ఆపిల్ నుంచి అదిరిపోయే 'ఫోల్డబుల్ ఐఫోన్'! సెప్టెంబర్‌లోనే గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం

ఆపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అప్‌డేట్ వచ్చేసింది.

ఆపిల్ నుంచి అదిరిపోయే 'ఫోల్డబుల్ ఐఫోన్'! సెప్టెంబర్‌లోనే గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం

Photo Credit: Samsung

ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌

ముఖ్యాంశాలు
  • ఐఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్
  • మడతపెట్టే ఐఫోన్ వస్తోంది
  • ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,84,700 రూపాయలు
ప్రకటన

ఆపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. టెక్ ప్రపంచంలో గడిచిన కొన్నేళ్లుగా నలుగుతున్న 'ఐఫోన్ ఫోల్డ్' ముచ్చట ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ లీక్స్ ప్రకారం, ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు ఈ సెప్టెంబర్‌లోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అయితే బ్లూమ్‌బెర్గ్ టాప్ అనలిస్ట్ మార్క్ గుర్మాన్ మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌తో పాటు ఇది అనౌన్స్ అయినప్పటికీ, కస్టమర్ల చేతుల్లోకి వెళ్లడానికి మాత్రం ఇంకొంచెం టైమ్ పడుతుందని ఆయన హింట్ ఇచ్చారు. అంటే ఫోన్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్‌లో ఉన్నా, షిప్పింగ్ మాత్రం కాస్త ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉంది.

ఫోల్డబుల్ టెక్నాలజీ అనేది మామూలు విషయం కాదు, ఇది అత్యంత సంక్లిష్టమైన డిస్ప్లే ప్రాసెస్‌తో కూడుకున్నది. అందుకే ఆపిల్ దీని విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గతంలో ఐఫోన్ ఎక్స్ లాంచ్ సమయంలో కూడా ఆపిల్ ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అయ్యింది. కొత్త డిజైన్, సరికొత్త ఫామ్ ఫ్యాక్టర్ కావడంతో ప్రొడక్షన్ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవ్వడం సహజం. అందుకే సెప్టెంబర్ ఈవెంట్‌లో దీన్ని ప్రపంచానికి పరిచయం చేసినా, మార్కెట్లోకి రావడానికి మరో నెల రోజులు అదనంగా పట్టవచ్చు. ఐఫోన్ 18 ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్స్ సేల్స్ మొదలైన తర్వాతే ఈ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది.

ఈ ఫోల్డబుల్ ఐఫోన్ స్పెసిఫికేషన్స్ వింటే టెక్ గీక్స్ మెంటలెక్కిపోవడం ఖాయం. ఇందులో 7.8 ఇంచుల భారీ ఇంటర్నల్ డిస్ప్లే, 5.5 ఇంచుల ఎక్స్‌టర్నల్ స్క్రీన్‌ను ఆపిల్ అమర్చబోతోంది. ఇది చూడటానికి బుక్-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌లో ఉండబోతోంది. అంటే సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ , గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ మోడల్స్‌కు ఇది గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ. పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ లేకుండా ఆపిల్ తన పవర్ ఫుల్ 2nm A20 ప్రో చిప్‌ను ఇందులో వాడుతోంది. అలాగే కనెక్టివిటీ కోసం ఆపిల్ సొంతంగా డెవలప్ చేసిన C2 మోడమ్‌ను కూడా ఈ ఫోన్ లో చూడబోతున్నాం.

ఆపిల్ తన లాంచ్ విండోను కూడా ఈసారి మార్చేలా కనిపిస్తోంది. ఒకేసారి అన్ని మోడల్స్ రిలీజ్ చేయకుండా రెండు వేర్వేరు విండోల్లో వీటిని ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్,  ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ హైలైట్‌గా నిలుస్తాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది స్ప్రింగ్ సీజన్‌లో అంటే మార్చి లేదా ఏప్రిల్‌లో మిగతా మోడల్స్ అయిన ఐఫోన్ 18, ఐఫోన్ 18 ఎయిర్ మరియు ఐఫోన్ 18e లాంటివి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతి మోడల్ మీద యూజర్లకు స్పష్టమైన ఫోకస్ ఉంటుందని ఆపిల్ భావిస్తోంది. ఇది మార్కెట్ పరంగా కూడా ఆపిల్‌కు పెద్ద ప్లస్ అవుతుంది.

కెమెరా మరియు ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో డ్యూయల్ రియర్,  ఫ్రంట్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఆపిల్ తన సిగ్నేచర్ ఫేస్ ఐడికి బదులుగా, ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి పవర్ బటన్‌లోనే టచ్ ఐడి సెన్సార్‌ను ఇంటిగ్రేట్ చేసేలా డిజైన్ చేస్తోంది. ఇది యూజర్లకు చాలా హ్యాండీగా, ఈజీగా ఉంటుంది. ఇంటర్నల్ డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఆపిల్ టాప్ నాచ్ మెటీరియల్స్ వాడుతోంది, దీనివల్ల స్క్రీన్ మధ్యలో వచ్చే క్రీజ్ అస్సలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఐఫోన్ వాడకంలో ఉండే స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు పెద్ద స్క్రీన్‌పై చూడబోతున్నామన్నమాట.

ఇక అందరూ ఎదురుచూసే ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే, ఇది ఆపిల్ ప్రొడక్ట్ కాబట్టి జేబుకు చిల్లు పడటం ఖాయం. అమెరికా మార్కెట్లో దీని ధర సుమారు 1,999 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,84,700 రూపాయలు పైమాటే. చైనాలో 256GB వేరియంట్ ధర CNY 15,999 గా ఉండే ఛాన్స్ ఉంది. ఇంత కాస్ట్లీ అయినా సరే, ఆపిల్ బ్రాండ్ వాల్యూ, ఆ సరికొత్త ఫోల్డబుల్ ఎక్స్‌పీరియన్స్ కోసం యాపిల్ ఫ్యాన్స్ ఎంత ధరైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 6 రోజుల వరకు మ్యూజిక్! రియల్‌మీ 16 5G సంచలన ఫీచర్లు..!
  2. హెచ్‌పీ నుంచి బ్రదర్ వరకు.. హై-వాల్యూమ్ ప్రింటింగ్ కోసం బెస్ట్ ఛాయిస్ ఏది?
  3. ఆపిల్ నుంచి అదిరిపోయే 'ఫోల్డబుల్ ఐఫోన్'! సెప్టెంబర్‌లోనే గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం
  4. ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్! ఇక ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడుకోవచ్చు..!
  5. సిరి ఇక విశ్వరూపం! ఐఓఎస్ 27తో గూగుల్ జెమిని, క్లాడ్‌లను శాసించబోతున్న యాపిల్..!
  6. అంతరిక్షంలో అద్భుతం.. మన భూమి, సూర్యుడి గతాన్ని గుర్తుచేస్తున్న 'WISPIT 2' నక్షత్ర వ్యవస్థ!
  7. శామ్సంగ్ గెలాక్సీ A57 5G, A37 5G ధరలు వచ్చేశాయి.. రూ. 3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సందడి..!
  8. మెసేజ్ పంపడమే కాదు.. మాట్లాడొచ్చు కూడా! వాట్సాప్ ఫుల్ సపోర్ట్ ఇచ్చే లేటెస్ట్ వాచ్‌లు..!
  9. మార్చి ఎండింగ్ బ్లాక్ బస్టర్! ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న టాప్ సినిమాలు ఇవే..!
  10. ఫెయిల్డ్ స్టార్స్‌కి సెకండ్ ఛాన్స్! రెండు విఫల నక్షత్రాలు కలిసి ఒకే వెలుగుగా మారబోతున్నాయా..?
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »