ఈ హోమ్ డెమో క్యాంపెయిన్ 20 నుండి 24 వరకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు కంపెనీ ఇచ్చిన ఫారమ్‌ను పూరించి నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఇన్వైట్-ఓన్లీ అనుభవం, కావున కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేసి, ఇంటికి వచ్చి ఫోన్‌ను హ్యాండ్‌సాన్ గా చూపించనున్నారు.
Photo Credit: Lava Mobiles
రాబోయే లావా స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 8350 SoC తో వస్తుందని నిర్ధారించబడింది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన గుర్తింపుతో ముందుకు సాగుతున్న Lava, సోమవారం ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. త్వరలో లాంచ్ కానున్న తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Lava Agni 4 ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ముందుగానే పరీక్షించే అవకాశం ఇవ్వడానికి Demo@Home అనే ప్రత్యేక ఇనీషియేటివ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, Lava కంపెనీకి చెందిన ఇంజినీర్ నేరుగా వినియోగదారుల ఇంటికే వచ్చి ఫోన్ డిజైన్, ఫీచర్లు, పనితీరును పూర్తిగా వివరించి చూపిస్తారు. నవంబర్ 20న భారత్‌లో విడుదల కానున్న అగ్ని 4 కోసం ఇది ఒక పెద్ద ప్లస్‌గా కనిపిస్తోంది. ఈ హోమ్ డెమో క్యాంపెయిన్ 20 నుండి 24 వరకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు కంపెనీ ఇచ్చిన ఫారమ్‌ను పూరించి నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఇన్వైట్-ఓన్లీ అనుభవం, కావున కొద్ది మందిని మాత్రమే ఎంపిక చేసి, ఇంటికి వచ్చి ఫోన్‌ను హ్యాండ్‌సాన్ గా చూపించనున్నారు. ముఖ్యంగా, ఈ డెమో తర్వాత ఫోన్ కొనాల్సిన తప్పనిసరి అవసరం లేదని లావా స్పష్టం చేసింది. ఇది పూర్తిగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం.
ప్రస్తుత సమాచారం మేరకు, Lava Agni 4 ధర భారత మార్కెట్లో రూ. 30,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. పనితీరులో ముఖ్యమైన MediaTek Dimensity 8350 చిప్‌సెట్ తో పాటు LPDDR5X RAM మరియు UFS 4.0 స్టోరేజ్ అందించనున్నట్లు సమాచారం.
కెమెరా విషయంలో, వెనుక భాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ లెన్స్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ వచ్చే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి.
కనెక్టివిటీ పరంగా USB 3.2, ఇన్‌ఫ్రారెడ్ (IR), Wi-Fi 6E వంటి ఆప్షన్లు లభించవచ్చు. అలాగే, 5,000mAh బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ చార్జింగ్ అందించనున్నట్లు ఊహిస్తున్నారు. ఈ కొత్త టెక్నిక్ తో Lava భారత మార్కెట్లో మరింత ఎక్కువ సేల్స్ చేసేందుకు ప్రయత్నం ప్రారంభించింది.
ప్రకటన
ప్రకటన