Photo Credit: Huawei
ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్-మార్కెట్ ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Huawei Mate XT అల్టిమేట్ డిజైన్‌ను కంపెనీ సెప్టెంబరులో లాంచ్ చేసింది. అయితే, ఇది ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మోడల్ Z-స్టైల్‌లో ఫోల్డ్ చేయగల మూడు స్క్రీన్‌లతో వస్తుంది. ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబర్ నిర్వహించిన స్మార్ట్‌ఫోన్ మన్నిక పరీక్షతో స్టాండర్డ్ స్మార్ట్‌ఫోన్‌లు లేదా సాధారణ ఫోల్డబుల్ మోడల్‌లతో పోలిస్తే దీని డిస్‌ప్లేలు స్క్రాచింగ్‌కు ఎక్కువ అవకాశం ఉందని వెల్లడైంది. మరెందుకు ఆలస్యం.. Huawei Mate XT అల్టిమేట్ డిజైన్ ఈ పరీక్షల్లో ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో చూసేద్దామా?!
Huawei యొక్క ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మన్నిక పరీక్షను పరిశోధించిన యూట్యూబర్ జాక్ నెల్సన్ జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్‌తో ప్రసిద్ధి చెందారు. ఈ మోడల్ అన్‌బాక్సింగ్‌ను నిర్వహించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా CNY 19,999 (దాదాపు రూ. 2,36,700) ప్రారంభ ధరతో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. Huawei Mate XT అల్టిమేట్ డిజైన్ కార్బన్ ఫైబర్ కేస్, రెండు USB కలిగిన 66W పవర్ అడాప్టర్‌తో వస్తుంది. టైప్-సి కేబుల్స్, 88W-రేటెడ్ కార్ ఛార్జర్, జత Huawei FreeBuds 5ని అందించారు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన ప్రపంచంలోనే అత్యంత సన్నని బ్యాటరీ ఇదేనని వెల్లడించింది.
ఇక మన్నిక పరంగా చూస్తే.. Huawei Mate XT అల్టిమేట్ డిజైన్ Mohs టెక్ట్ లెవల్ టూలో గీతలు కనిపించాయి. రేజర్ బ్లేడ్‌తో లోతైన పరీక్షలో కూడా ఇవి బహిర్ఘతం అయ్యాయి. ఫోల్డబుల్ సాఫ్ట్-ప్లాస్టిక్ స్క్రీన్ లామినేటెడ్ స్ట్రక్చర్ కారణంగా ఇలా జరిగే అవకాశం ఉన్నప్పటికీ, పరీక్షలో వేలిగోళ్లతో కూడా సులభంగా గీసుకుపోయే అవకాశం ఉందని వెల్లడించింది. స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత వేలుగోళ్ల వల్ల పడిన గీతలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ రేజర్ బ్లేడ్ వల్ల ఏర్పడే గీతలు Samsung Galaxy Z Fold 6 వంటి ఇతర ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల మన్నిక కంటే భిన్నమైనవి కానప్పటికీ, అదే స్థాయిలో గీతలు పడ్డాయి. ఇక్కడ Mate XT అల్టిమేట్ డిజైన్‌లో వేలుగోళ్ల వల్ల కలిగే గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్ ఆఫ్ చేయబడిన తర్వాత వీటి తీవ్రత ఎక్కువగా గుర్తించవచ్చు.
ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌గా హింజ్ మెకానిజం ఈ Mate XT అల్టిమేట్ డిజైన్‌లో మరొక నెగిటివ్ పాయింట్‌గా చెప్పొచ్చు. స్క్రీన్‌లను తప్పుగా మడతపెట్టినప్పుడు హెచ్చరిక వస్తుంది. ఇక్కడ ఎలాంటి హెచ్చరికా లేకుండా సులువుగా యూట్యూబర్ స్మార్ట్‌ఫోన్‌ను మడత పెట్టడం జరిగింది. దీని ద్వారా ఇంతటి ఖరీదైన ఫోన్‌ను వినియోగించే సమయంలో మరింత శ్రద్ధ అవసరమని చెప్పకనే చెప్పొచ్చు. అంతేకాదు, స్క్రీన్ మడతపెట్టే సమయంలో దీని అంచులలో ఒకటి పూర్తిగా ముడుచుకున్నట్లు కనిపించకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు.
ప్రకటన
ప్రకటన