అదనంగా, అమెరికాలోని ఆండ్రాయిడ్ యూజర్లకు Google Photos యాప్‌లో వ్యక్తిగత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే Google Maps లో కొత్త Power Saving Modeను జోడించారు. ఇది సులభమైన ఇంటర్‌ఫేస్‌ను చూపించి బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది.
Photo Credit: Google
నవంబర్ 2025 కి సంబంధించిన పిక్సెల్ డ్రాప్ గత వారం లీక్ అయింది.
గూగుల్ నవంబర్ 2025కి సంబంధించిన తాజా పిక్సెల్ ఫీచర్ డ్రాప్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్ ద్వారా పిక్సెల్ ఫోన్లకు మరెన్నో ఆసక్తికరమైన కొత్త ఫీచర్లు వచ్చాయి. ముఖ్యంగా, గూగుల్ మెసేజెస్ యాప్‌లో కొత్త Remix ఫీచర్‌ను జోడించింది. దీని సహాయంతో ఏ ఫోటోనైనా Nano Banana అనే ఇమేజ్ ఎడిటింగ్ మోడల్‌తో స్టైలిష్‌గా మార్చుకోవచ్చు. సాదారణ ఫోటోలను 3D యానిమేషన్, యానిమే, స్కెచ్ వంటి ఆర్ట్ స్టైల్స్‌గా మార్చే ఈ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకోనుంది. ఫోటో ఎడిటింగ్ ఇప్పుడు మరింత సులభంగా మారింది. యూజర్లు మెసేజెస్ యాప్‌లో నేరుగా ఫోటోలను రీమిక్స్ చేసి పంపవచ్చు, అలాగే రిసీవర్ ఏ ఫోన్ వాడుతున్నా ఆ ఫోటోను చూడగలరు. గూగుల్ చెబుతున్నదేమిటంటే, గూగుల్ మెసేజెస్‌లో ఇద్దరు యూజర్లు మాట్లాడుతున్నప్పుడు ఒకే ఫోటోను ఇద్దరూ వరుసగా రీమిక్స్ చేసుకోవచ్చు, అదీ యాప్ నుండి బయటకు వెళ్లకుండా!
ఈ అప్‌డేట్ తర్వాత పిక్సెల్ ఫోన్లలో AI ఆధారిత నోటిఫికేషన్ సమ్మరీలు కూడా అందుబాటులోకి వస్తాయి. పెద్ద చాట్ థ్రెడ్స్ లేదా గ్రూప్ మెసేజ్‌ల సారాంశాన్ని నోటిఫికేషన్ షేడ్లో చూపించడం ద్వారా యూజర్లు ముఖ్యమైన విషయాలు త్వరగా తెలుసుకోగలరు. అంతేకాక, డిసెంబర్ 2025 నుంచి తక్కువ ప్రాధాన్యత కలిగిన నోటిఫికేషన్‌లను గూగుల్ ఆటోమేటిక్‌గా సైలెంట్ చేస్తుంది.
అమెరికాలోని పిక్సెల్ 6 మరియు తదుపరి మోడళ్లకు కొత్త Scam Detection ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇది పాపులర్ యాప్స్‌లోని చాట్ నోటిఫికేషన్‌లను స్కాన్ చేసి, అనుమానాస్పదమైన సందేశాలపై “Likely Scam” హెచ్చరికను చూపుతుంది. ఇక VIP విడ్జెట్‌కు కూడా అప్‌డేట్ వచ్చింది. ఇప్పుడు ఇది కొత్త Crisis Badge సిస్టమ్‌తో వస్తుంది. దీని ద్వారా వరదలు వంటి అత్యవసర పరిస్థితులపై సమీప ప్రాంతానికి సంబంధించిన అలర్ట్‌లను యూజర్‌కు తెలియజేస్తుంది.
అదనంగా, అమెరికాలోని ఆండ్రాయిడ్ యూజర్లకు Google Photos యాప్‌లో వ్యక్తిగత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే Google Maps లో కొత్త Power Saving Modeను జోడించారు. ఇది సులభమైన ఇంటర్‌ఫేస్‌ను చూపించి బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇక పిక్సెల్ వినియోగదారులు తమ ఫోన్‌ను “Wicked: For Good” అనే సినిమా థీమ్ ఆధారంగా రూపొందించిన కొత్త థీమ్ ప్యాక్‌లతో కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఇంకా రెండు పిక్సెల్ ప్రత్యేక ఫీచర్లు Scam Detection మరియు Call Notes ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించబడ్డాయి. Scam Detection ఫీచర్ ఆస్ట్రేలియా, కెనడా, భారత్, ఐర్లాండ్, మరియు యూకే దేశాల్లో Pixel 9 మరియు అంతకంటే కొత్త మోడళ్లకు అందుబాటులో ఉంటుంది. ఇది మోసగాళ్లు మాట్లాడే విధానాలను గుర్తించి యూజర్‌కు ముందస్తుగా హెచ్చరిక ఇస్తుంది.
అదేవిధంగా, Call Notes ఫీచర్ కాల్‌లను రికార్డ్ చేయడం, నోట్స్ తీసుకోవడం, అలాగే వాటి ట్రాన్స్క్రిప్ట్ మరియు సమ్మరీలను ఆటోమేటిక్‌గా సృష్టించడం వంటి పనులు చేస్తుంది. ఈ సౌకర్యం ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, జపాన్, మరియు యూకేలో అందుబాటులోకి వస్తుంది. మొత్తం మీద, గూగుల్ నవంబర్ 2025 పిక్సెల్ డ్రాప్ అప్‌డేట్‌తో యూజర్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా, సెక్యూర్‌గా మరియు సృజనాత్మకంగా మార్చింది.
ప్రకటన
ప్రకటన