OnePlus India అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే OnePlus 15R కు ప్రత్యేక మైక్రోసైట్‌ను యాడ్ చేశారు. OnePlus 15 లానే “Power On. Limits Off” అనే ట్యాగ్‌లైన్‌ను ఇందులో ఉపయోగించారు. లాంచ్ తేదీని ఇంకా వెల్లడించకపోయినా, “Coming soon” అని స్టేటస్ చూపిస్తున్నారు.
Photo Credit: OnePlus
ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాగ్‌షిప్ OnePlus 15 లాంటి కెమెరా డెకోను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.
OnePlus త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టబోతోందని అధికారిక టీజ్ ద్వారా స్పష్టమైంది. ఇటీవల ప్రకటించిన OnePlus 15 తర్వాత, ఈ కొత్త మోడల్ OnePlus 15R పేరుతో 15 సిరీస్‌లో చేరనుందని తెలుస్తోంది. ఇది చైనాలో మాత్రమే లభించే OnePlus Ace 6 లేదా రాబోయే Ace 6T ఆధారంగా ఉండవచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. విడుదలైన చిత్రాల్లో ఈ ఫోన్ రెండు రంగుల్లో కనిపిస్తోంది, వెనుక భాగంలో చతురస్రాకార డెకోలో డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. OnePlus India అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే OnePlus 15R కు ప్రత్యేక మైక్రోసైట్‌ను యాడ్ చేశారు. OnePlus 15 లానే “Power On. Limits Off” అనే ట్యాగ్‌లైన్‌ను ఇందులో ఉపయోగించారు. లాంచ్ తేదీని ఇంకా వెల్లడించకపోయినా, “Coming soon” అని స్టేటస్ చూపిస్తున్నారు.
టీజ్ ఇమేజెస్ ఈ మోడల్ బ్లాక్, గ్రీన్ అనే రెండు రంగుల్లో కనిపిస్తుంది. వెనుక భాగంలో రెండు కెమెరాలు నిలువుగా అమర్చబడి, అవి చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో ఉంటాయి. ఇది OnePlus 15 డిజైన్‌కు దగ్గరగా అనిపిస్తోంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే..మునుపటి OnePlus 13Rలో ట్రిపుల్ కెమెరా ఉండగా, కొత్త 15Rలో మాత్రం డ్యూయల్ కెమెరా మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది.
పవర్ మరియు వాల్యూమ్ బటన్‌లు కుడి వైపున ఉండగా, ఎడమ వైపున వన్‌ప్లస్ ఇటీవల 13S మరియు 15 మోడళ్లలో పరిచయం చేసిన Plus Key ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ కొత్త కీని ఎనిమిది వరకు ఫంక్షన్ల కోసం కస్టమైజ్ చేయవచ్చు.
ముందుగా వచ్చిన రిపోర్టుల ప్రకారం, ఈ డివైస్ OnePlus Ace 6 కు రీబ్రాండ్ వెర్షన్‌గా భావించబడింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇది Ace 6T ఆధారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఫోన్‌లో 6.7-అంగుళాల OLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించని Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌తో వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు 16GB వరకు LPDDR5X Ultra RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి.
కెమెరా విభాగంలో, 50MP ప్రధాన కెమెరా (OISతో) మరియు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే, 8,000mAh భారీ బ్యాటరీని, అలాగే 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన