స్పైవేర్ 2024, 2025 ప్రారంభంలో ఎక్కువగా మధ్యప్రాచ్య ప్రాంతాలలో ఉపయోగించబడిందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రభావితమైన Samsung మోడల్స్‌లో Galaxy S22, Galaxy S23, Galaxy S24 వంటి One UI 5 నుండి One UI 7 (Android 13 నుండి Android 15) వంటివి ఉన్నాయి. అంతే కాకుండా Galaxy Z Fold 4, Z Flip 4 వంటి ఫోల్డబుల్ మోడల్‌లు కూడా ఉన్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్ వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని హెచ్చరిక.
స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ కూడా సైబర్ అటాక్‌ల గురించి ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా సామ్ సంగ్ గెలాక్సీ యూజర్లు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. Samsung Galaxy ఫోన్‌ని ఉపయోగిస్తుంటే మీ వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడేసే కొత్త భద్రతా ముప్పు గురించి మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. పరిశోధకులు LANDFALL అనే కొత్త స్పైవేర్‌ను కనుగొన్నారు. ఇది సిస్టమ్‌లోని దాచిన లోపాన్ని ఉపయోగించి రహస్యంగా గెలాక్సీ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ యూనిట్ 42 విభాగం ప్రకారం ఈ కొత్త స్పైవేర్ జీరో-డే వల్నరబులిటీని ఉపయోగించుకుంది. ఈ లోపం Samsung Android ఇమేజ్ ప్రాసెసింగ్ లైబ్రరీలో బయటపడింది.
దాడి పద్ధతి ఆశ్చర్యకరంగా సరళమైనది కానీ ప్రభావవంతమైనది. హ్యాకర్లు WhatsApp వంటి ప్రసిద్ధ సందేశ యాప్‌ల ద్వారా హానికరమైన ఇమేజ్ ఫైల్‌లను (DNG ఫార్మాట్‌లో) పంపితే ఫోన్‌లోని డేటా మొత్తం గల్లంతు అవుతుంది. గెలాక్సీ ఫోన్ ఈ చిత్రాలని తెరవడానికి లేదా ప్రాసెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వినియోగదారు ఎటువంటి చర్య లేకుండా స్పైవేర్ ఆటో మేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది.
ఆ స్పై వేర్ లోపలికి ప్రవేశించిన తర్వాత LANDFALL ఫోటోలు, కాంటాక్ట్‌లు, కాల్ లాగ్‌లు, మైక్రోఫోన్ రికార్డింగ్‌లు, లొకేషన్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరించగలదు. ఇది తనను తాను దాచుకోవడానికి సాధనాలను కూడా కలిగి ఉంది. దీనివల్ల గుర్తించడం లేదా తొలగించడం కష్టమవుతుంది.
స్పైవేర్ 2024, 2025 ప్రారంభంలో ఎక్కువగా మధ్యప్రాచ్య ప్రాంతాలలో ఉపయోగించబడిందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రభావితమైన Samsung పరికరాలలో Galaxy S22, Galaxy S23, Galaxy S24 వంటి One UI 5 నుండి One UI 7 (Android 13 నుండి Android 15) వరకు నడుస్తున్నవి. ఇందులో Galaxy Z Fold 4, Z Flip 4 వంటి ఫోల్డబుల్ మోడల్‌లు కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం సామ్‌సంగ్ ఏప్రిల్ 2025లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. ఈ దాడి ఏ స్మార్ట్‌ఫోన్ కూడా సైబర్ బెదిరింపుల నుండి పూర్తిగా సురక్షితం కాదని రుజువు చేస్తుంది. అప్రమత్తంగా ఉండటం, మీ ఫోన్‌ను అప్‌డేట్‌గా ఉంచడం మీ డేటాను రక్షించుకోవడానికి ఉత్తమ మార్గాలు.
ప్రకటన
ప్రకటన