Lava Agni 4 ను భారత్లో రూ. 22,999 ధరకు విడుదల చేశారు. 8GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న ఒకే వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది
Photo Credit: Lava
Lava Agni 4 మూడు ప్రధాన Android అప్‌డేట్‌లను పొందుతుంది
భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Lava గురువారం తమ కొత్త స్మార్ట్ఫోన్ Lava Agni 4-ను అధికారికంగా విడుదల చేసింది. గత సంవత్సరం అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చిన Lava Agni 3 తర్వాత వచ్చిన ఈ తాజా మోడల్, డిజైన్, పనితీరు మరియు AI ఫీచర్ల విషయంలో గణనీయమైన అప్గ్రేడ్లను తీసుకుని వచ్చింది. Lava Agni 4 ను భారత్లో రూ. 22,999 ధరకు విడుదల చేశారు. 8GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న ఒకే వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ ప్రకారం ఇది ఇంట్రడక్టరీ ప్రైసింగ్, అంటే ప్రారంభ ఆఫర్ ధర అని స్పష్టం చేసింది మరియు ఇందులో డెబిట్/క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు కూడా చేరినట్టే.
ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మోడల్ నవంబర్ 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon లో కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ ఫోన్ సాఫ్ట్వేర్ చూస్తే, Lava Agni 4 స్టాక్ Android 15 పై నడుస్తుంది. మూడు పెద్ద Android అప్డేట్లు మరియు నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు వస్తాయని బ్రాండ్ హామీ ఇస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫ్లాట్ AMOLED స్క్రీన్ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2,400 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్, 446 PPI పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది.
అల్యూమినియం అల్లాయ్ మెటల్ ఫ్రేమ్, ముందుభాగంలో 1.7mm సమాన బెజెల్స్, వెనుక భాగంలో మ్యాట్ AG గ్లాస్ ఫినిష్ ఇవన్నీ ఫోన్ను మరింత ప్రీమియంగా చూపిస్తాయి. అదనంగా, సూపర్ యాంటీ డ్రాప్ డైమండ్ ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, IP64 రేటింగ్ వంటి రక్షణ ఫీచర్లు కూడా అందించబడ్డాయి.
తడి లేదా ఆయిల్ ఉన్న చేతులతో స్క్రీన్ను ఆపరేట్ చేసినా సెన్సిటివిటీ తగ్గకుండా ఉండేందుకు Wet Touch Control కూడా ఇందులో ఉంది.
Agni 4 లో MediaTek Dimensity 8350 చిప్సెట్ను ఉపయోగించారు 8GB LPDDR5X RAM మరియు 256GB UFS 4.0 స్టోరేజ్ తో కలిసి ఈ ఫోన్ స్మూత్ పనితీరును అందిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ ఫోన్కు AnTuTu v10 స్కోరు 1.4 మిలియన్లకుపైగా వస్తుందని చెబుతోంది. థర్మల్ మేనేజ్మెంట్ కోసం 4,300 sq.mm VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ను అందించారు. కెమెరా విషయం చూస్తే ఇందులో 50MP OIS ప్రధాన కెమెరా (f/1.88), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, ముందు భాగంలో 50MP EIS సెల్ఫీ కెమెరా సెట్ చేశారు.
AI ఫీచర్లు
ఇది ఫోన్ను సహజమైన సంభాషణలతో ఆపరేట్ చేసేలా రూపొందించబడింది. Google యొక్క Circle to Search సపోర్ట్ కూడా ఇందులో అందించబడింది.
ఇక ఈ ఫోన్లో 5,000mAh బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తున్నారు.
కంపెనీ ప్రకారం, ఫోన్ 19 నిమిషాల్లో 50% వరకూ ఛార్జ్ అవుతుంది.
కనెక్టివిటీగా పరంగా 5G, Wi-Fi 6E, Bluetooth 5.4, USB 3.2 Type-C, IR Blaster ఉన్నాయి. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్, యాప్ లాక్, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Xbox Partner Preview Announcements: Raji: Kaliyuga, 007 First Light, Tides of Annihilation and More
YouTube Begins Testing Built-In Chat and Video Sharing Feature on Mobile App
WhatsApp's About Feature Upgraded With Improved Visibility, New Design Inspired by Instagram Notes