ఈ సేల్‌లో ఐఫోన్ 16కి సంబంధించిన ప్రత్యేక ఆఫర్ ధరను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో బిగ్ బిలియన్ డేస్ పేజీని అప్‌డేట్ చేస్తూ, ఐఫోన్ 16ని రూ. 51,999 ప్రత్యేక ధరకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. “What you see is what you pay” మరియు “No T&C Applied” అనే ట్యాగ్‌లైన్‌లను కూడా మైక్రోసైట్‌లో ప్రస్తావించారు.
Photo Credit: Apple
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16 పై రూ. 23,000 వరకు తగ్గింపు లభిస్తుంది (చిత్రంలో)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 ఈ నెల సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ భారీ సేల్ ఈవెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) డివైసులు, వాషింగ్ మిషన్‌లు, స్మార్ట్ హోమ్ అప్లయెన్సెస్, ఫ్రిజ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. అదనంగా కస్టమర్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను కూడా పొందవచ్చు.ఈ సేల్‌లో ఐఫోన్ 16కి సంబంధించిన ప్రత్యేక ఆఫర్ ధరను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లో బిగ్ బిలియన్ డేస్ పేజీని అప్‌డేట్ఈ చేస్తూ, ఐఫోన్ 16ని రూ. 51,999 ప్రత్యేక ధరకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. “What you see is what you pay” మరియు “No T&C Applied” అనే ట్యాగ్‌లైన్‌లను కూడా మైక్రోసైట్‌లో ప్రస్తావించారు. అంటే, చూపిస్తున్న ధరకు ఎలాంటి అదనపు షరతులు లేకుండా ఫోన్ లభించనుంది. అదనంగా, బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఆఫర్లు వాడితే మరింత తగ్గింపు లభిస్తుంది.
ప్రస్తుతం 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ఐఫోన్ 16 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,900కి లిస్టింగ్‌లో ఉంది. అంటే ఈ సేల్ సమయంలో కస్టమర్లకు రూ. 23,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు ఉపయోగించే వారికి అదనంగా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు. ప్రస్తుతం ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 69,900గా ఉంది. ఐఫోన్ 16 మొదటిసారి భారత్‌లో విడుదలైనప్పుడు 128GB వేరియంట్ ధర రూ. 79,900గా ఉండగా, 256GB మరియు 512GB వేరియంట్‌లు వరుసగా రూ. 89,900 మరియు రూ. 1,09,900లకు అందుబాటులో ఉన్నాయి.
ఈసారి ఫ్లిప్‌కార్ట్, ఐఫోన్ 14ను రూ. 40,000 లోపు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను రూ. 90,000 లోపు, ఐఫోన్ 16 ప్రోను రూ. 70,000 లోపు కొనుగోలు చేసే అవకాశం కూడా కస్టమర్లకు ఇవ్వనుంది. ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు కూడా కలుపబడ్డాయి.
ఎలక్ట్రానిక్ డివైస్లు, మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలని చూస్తున్నా కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 బాగా బెనిఫిట్ అవుతుంది. తక్కువ ధరలకే మంచి ప్రోడక్ట్లను పొందే అవకాశం లభించనుంది.
ప్రకటన
ప్రకటన