Weiboలో షేర్ చేసిన చిత్రాల్లో OnePlus Ace 6T బ్లాక్, గ్రీన్, వైలెట్ అనే మూడు రంగుల్లో కనిపించింది. ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు, అతి సన్నని బెజెల్స్‌ను ఉపయోగించడం ద్వారా మరింత ఇమ్మర్సివ్ విజువల్ అనుభవాన్ని అందించాలన్న లక్ష్యాన్ని కంపెనీ వెల్లడించింది.
Photo Credit: OnePlus
ఒన్ప్లస్ ఏస్ 6టి స్క్వేర్ కెమెరా డిజైన్, రెండు కెమెరాలు LED ఫ్లాష్.
చైనాలో త్వరలో విడుదల కానున్న OnePlus Ace 6T, OnePlus 15కి నాన్-ఫ్లాగ్‌షిప్ సిబ్లింగ్‌గా మార్కెట్‌లోకి రానుందని అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటనకు ముందు కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను బయటకు విడుదల చేసింది . దీని డిజైన్, కలర్ ఆప్షన్‌లు తాజాగా విడుదలైన OnePlus 15 పోలికలతో ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్, స్క్వేర్ కెమెరా మాడ్యూల్, ఇంకా భారీ 8,000mAh బ్యాటరీతో ఉన్నాయి.Weiboలో షేర్ చేసిన చిత్రాల్లో OnePlus Ace 6T బ్లాక్, గ్రీన్, వైలెట్ అనే మూడు రంగుల్లో కనిపించింది. ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు, అతి సన్నని బెజెల్స్‌ను ఉపయోగించడం ద్వారా మరింత ఇమ్మర్సివ్ విజువల్ అనుభవాన్ని అందించాలన్న లక్ష్యాన్ని కంపెనీ వెల్లడించింది. వెనుక భాగంలో ఉన్న గ్లాస్-ఫైబర్ ప్యానల్ ‘సిల్క్ గ్లాస్' లాంటి మృదువైన టెక్స్చర్‌ను కలిగి ఉంటుందని, అలాగే ఫింగర్‌ప్రింట్లు పట్టకుండా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు పేర్కొంది.
కెమెరా సెక్షన్‌లో OnePlus Ace 6Tలో OnePlus 15ను తలపించేలా స్క్వేర్ డిజైన్‌ను అందించారు. దీంట్లో వెర్టికల్ పిల్ ఆకారంలో అమర్చిన రెండు కెమెరాలు, పక్కనే LED ఫ్లాష్ కనిపిస్తాయి. అదేవిధంగా, ప్లస్ కీ అనే కొత్త ఫీచర్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ కీని సైలెంట్ మోడ్, టార్చ్, కెమెరా, ట్రాన్స్‌లేట్, ఫ్లాష్‌లైట్, రికార్డింగ్, స్క్రీన్‌షాట్, డూ నాట్ డిస్టర్బ్ వంటి అనేక ఫంక్షన్లకు కస్టమైజ్ చేయవచ్చు. అదనంగా, Plus Mind AI ఫీచర్‌ను యాక్టివేట్ చేసే షార్ట్‌కట్‌గా కూడా ఇది పనిచేయనుంది.
స్పెసిఫికేషన్‌లను మొత్తం వెల్లడించకపోయినా, అధికారికంగా నిర్ధారించిన ముఖ్యమైన అంశం బ్యాటరీ. 8,000mAh భారీ బ్యాటరీతో వస్తున్న ఈ మోడల్, ఇప్పటివరకు OnePlus విడుదల చేసిన ఫోన్లలోనే అతి పెద్ద సెల్‌ను కలిగి ఉండనుంది. పనితీరు విషయంలో, రాబోయే Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌తో Ace 6T వస్తుందని ప్రముఖ టిప్‌స్టర్లు పేర్కొన్నారు. ఇది Snapdragon 8 Elite స్థాయి పనితీరును అందిస్తూ, మరింత మెరుగైన ఎనర్జీ ఎఫిషియన్సీని కలిగి ఉంటుందనే సమాచారం ఉంది.
కెమెరా విభాగంలో 50MP మెయిన్ సెన్సర్, 15MP అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా భారతదేశంలో, ఈ మోడల్‌ను OnePlus 15R పేరుతో విడుదల చేసే అవకాశమున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
Huawei Mate 80, Mate 80 Pro, Mate 80 Pro Max and Mate 80 RS Master Edition Launched: Price, Specifications