టీజర్ ప్రకారం, Lava Play Max వెనుక భాగంలో రెండు కెమెరాలతో కూడిన వెర్టికల్ అరేంజ్డ్ సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సర్ను ఉపయోగించే అవకాశం ఉంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ ఆకర్షణీయమైన డెకరేటివ్ డిజైన్ కనిపించడం వలన, అది గ్లో అవుతుందేమో అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.
Photo Credit: Lava
లావా ప్లే మాక్స్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటుందని టీజ్ చేయబడింది
భారత మార్కెట్‌లో తమ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరించడానికి లావా సిద్ధమవుతోంది. ఆగస్టులో MediaTek Dimensity 7300 చిప్‌సెట్ మరియు 64MP ప్రధాన కెమెరాతో Lava Play Ultra 5Gను విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు కంపెనీ Lava Play Max అనే కొత్త మోడల్‌కు టీజర్‌ను విడుదల చేసింది. అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ, సోషల్ ప్లాట్‌ఫారమ్ X ద్వారా దాని ధర శ్రేణి, కీలక ఫీచర్లు ముందుగానే బయటకు వచ్చాయి. కంపెనీ షేర్ చేసిన టీజర్‌లో ఫోన్ డిజైన్ కూడా కొంతవరకు కనిపించింది. టీజర్ ప్రకారం, Lava Play Max వెనుక భాగంలో రెండు కెమెరాలతో కూడిన వెర్టికల్ అరేంజ్డ్ సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సర్ను ఉపయోగించే అవకాశం ఉంది. కెమెరా మాడ్యూల్ చుట్టూ ఆకర్షణీయమైన డెకరేటివ్ డిజైన్ కనిపించడం వలన, అది గ్లో అవుతుందేమో అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.
ఫోన్ ఫ్రేమ్ విషయానికి వస్తే, టీజర్‌లో యాంటెన్నా లైన్స్ కనిపించకపోవడం వల్ల ఇది మెటల్ కాకుండా ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావొచ్చని సూచిస్తోంది. ఈ మోడల్ BIS లిస్టింగ్‌లో Lava Storm Gamer పేరుతో కనిపించింది. ఆయన షేర్ చేసిన పోస్టర్‌లో ఫోన్ బ్లాక్ మరియు వైట్ రంగుల్లో అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే, లావా ప్లే మ్యాక్స్ భారత మార్కెట్‌లో డిసెంబర్లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ధర విషయానికి వస్తే, ఈ మోడల్‌ను కంపెనీ రూ. 12,000 లోపులో పెట్టొచ్చని అంచనా. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Lava Play Ultra 5G మాత్రం రూ.14,999 మరియు రూ. 16,499 ధరలకు అందుబాటులో ఉంది.
లీక్ అయిన సమాచారాన్ని బట్టి చూస్తే, Lava Play Max కూడా అదే MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. 6GB మరియు 8GB RAM వేరియంట్లు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఉన్న డిస్ప్లే చూస్తే 6.72 అంగుళాల Full HD+ స్క్రీన్ తో వస్తుంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, Android 15 ఆపరేటింగ్ సిస్టమ్, UFS 3.1 స్టోరేజ్ వెర్షన్ తో వస్తుంది. ఇక కెమెరా చూస్తే....వెనుక భాగంలో 50MP AI ప్రధాన కెమెరాతో పాటు EIS సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలిక గేమింగ్ లేదా హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 Ultra Wallpaper Leak Hints at Possible Colour Options