Photo Credit: Realme
Realme GT 7 ఆరు గంటల పాటు స్థిరమైన 120FPS BGMI గేమ్‌ప్లేకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ Realme ఇండియన్ మార్కెట్లో తన బ్రాండ్లతో సెపరేట్ ఫాలోయింగ్ పెంచుకుంది. Realme మొబైల్స్ లాంచ్ అయినప్పటి నుండి కూడా ప్రతిరోజు క్రేజ్ పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడ తగ్గలేదు. ఆ క్రేజ్ ను నిలబెట్టుకునే విధంగా Realme ఇప్పుడు తన కొత్త మొబైల్ హ్యాండ్సెట్ Realme GT7ను త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.మే 27వ తారీఖున గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియాలో ఈ ఫోన్ లాంచ్ అవుతున్నట్లు ప్రెస్ రిలీజ్ లో ప్రకటించింది. ఈ ఫోన్లో అత్యాధునిక స్పెసిఫికేషన్స్ ఇంక్లూడ్ చేసినట్లు ప్రకటించింది. అందులో భాగంగా అత్యధిక బ్యాటరీ బ్యాకప్ అందించే విధంగా 120W వైల్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో 7000mAH బ్యాటరీని అందిస్తోంది. తాజాగా డిస్ప్లే ఫీచర్స్ తో పాటు, చిప్సెట్ డీటెయిల్స్ కూడా ప్రకటించింది. ఇవి ఈ ఫోన్ పైన మరింత క్రేజ్ పెంచేసాయి. దీనితోపాటు Realme GT 7T వేరియంట్ ని కూడా తీసుకువస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో Realme GT7 లాంచ్ అయింది. ఈ లాంచ్ అయిన మోడల్ లో మీడియా టెక్ డైమన్సిటీ 9400+ SoC ప్రాసెసర్ చిప్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7200mAH బ్యాటరీ బ్యాకప్ అందించింది.
Realme GT7 మొబైల్ మీడియా టెక్ డైమెన్సిటీ 9400e చిప్ సెట్ తో వస్తున్నట్లు కంపెనీ ఒక ప్రెస్ రిలీజ్ లో తెలియజేసింది. ఈ చిప్ సెట్లో X4 ప్రైమ్ కోర్ యూస్ చేసినట్లు ప్రకటించింది. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC తయారుచేసిన ప్రాసెస్ నోడ్ పైనే తయారైనట్లు క్లైమ్ చేసింది. అలాగే ఈ Realme GT7 ఫోన్ AnTUTU స్కోర్ 2.45 మిలియన్స్ కి పైగా సాధించినట్లు Realme ప్రకటించింది.
అంతే కాకుండా Realme తన GT7 మొబైల్ GT బూస్ట్ మోడ్ తో పాటు 120FPSతో 6 గంటలు పాటు స్టేబుల్గా BGMI గేమ్ ప్లే సపోర్ట్ కూడా ఇస్తున్నట్లు క్లైమ్ చేసింది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ ఆలొకేషన్ విషయంలో మిల్లీసెకండ్ స్థాయిలో ప్రిసిషన్ కలిగి ఉందని, అలాగే తక్కువ పవర్ కన్సంప్షన్ తో పాటు థర్మల్ మేనేజ్మెంట్తో స్మూత్ గేమ్ ప్లేను అందించగలదని తెలియజేసింది.
ఈ Realme GT7 ఫోన్ డిస్ప్లే 6000నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుందని అఫీషియల్ ప్రోడక్ట్ పేజీలో మెన్షన్ చేసింది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన చైనీస్ వేరియెంట్లో6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్తో 6.78 ఇంచ్ 144Hz ఫుల్ HD + OLED డిస్ప్లేను ఎక్విప్ చేసింది. ఈ Realme GT7 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 10 పర్సెంట్ సిలికాన్ యానోడ్ 7000mAH బ్యాటరీ బ్యాకప్ తో వస్తోంది.
దీంతో 15 నిమిషాల్లో 50% బ్యాటరీ ఛార్జింగ్ చేయవచ్చు అని క్లైమ్ చేస్తున్నారు. అంతేకాకుండా 7.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉంది.
ఈ ఫోన్లో ప్రత్యేకంగా ఉన్న బ్యాటరీ ఫోకస్డ్ చిప్ వల్ల 95% ఓవర్ హీటింగ్ అవ్వకుండా చూస్తూ, బ్యాటరీ లైఫ్ ఎక్స్పెన్సివ్ మూడింతలు పెంచుతుందని చెబుతోంది. అలాగే ఈ Realme GT7 ఐస్సెన్స్ బ్లాక్, ఐస్సెన్స్ బ్లూ షేడ్స్ లో వస్తోంది. ఇది థర్మల్ మేనేజ్మెంట్ కొరకు ఐస్సెన్స్ గ్రాఫేన్ టెక్నాలజీనీ సపోర్ట్ చేస్తుంది. దీనితోపాటే వస్తున్న Realme GT 7T వేరియంట్ మాత్రం బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్స్లో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఇండియన్ మొబైల్ మార్కెట్లో Realme మరొకసారి గేమ్ చేంజర్ చేంజ్ అవుతుంది ఏమో చూడాలి.
ప్రకటన
ప్రకటన