Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది.

Moto G Power (2026)లో గత మోడల్‌లో ఉపయోగించిన MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌నే కొనసాగించారు. అలాగే బ్యాటరీ సామర్థ్యం కూడా దాదాపు అదే స్థాయిలో ఉంచారు.

Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది.

Photo Credit: Motorola

Moto G పవర్ (2026) ఈవినింగ్ బ్లూ మరియు ప్యూర్ కాష్మీర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ముఖ్యాంశాలు
  • MediaTek Dimensity 6300 ప్రాసెసర్
  • 6.8 అంగుళాల 120Hz డిస్‌ప్లే, Gorilla Glass 7i రక్షణ
  • 5,200mAh బ్యాటరీ, 30W వైర్డ్ & 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ప్రకటన

మోటరోలా తన ప్రముఖ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో కొత్త మోడల్‌గా Moto G Power (2026)ను మంగళవారం కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో అధికారికంగా విడుదల చేసింది. ఇది గత ఏడాది వచ్చిన Moto G Power (2025)కి కంటిన్యూషన్గా మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఈ కొత్త వెర్షన్‌లో పూర్తిగా కొత్త మార్పులు కాకుండా, చిన్న చిన్న మెరుగుదలలతోనే మోటరోలా ముందుకు వచ్చింది. ముఖ్యంగా ధరను కొంత పెంచినప్పటికీ, హార్డ్‌వేర్ పరంగా పెద్ద అప్‌గ్రేడ్‌లు లేవు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. Moto G Power (2026)లో గత మోడల్‌లో ఉపయోగించిన MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌నే కొనసాగించారు. అలాగే బ్యాటరీ సామర్థ్యం కూడా దాదాపు అదే స్థాయిలో ఉంచారు. అయితే ఈ ఏడాది మోడల్‌లో కొన్ని కీలకమైన చిన్న మెరుగుదలలు ఉన్నాయి. కొత్త కలర్ ఆప్షన్లు, ముందు కెమెరాకు అప్‌గ్రేడ్, అలాగే డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ను మెరుగుపరచడం వంటి మార్పులు ఇందులో కనిపిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం కెనడా మరియు అమెరికా మార్కెట్లకు మాత్రమే ప్రకటించారు.

Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.27,100కి సమానం. కెనడాలో ఈ ఫోన్ ధర CAD 449.99, అంటే సుమారు రూ.29,550. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజ్ ఉంటుంది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఈవినింగ్ బ్లూ, ప్యూర్ క్యాష్మేర్ అనే రెండు కొత్త రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అమెరికా, కెనడా రెండింటిలోనూ ఇది జనవరి 8 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Moto G Power (2026)లో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ LCD డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 2388 × 1080 పిక్సెల్స్ కాగా, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, హై బ్రైట్‌నెస్ మోడ్ ద్వారా డిస్‌ప్లే గరిష్టంగా 1,000 నిట్స్ బ్రైట్‌నెస్ వరకు వెళ్లగలదు. డిస్‌ప్లే రక్షణ కోసం ఈసారి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను ఉపయోగించారు. ఆడియో పరంగా చూస్తే, Dolby Atmos సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు ఇందులో అందించారు.

ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్ను ఉపయోగించారు. దీనితో పాటు 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంటుంది. అవసరమైతే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Moto G Power (2026) Android 16తోనే బాక్స్ నుంచి బయటకు వస్తుంది.

ఫోటోగ్రఫీ విభాగంలో ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో) మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. కెమెరాలో ఆటో నైట్ విజన్, పొట్రయిట్ మోడ్, అయ్యో స్మైల్ కాప్చర్, షాట్ ఆప్టిమైజేషన్ వంటి AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి. Moto G Power (2026)లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది 30W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్తో పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, NFC, FM రేడియో, అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  2. Moto G Power (2026) అమెరికాలో $299.99 ధరతో విడుదలైంది.
  3. సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది.
  4. స్ట్రాటజీతో రేట్లు పెంచేసిన సామ్ సంగ్.. ఇక నెక్ట్స్ ఐఫోన్ వంతు
  5. వీటిలో ఇప్పటికే 3,500 పోస్టులు భర్తీ అయ్యాయని ఆయన తెలిపారు.
  6. అంతేకాదు, భారీగా 9,000mAh బ్యాటరీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
  7. అదిరే కెమెరా ఫీచర్స్‌తో ఒప్పో Find X9.. ఈ ప్రత్యేకతలు తెలుసుకున్నారా?
  8. ఇది 2026 వసంతకాలంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
  9. అయితే, ధరలను పెంచడం అన్నది అన్ని మార్కెట్లలో పనిచేసే పరిష్కారం కాదు.
  10. అయితే, ఈ ఫ్యాక్టరీలో ఏ ఉత్పత్తులు తయారవుతాయనే అంశంపై స్పష్టత లేదు.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »