ఈ సంవత్సరం ప్రారంభంలో రిలీజ్ చేసిన F7 Pro, F7 Ultra లకు ఎక్స్‌టెండెడ్ వర్షెన్స్‌గా POCO F8 Pro, POCO F8 Ultra స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ పరిచయం చేస్తుంది.
నవంబర్ 26న POCO F8 Pro మరియు F8 అల్ట్రా గ్లోబల్ లాంచ్ సెట్ చేయబడింది
పోకో నుంచి సరికొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. నవంబర్ 26న ఇండోనేషియాలో జరగబోయే కార్యక్రమంలో POCO F8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్ల కోసం విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టబడిన F7 Pro, F7 Ultra లకు అప్డేటెడ్ వర్షెన్స్‌గా POCO F8 Pro, POCO F8 Ultra స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ పరిచయం చేస్తుంది. పైగా రెండు మోడల్స్‌లకు సంబంధించిన ఫోటోల్ని రిలీజ్ చేసింది. F8 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని కంపెనీ ధృవీకరించింది. కంపెనీ AnTuTu బెంచ్‌మార్క్‌లో 3,944,934 పాయింట్లను క్లెయిమ్ చేసింది. మునుపటి నివేదికల ప్రకారం POCO F8 Pro అనేది REDMI K90 రీబ్రాండెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. ఇది Snapdragon 8 Elite SoC తో ఉంటుంది. కానీ చిన్న 6210mAh బ్యాటరీతో ఉంటుంది. POCO F8 Ultra అనేది REDMI K90 Pro Max గా రీబ్రాండెడ్ చేయబడి 6500mAh బ్యాటరీతో రీబ్రాండెడ్ చేయబడుతుందని భావిస్తున్నారు.
టీజర్ F8 Ultraను నలుపు, కొత్త నీలం రంగులో చూపిస్తుంది. ఇది బ్లూ జీన్స్‌ను పోలి ఉండే బ్యాక్ కవర్‌తో ఉంటుంది. ఇది రెండు-టోన్ వార్ప్, వెఫ్ట్ ప్రాసెస్, మూడవ తరం నానో-లెదర్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించబడింది. F8 Pro నలుపు, వెండి, నీలం రంగులలో వస్తుంది. వీటిలో సౌండ్ బై బోస్ ఉంటుంది . F8 అల్ట్రా 2.1 ఛానల్ ఆడియో కోసం వెనుక స్పీకర్‌ను కలిగి ఉంటుంది.
పోకో ఎఫ్8 ప్రో మోడల్ 6.59-అంగుళాల (2510 x 1156 పిక్సెల్స్) 2K 12-బిట్ AMOLED 20:9 డిస్ ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2560Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, DC డిమ్మింగ్, 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 5,000,000:1 (కనిష్ట) కాంట్రాస్ట్ రేషియో, HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్‌తో రానుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్ అడ్రినో 830 GPUతో ఈ న్యూ మోడల్ మార్కెట్లోకి రానుంది.
ఈ మోడల్ ఫోన్ 256GB / 512GB UFS 4.0 స్టోరేజ్‌తో 12GB LPDDR5x RAM తో రానుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో + నానో)తో రానుంది. ఈ కొత్త మోడల్ Xiaomi HyperOS 3తో Android 16పై నడుస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 1/ 1.55″ లైట్ ఫ్యూజన్ 800 సెన్సార్‌తో 50MP వెనుక కెమెరా, f/1.88 అపర్చర్, OIS + EIS, LED ఫ్లాష్, 8MP 120° అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ f/2.2 అపెర్చర్‌తో, f/2.2 అపెర్చర్‌తో 50MP 2.5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8K వీడియో రికార్డింగ్, 20MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఫీచర్స్‌తో రానుంది.
సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వస్తే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ (IP68)తో రానుంది. USB టైప్-C ఆడియో, హై-రెస్ ఆడియో, స్టీరియో స్పీకర్లు, సౌండ్ బై బోస్ ట్యూనింగ్ 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7 802.11 ad, బ్లూటూత్ 5.4, బీడౌ: B1I + B1C+B2a|GPS: L1+L5|గెలీలియో: E1+E5a, గ్లోనాస్: G1|QZSS: L1+L5|NavlC: L5, USB టైప్-C, NFC
100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6210mAh (సాధారణ) బ్యాటరీ, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
POCO F8 అల్ట్రా రూమర్ స్పెసిఫికేషన్లు (అంచనా)
POCO F8 అల్ట్రా మోడల్ ఫోన్ 6.9-అంగుళాల (2608 x 1200 పిక్సెల్స్) 2K 12-బిట్ AMOLED 20:9 డిస్ ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2560Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, DC డిమ్మింగ్‌తో వస్తుంది. 3500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 5,000,000:1 (కనిష్ట) కాంట్రాస్ట్ రేషియో, HDR10+, డాల్బీ విజన్, DC డిమ్మింగ్‌తో రానుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 3nm మొబైల్ ప్లాట్‌ఫామ్ అడ్రినో 840 GPUతో ఈ మోడల్ వస్తుంది. ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12GB / 16GB LPDDR5x RAM విత్ 256GB / 512GB UFS 4.1ని సపోర్ట్ చేస్తుంది.
డ్యూయల్ సిమ్ (నానో + నానో)ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 విత్ Xiaomi HyperOS 3పై ఈ మోడల్ ఫోన్ నడుస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50MP వెనుక కెమెరా విత్ 1/ 1.31″ లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్, f/1.67 ఎపర్చరు, OIS + EIS, LED ఫ్లాష్, 50MP OV50M సెన్సార్‌తో 102° అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, f/2.4 అపెర్చర్, f/3.0 అపెర్చర్‌తో 50MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 30cm టెలి మాక్రో, OIS, 8K వీడియో రికార్డింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌కి మద్దతు ఇస్తుంది.
సెక్యురిటీ విషయానికి వస్తే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ (IP68)ని సపోర్ట్ చేస్తుంది USB టైప్-C ఆడియో, హై-రెస్ ఆడియో, 2.1ch స్పీకర్లు, సౌండ్ బై బోస్ ట్యూనింగ్5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7 802.11 ad, బ్లూటూత్ 5.4, బీడౌ: B1I + B1C+B2a|GPS: L1+L5|గెలీలియో: E1+E5a, గ్లోనాస్: G1|QZSS: L1+L5|NavlC: L5, USB టైప్-C 3.2 Gen 1, NFC 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో 6500mAh (సాధారణ) బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.
వచ్చే వారం ఫోన్లు అధికారికంగా విడుదల చేసినప్పుడు ధరకి సంబంధించిన విషయం తెలుస్తుంది. ఈ POCO F8 మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 SoC ద్వారా శక్తిని పొందుతుంది.
ప్రకటన
ప్రకటన