Photo Credit: Apple
బేస్ 128GB ఐఫోన్ 16 భారతదేశంలో రూ. 79,900 ధరతో ఆవిష్కరించబడింది
ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఫ్లిఫ్‌కార్ట్ గోట్ సేల్ 2025లో ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. భారత్‌లో ఈ గ్యాడ్జెట్ రూ.79,900(128GB) వద్ద లాంచ్ అయింది. ఇప్పుడు దీనిని కేవలం రూ.69,999 కే దక్కించుకోవచ్చు. అంటే దాదాపుగా ఈ డివైస్‌పై రూ.10 వేల తగ్గింపు లభిస్తోంది. ఇదే ధరకు ఐఫోన్ 16ను అమెజాన్‌లో కూడా పొందవచ్చు. అయితే ప్రస్తుత ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంది. ఐఫోన్ 16 స్టోరేజ్ 128 జీబీ వేరియంట్‌తో పాటు 256 జీబీ, 512 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.భారత్‌లో ఐఫోన్ 16 ధర, డిస్కౌంట్ ఆఫర్లు,ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఐఫోన్ 16 128 జీబీ వేరియంట్ రూ.69,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 అసలు ధర రూ.79,900 కాగా దీనిపై రూ.9,901 డిస్కౌంట్ లభిస్తోంది. 256జీబీ వేరియంట్ అసలు ధర రూ.89,900 ఉండగా ప్రస్తుతం రూ. 81,999 కే లభిస్తోంది. 512జీబీ వేరియంట్ వాస్తవ ధర రూ. 1,09,900 ఉండగా రూ.99,999 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
ఫ్లిఫ్‌కార్ట్ గోట్ సేల్ 2025 జులై 12న ప్రారంభమై ఇంకా కొనసాగుతోంది. ఈ సేల్ జులై 17 వరకు కొనసాగుతుందని ఫ్లిఫ్‌కార్ట్ పేర్కొంది. ఐఫోన్ 16పై ఈ ఆఫర్లు గోట్ సేల్ ముగింపు వరకు కొనసాగుతాయి. ఈ డిస్కౌంట్‌తో పాటు దీనికి అదనంగా బ్యాంకు కార్డులపై రూ.3,000 తగ్గింపు లభిస్తోంది.
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ రూ. 73,500 వద్ద అందుబాటులో ఉంది. ఇది దాని లాంచ్ ధర కంటే రూ. 6,400 తక్కువ. 256GB వేరియంట్ ధర రూ.83,500 ఉండగా.. 512GB వేరియంట్‌ను రూ.99,900కే కోనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్‌పై లభిస్తున్న డిస్కౌంట్‌తో పాటు కొనుగోలుదారులు అదనంగా బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ల ద్వారా మరింత తక్కువ ధరకే ఐఫోన్ 16ను దక్కించుకోవచ్చు.
ఐఫోన్ 16 స్మార్ట్ ఫోన్ ప్రీమియం కలర్ ఆఫ్షన్స్‌లో అందుబాటులో ఉంది. బ్లాక్, పింక్, టీల్, అల్ట్రామెరైన్‌తో పాటు తెలుపు రంగుల్లో అమ్మకానికి ఉంది.
ఈ ఐఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్ ఉంటుంది. అదేవిధంగా 2556 x 1179 పిక్సల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. దీంతో పాటు 2,000 nits బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇది శక్తివంతమైన A18 చిప్‌సెట్‌పై iOS 18పై పనిచేస్తుంది. వాటర్, స్ప్లాషెస్, డస్ట్ ప్రొటెక్షన్‌తో ఈ ఐఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. ఫొటోలు తీసేందుకు, వీడియోలను రికార్డ్ చేసేందుకు ఈ ఫోన్ త్వరితగతిన కెమెరా యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా ఉంది. ఇందులో 2x టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీల కోసం ƒ/1.9 ఎపర్చర్‌తో 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
వీటితో పాటు ఆడియో మిక్స్ వంటి ఆడియో ఎడిటింగ్ టూల్స్, ఫోన్ ఫొటో, వీడియో క్యాప్చర్ సపోర్ట్, క్యాప్చర్ తర్వాత ఆడియో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మెషిన్ లెర్నింగ్ ద్వారా నాయిస్‌ను తగ్గించగలదు. ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. వీడియోగ్రఫీకి ఇది ఒక గ్రేట్ ఆప్షన్. ఈ ఐఫోన్ పనితీరును మెరుగుపరచడానికి యాపిల్ ఇంటెలిజన్స్ సెకండ్ జనరేషన్ 3-నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఐఫోన్ 16 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, NFC, USB టైఫ్-C కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన