Ultra Teased to Feature 10x Telephoto Camera With Advanced Stabilisation