ఈ కొత్త అప్‌డేట్‌ను నేడు Phone (3) సిరీస్‌కు విడుదల చేస్తున్నారు

Nothing OS 4.0లో సృజనాత్మకతకు సంబంధించిన కొత్త AI ఫీచర్లు కూడా ఉన్నాయి. Playground ద్వారా కోడింగ్ లేకుండా AI ఆధారంగా విడ్జెట్లను సృష్టించవచ్చు.

ఈ కొత్త అప్‌డేట్‌ను నేడు Phone (3) సిరీస్‌కు విడుదల చేస్తున్నారు

Photo Credit: Nothing

గ్య్లిఫ్ ప్రోగ్రెస్ వంటి ఫీచర్లతో పనితీరు, యూజర్ అనుభవం మెరుగుపడింది

ముఖ్యాంశాలు
  • Android 16 ఆధారంగా ఫాస్ట్ & స్మూత్ పనితీరు
  • కొత్త ఐకాన్లు, లాక్ స్క్రీన్ క్లాక్స్, స్మూత్ అనిమేషన్లు
  • Glyph Progress, Extra Dark Mode, Pop-up View మెరుగుదలలు
ప్రకటన

Nothing తాజాగా Android 16 ఆధారంగా అభివృద్ధి చేసిన Nothing OS 4.0 ను అధికారికంగా ప్రజలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వెర్షన్‌ను కంపెనీ “అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చే, వేగవంతమైన, ఆలోచించి రూపొందించిన” అప్‌డేట్‌గా పేర్కొంటోంది. OS 3.0 మీద ఆధారపడి రూపొందిన ఈ కొత్త సిస్టమ్‌లో వేగం, స్థిరత్వం, సిస్టమ్‌లోని ఇంటరాక్షన్లు మరింత మెరుగుపడేలా అనేక మార్పులు చేసారు. వ్యవస్థ మొత్తం మీద friction తగ్గించడానికి మినిమలిస్టిక్ ఐకాన్లు, సున్నితంగా పనిచేసే యానిమేషన్‌లు, స్మూత్ UI మార్పులు ఈ అప్‌డేట్‌కు మూలభూత మార్పులు అని Nothing చెబుతోంది.

ఈ అప్‌డేట్ “త్వరిత స్పందన, శుభ్రమైన విజువల్స్, సులభమైన పరస్పర చర్యలు మరియు భవిష్యత్ అవసరాలకు సిద్ధమైన ప్లాట్‌ఫామ్” అన్న కాన్సెప్ట్‌తో తయారైంది. కొత్త UI నిర్మాణం, రీడిజైన్ చేసిన ఐకాన్లు, మరింత వేగంగా స్పందించేలా మళ్లీ రూపొందించిన యానిమేషన్‌లు ఇవి నావిగేషన్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఓపెన్ బీటా టెస్ట్‌లో వినియోగదారులు అందించిన అభిప్రాయాలు చివరి వెర్షన్‌లో నేరుగా ప్రతిఫలించాయి.

అప్‌డేట్ చేసిన స్టేటస్ బార్ ఐకాన్లు, ఫస్ట్ పార్టీ యాప్ ఐకాన్లకు కొత్త రూపం, లోతైన Extra Dark Mode, మరింత శుభ్రంగా కనిపించే లాక్‌స్క్రీన్ పాస్‌వర్డ్ ఇంటర్‌ఫేస్, సిస్టమ్ మొత్తంలో స్మూత్ అనిమేషన్ ఇవి బీటా ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చేసిన మార్పులు. మల్టీటాస్కింగ్ అనుభవం మెరుగుపడేందుకు Dual Window సపోర్ట్‌తో కూడిన పాప్-అప్ వ్యూ, 2×2 క్విక్ సెట్టింగ్స్ టైల్స్, కొత్త విడ్జెట్ సైజులు, యాప్‌లను హైడ్ చేసే ఆప్షన్ వంటి ఫీచర్లు జోడించబడ్డాయి. రైడ్స్, డెలివరీలు, టైమర్లకు సంబంధించిన లైవ్ అప్‌డేట్‌లు ఇప్పుడు లాక్‌స్క్రీన్ మరియు గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌లో చూడవచ్చు.

ఇంటరాక్షన్ మరియు విజువల్స్ విషయంలో Nothing OS 4.0 పూర్తిగా మెరుగుపరచబడింది. మరింత శుభ్రమైన ఫస్ట్ పార్టీ ఐకాన్లు, Android 16 స్టైల్‌కు అనుగుణంగా మార్చిన స్టేటస్ బార్ సూచికలు, రెండు కొత్త లాక్‌స్క్రీన్ క్లాక్ ఫేస్‌లు, నోటిఫికేషన్ షేడ్ మరియు యాప్ ట్రాన్సిషన్‌లలో స్మూత్ అనిమేషన్‌లు ఇవి వినియోగదారికి మరింత సహజసిద్ధ అనుభవాన్ని ఇస్తాయి.

పనితీరును మెరుగుపరచడానికి మరియు వినియోగదారుడి దృష్టిని నిలబెట్టడానికి Glyph Progress వంటి ఫీచర్లు చేరాయి, ఇవి రైడ్స్, డెలివరీలు, టైమర్లపై రియల్ టైమ్ అప్‌డేట్‌లను స్క్రీన్ మరియు గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌లో చూపిస్తాయి. Extra Dark Modeలో లోతైన బ్లాక్‌లు, మెరుగైన కాంట్రాస్ట్, తక్కువ పవర్ వినియోగం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. యాప్ డ్రాయర్‌లో యాప్‌లను హైడ్ చేసే ఫీచర్, కొత్త విడ్జెట్ సైజులు, సిస్టమ్ & యాప్స్ డ్యాష్‌బోర్డ్, యూనివర్సల్ సెర్చ్ సెట్టింగ్లు అప్డేట్ అయ్యాయి.

Nothing OS 4.0లో సృజనాత్మకతకు సంబంధించిన కొత్త AI ఫీచర్లు కూడా ఉన్నాయి. Playground ద్వారా కోడింగ్ లేకుండా AI ఆధారంగా విడ్జెట్లను సృష్టించవచ్చు. Widget Drawer వ్యక్తిగత మరియు కమ్యూనిటీ విడ్జెట్‌లను సులభంగా నిర్వహించేలా రూపొందించబడింది. త్వరలో రానున్న Essential Memory సేవ్ చేసిన క్యాప్చర్లు, నోట్స్, స్క్రీన్‌షాట్‌లను గుర్తించి సహజమైన ప్రశ్నల ద్వారా తిరిగి అందించే ఫీచర్‌గా పనిచేస్తుంది.

ప్రైవసీ పరంగా Nothing OS 4.0 మరింత పారదర్శకతను అందిస్తోంది. ఎప్పుడు AI మోడల్ పనిచేస్తుందో చూపించే AI Status Hints మరియు Usage Dashboard వంటి ఫీచర్లను చేరుస్తూ యూజర్‌కు పూర్తిస్థాయి నియంత్రణను ఇస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌ను నేడు Phone (3) సిరీస్‌కు విడుదల చేస్తున్నారు. రాబోయే వారాల్లో మిగతా Nothing ఫోన్లకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ కొత్త అప్‌డేట్‌ను నేడు Phone (3) సిరీస్‌కు విడుదల చేస్తున్నారు
  2. సరసమైన ధరకే ఒప్పో కె15 టర్బో.. ఈ ఫీచర్స్ గురించి తెలుసా?
  3. మార్కెట్లోకి రానున్న రియల్ మీ 16 ప్రో.. అదిరే ఫీచర్స్ ఇవే
  4. MediaTek తెలిపిన వివరాల ప్రకారం, Dimensity Cockpit P1 Ultra మూడు వేర్వేరు వెర్షన్లలో రానుంది
  5. అదనంగా, Plus Mind AI ఫీచర్‌ను యాక్టివేట్ చేసే షార్ట్‌కట్‌గా కూడా ఇది పనిచేయనుంది
  6. రియర్ భాగంలో మూడు 50 మెగాపిక్సల్ కెమెరాలతో కూడిన సిస్టమ్‌ను అందించారు.
  7. అదిరే ఫీచర్స్‌తో రానున్న రెడ్ మీ K90 అల్ట్రా.. బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే?
  8. Wobble One ను మైథిక్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్ మరియు ఒడిస్సి బ్లూ అనే మూడు రంగుల్లో అందిస్తున్నారు.
  9. Agni 4 లో MediaTek Dimensity 8350 చిప్సెట్ను ఉపయోగించారు
  10. వివో ఎక్స్ 300, ఎక్స్ 300 ప్రో ధర లీక్.. స్టార్టింగ్ ప్రైస్ ఎంతంటే?
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »