Redditలో పలువురు యూజర్లు తమ ఫోన్‌లకు Nothing OS 4.0 ఇంకా రాలేదని, అధికారికంగా విడుదలైనట్లు ప్రకటించినా ప్రాక్టికల్‌గా అప్‌డేట్ కనిపించలేదని చెబుతున్నారు. వారాంతంలో ఒక Nothing Phone 3 యూజర్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించగా, అప్‌డేట్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.
Photo Credit: Nothing
Nothing ఈ నెల 21న Phone 3 కోసం Android 16 ఆధారంగా రూపొందించిన Nothing OS 4.0 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత నవంబర్ 28న Phone 2, Phone 2a, Phone 2a Plus, Phone 3a, Phone 3a Pro వంటి మోడళ్లకూ ఈ అప్‌డేట్‌ను విస్తరించింది. అయితే తాజాగా, ఈ అప్‌డేట్‌ను కంపెనీ అకస్మాత్తుగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.Redditలో పలువురు యూజర్లు తమ ఫోన్‌లకు Nothing OS 4.0 ఇంకా రాలేదని, అధికారికంగా విడుదలైనట్లు ప్రకటించినా ప్రాక్టికల్‌గా అప్‌డేట్ కనిపించలేదని చెబుతున్నారు. వారాంతంలో ఒక Nothing Phone 3 యూజర్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించగా, అప్‌డేట్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు.“మొదటగా వారు సాధారణంగా పంపే టెంప్లేట్ జవాబే షేర్ చేశారు. అప్‌డేట్ అందుబాటులో ఉందని మాత్రమే చెప్పారు. కానీ నేను నా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ఎందుకు రాలేదని అడుగుతాను కదా, అప్పుడు దానిని నిలిపివేశామని, సమస్యను పరిష్కరించే వరకు రోలౌట్ ఆపేశామని అంగీకరించారు,” అని ఆ యూజర్ చెప్పాడు. అదేవ్యక్తి Nothing సపోర్ట్ ఇచ్చిన స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. అందులో Nothing OS 4.0 రోలౌట్‌ను “తక్షణ సరి చేయాల్సిన సమస్య” కారణంగా నిలిపివేశామని స్పష్టంగా ఉంది. ఇంటర్నల్ టెస్టింగ్ పూర్తయిన తర్వాత మళ్లీ విడుదల చేస్తామని కూడా తెలిపారు. ఇప్పటికే అప్‌డేట్ పొందిన యూజర్‌లకు కూడా ఒక ఫిక్స్‌డ్ వెర్షన్‌ను త్వరలోనే పంపుతామని చెప్పారు.
ఇప్పటివరకు Nothing ఈ విషయంపై ఎలాంటి అధికారిక పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కంపెనీ తమ సోషల్ మీడియాలో గానీ, కమ్యూనిటీ పోర్టల్‌లో గానీ సమాచారం ఇవ్వడం సహజం. గత వారం కొంతమంది యూజర్లు తమ ఫోన్‌లో అప్‌డేట్ ఆప్షన్ ఒక్కసారిగా కనిపించకుండా పోయిందని చెప్పారు.
అదనంగా, అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొన్ని డివైస్‌లలో “Your device is enrolled in the Android Beta Program” అనే సందేశం కనిపించడం కూడా గందరగోళానికి దారితీసింది. ఇది స్టేబుల్ వెర్షన్‌గా విడుదలైనప్పటికీ, బీటా మెసేజ్ కనిపించడం వల్లే అప్‌డేట్‌ను నిలిపారా, లేక మరేదైనా కారణమా అనే స్పష్టత మాత్రం లేదు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లలో ఇలాంటి చిన్న సమస్యలు సాధారణమే అయినా, Nothing ముందుగానే స్పష్టమైన సమాచారాన్ని అందించాలి అన్న అభిప్రాయం యూజర్లలో కనిపిస్తోంది. ప్రస్తుతం కంపెనీ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు తెలుస్తుండగా, రాబోయే రోజుల్లో స్థిరమైన Nothing OS 4.0 వెర్షన్ మళ్లీ విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు యూజర్లు అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Elon Musk Says Grok 4.20 AI Model Could Be Released in a Month
Xiaomi 17 Global Variant Listed on Geekbench, Tipped to Launch in India by February 2026
James Gunn's Superman to Release on JioHotstar on December 11: What You Need to Know
The Boys Season 5 OTT Release Date: When and Where to Watch the Final Season Online?