డిజైన్ పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్‌తో ఆకర్షణీయమైన ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ఫోన్‌లోని కెమెరా సెటప్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. రియర్ కెమెరాలో 50MP Sony LYT-600 సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా, OIS సపోర్ట్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో కెమెరా ఇవ్వబడ్డాయి.
Photo Credit: Wobble
5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ 47 గంటల కాలింగ్, 24 గంటల వీడియో స్ట్రీమింగ్, 22 రోజుల స్టాండ్బై అందిస్తుంది
ఇండ్కాల్ టెక్నాలజీస్‌కు చెందిన Wobble బ్రాండ్, భారత మార్కెట్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్ Wobble One ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ముందే ఇచ్చిన హామీ ప్రకారం, ఈ ఫోన్‌ను ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చారు. Wobble One లో 6.67-అంగుళాల FHD+ 120Hz ఫ్లాట్ AMOLED స్క్రీన్‌తో పాటు Dolby Vision సపోర్ట్‌ను అందించారు. పనితీరు విషయంలో, ఈ డివైస్ MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌పై నడుస్తూ Epic HyperEngine గేమింగ్ టెక్నాలజీతో మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 12GB RAM వరకు లభించే ఈ ఫోన్, రోజువారీ పనులనైనా గేమింగ్‌నైనా సులభంగా నిర్వహించగలదని కంపెనీ చెబుతోంది.
డిజైన్ పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్‌తో ఆకర్షణీయమైన ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. ఫోన్‌లోని కెమెరా సెటప్ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. రియర్ కెమెరాలో 50MP Sony LYT-600 సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా, OIS సపోర్ట్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో కెమెరా ఇవ్వబడ్డాయి. ముందుభాగంలో 50MP సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు, ఇది ఫోటోలు, వీడియో కాల్స్ మరియు రికార్డింగ్‌లలో మంచి పనితీరును కనబరుస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Wobble One Android 15 పై నడుస్తూ Google AI ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా, ఇందులో ఎటువంటి బ్లోట్వేర్ లేకపోవడం యూజర్ అనుభవాన్ని మరింత సులభంగా మరియు వేగవంతంగా మారుస్తుంది.
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉండగా, ఒకసారి ఛార్జ్ చేస్తే 47 గంటల కాలింగ్, 24 గంటల వీడియో స్ట్రీమింగ్ మరియు దాదాపు 22 రోజుల స్టాండ్బై టైమ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 6, Bluetooth 5.4, USB Type-C, GPS వంటి అన్ని అవసరమైన ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు 3.5mm ఆడియో జాక్‌ను కూడా జోడించడం యూజర్లకు అదనపు సౌలభ్యాన్ని అందిస్తుంది.
Wobble One ను మైథిక్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్ మరియు ఒడిస్సి బ్లూ అనే మూడు రంగుల్లో అందిస్తున్నారు. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 22,000 నుండి ప్రారంభమవుతుంది. అదనంగా 8GB + 256GB మరియు 12GB + 256GB వేరియంట్లు కూడా లభ్యమవుతాయి. ఈ ఫోన్ డిసెంబర్ 12 నుంచి Amazon.in మరియు ప్రధాన రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ సందర్భంగా ఇండ్కాల్ టెక్నాలజీస్ CEO ఆనంద్ దువే మాట్లాడుతూ...Wobble స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టడం కేవలం ఒక ప్రొడక్ట్ విడుదల మాత్రమే కాకుండా, కంపెనీ భవిష్యత్తు దిశను ప్రతిబింబించే కీలక అడుగని అన్నారు. నేటి యూజర్ల ఆశలు మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించేలా, ప్రపంచస్థాయి పనితీరుతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో Wobble One రూపుదిద్దుకున్నదని ఆయన చెప్పారు. ఇది కంపెనీ ఇన్నోవేషన్, నైపుణ్యం, మరియు భారతదేశం పెరుగుతున్న టెక్నాలజీ సామర్థ్యాలను ప్రతిబింబించే తొలి ముందడుగు అని తెలిపారు
ప్రకటన
ప్రకటన
Xbox Partner Preview Announcements: Raji: Kaliyuga, 007 First Light, Tides of Annihilation and More
YouTube Begins Testing Built-In Chat and Video Sharing Feature on Mobile App
WhatsApp's About Feature Upgraded With Improved Visibility, New Design Inspired by Instagram Notes