మరోవైపు, Oppo Find X9 Pro కేవలం ఒకే వేరియంట్‌లో వస్తుంది . 16GB RAM + 512GB స్టోరేజ్. ఈ ప్రో వెర్షన్ రెండు అద్భుతమైన సిల్క్ వైట్ మరియు టైటానియం చార్కోల్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
Photo Credit: Oppo
ఒప్పో ఫైండ్ X9 సిరీస్ అక్టోబర్ 16న చైనాలో ప్రారంభించబడింది.
OPPO సంస్థ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Oppo Find X9 సిరీస్‌ను నవంబర్ 18న భారతదేశంలో ఆవిష్కరించనుంది. ఈ సిరీస్‌లో రెండు మోడళ్లు అందుబాటులో ఉంటాయి.... Oppo Find X9 మరియు Oppo Find X9 Pro. ఇప్పటికే చైనాలో అక్టోబర్ 16న వీటిని పరిచయం చేశారు. భారత లాంచ్‌కు ముందు కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ల వివరాలను జాబితా చేసింది, వాటిలో RAM, స్టోరేజ్ వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్లును కూడా వెల్లడించింది. సాధారణ Oppo Find X9 రెండు రంగుల్లో లభిస్తుంది ... స్పేస్ బ్లాక్ మరియు టైటానియం గ్రే. అలాగే ఇది రెండు మెమరీ వేరియంట్లలో లభిస్తుంది. ఒక వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్తో వస్తుంటే మరొక వేరియంట్ 16GB RAM + 512GB స్టోరేజ్తో వస్తుంది.
మరోవైపు, Oppo Find X9 Pro కేవలం ఒకే వేరియంట్‌లో వస్తుంది . 16GB RAM + 512GB స్టోరేజ్. ఈ ప్రో వెర్షన్ రెండు అద్భుతమైన సిల్క్ వైట్ మరియు టైటానియం చార్కోల్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. కొత్త ఫైండ్ X9 సిరీస్‌ను తొలి రోజుల్లో కొనుగోలు చేసే వారికి OPPO సంస్థ ప్రత్యేకంగా “ప్రివిలేజ్ ప్యాక్”ను అందిస్తోంది. దీని ధర రూ.99 మాత్రమే. ఈ ప్యాక్‌లో రూ. 1,000 విలువైన ఎక్స్చేంజ్ కూపన్, ఉచిత SUPERVOOC 80W పవర్ అడాప్టర్, అలాగే రెండు సంవత్సరాల బ్యాటరీ ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తాయి. ఇవన్నీ కొత్తగా కొనుగోలు చేసిన ఫోన్‌తో పాటు వస్తాయి.
ఫైండ్ X9 మరియు ఫైండ్ X9 ప్రో రెండూ Dimensity 9500 SoC ప్రాసెసర్‌తో నడుస్తాయి. ఇవి గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, మరియు Arm G1-Ultra GPUతో వస్తాయి, ఇది గేమింగ్ మరియు గ్రాఫిక్స్ పనితీరును మరింత శక్తివంతం చేస్తుంది. ఫోన్లు తాజా ColorOS 16 (Android 16 ఆధారంగా) నడుస్తాయి.
రెండు మోడళ్లలోను ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది, ఇది 95.5% స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఆకట్టుకుంటుంది. కెమెరా విభాగంలో మూడు వెనుక కెమెరాలతో వస్తాయి.రెండింటిలోనూ 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. Find X9లో 50MP టెలిఫోటో కెమెరా, Find X9 Proలో అధునాతన 200MP టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం విషయంలో కూడా ఈ ఫోన్లు బలంగా ఉన్నాయి. Find X9లో 7,050mAh బ్యాటరీ, Find X9 Proలో మరింత పెద్ద 7,500mAh బ్యాటరీ అందుబాటులో ఉంటుంది.
మొత్తం మీద, Oppo Find X9 సిరీస్ భారత మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్‌కు కొత్త ప్రమాణాలను స్థాపించేలా కనిపిస్తోంది. శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్, మరియు ఫ్లాగ్‌షిప్ స్థాయి కెమెరా సామర్థ్యాలతో ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడం ఖాయం.
ప్రకటన
ప్రకటన
iPhone 20 Series Tipped to Launch With an Under Display Selfie Camera in 2027
ZTE Blade V80 Vita Leaked Render Suggests Design Similar to iPhone 17 Pro