Photo Credit: Oppo
Oppo Find N5 పెద్ద 6.62-అంగుళాల AMOLED కవర్ స్క్రీన్‌తో అమర్చబడింది
తాజా బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా Oppo Find N5ను చైనీస్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు (OEM) గ్లోబల్ మార్కెట్‌లోకి లాంఛ్ చేసింది. ఇది 2023లో విడుదలైన Find N3కి కొనసాగింపుగా వస్తోంది. ఈ మొబైల్ Qualcomm ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. ఆన్-డివైస్, క్లౌడ్-ఆధారిత కృత్రిమ మేధస్సు (AI) కెపాసిటిని కలిగి ఉంటుంది. దీని ఫ్లెక్సియన్ హింజ్ డిజైన్ గతంలో వచ్చిన మోడల్స్ కంటే 36 శాతం ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. అందుకు కారణం కంపెనీ వింగ్ ప్లేట్ బిల్డ్ కోసం గ్రేడ్ 5 టైటానియం మిక్సింగ్‌ను కలిగి ఉంది.
Oppo Find N5ను ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఇది మడతపెట్టినప్పుడు 8.93mm పరిమాణంతో 229 గ్రాముల బరువు ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15పై రన్ అవుతుంది. ఇది 412ppi పిక్సెల్ density, 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 8.12-అంగుళాల 2K (2,480 x 2,248 పిక్సెల్‌లు) LTPO AMOLED స్క్రీన్ ఉంటుంది. 240Hz వరకు లోపలి స్క్రీన్ టచ్ రెస్పాన్స్ రేటును కలిగి ఉంటుంది. ఇది TÜV రీన్‌ల్యాండ్ మినిమైజ్డ్ క్రీజ్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. డిస్‌ప్లే అల్ట్రా-థిన్ గ్లాస్ (UTG) ప్రొటక్షన్‌తో వస్తుంది.
Oppo Find N5 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడి ఉంటుంది. రెండవ తరం 3nm ఆర్కిటెక్చర్, హెక్సాగాన్ NPUతో, ఈ చిప్ AI పనితీరులో 45 శాతం మెరుగుదలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది అడ్రినో 830 GPUతో అటాచ్ చేయబడింది. హ్యాండ్‌సెట్ AI సర్చ్ లాంటి అనేకరకాల AI ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్-స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, ఎక్స్‌పలనేషన్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది.
Oppo Find N5లో హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50-మెగాపిక్సెల్ f/1.8 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), 50-మెగాపిక్సెల్ f/2.7 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్, 116-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV), 50-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం లోపలి, బయటి డిస్‌ప్లేలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
Oppo Find N5లోని కనెక్టివిటీ ఆప్షన్స్‌లో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, GPS/ A-GPS, NFC, Beidou, GPS, GLONASS, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. అలాగే, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లును కూడా అందించారు. ఇది 5,600mAh డ్యూయల్-సెల్ బ్యాటరీతో వస్తుంది. అలగే, 80W SUPERVOOC (వైర్డ్), 50W AIRVOOC (వైర్‌లెస్) ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన